తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @ 1 PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 1 PM

By

Published : Jun 28, 2021, 12:59 PM IST

Updated : Jun 28, 2021, 1:19 PM IST

  • జ్ఞానభూమిలో పీవీ శతజయంతి ఉత్సవాలు

పీవీ శతజయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో... పీవీ మార్గ్​లోని జ్ఞానభూమిలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్​ తమిళి సై ముఖ్యమంత్రి కేసీఆరై హాజరై... 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పీవీది అద్భుత మేధస్సు..

ఆర్థిక సంస్కరణలో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు, మాజీ ప్రధాని పీవీ శతజయంతిని పురస్కరించుకుని.. భారత్​కు ఆయన చేసిన సేవలను పలువురు ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. పీవీకి ఘన నివాళులు అర్పించారు. ఆయన చూపిన మార్గం దేశ ప్రగతికి దిక్సూచి లాంటిదని ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అగ్ర రాజ్యాన్ని దాటిన భారత్

టీకా పంపిణీలో భారత్​ అమెరికాను దాటిందని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 32,36,63,297 డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దూరం తగ్గించడానికే లింకు రోడ్లు..

రాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం కోసం ఐదు లింక్​రోడ్లను ఇవాళ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వివిధ ప్రణాళికలతో వ్యూహాత్మకంగా.. భాగ్యనగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వీహెచ్‌ను పరామర్శించిన రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో... వరుసగా కాంగ్రెస్ నేతలతో కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నేత వి.హనుమంతరావును కలిసి పరామర్శించారు. వీహెచ్ ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులను ఆరా తీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అడవిలో బంధించి.. గ్యాంగ్ రేప్

మహిళను అడవిలో బంధించి మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు కిరాతకులు. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాడ్లతో దాడి.. ఎమ్మెల్యేకు గాయాలు

త్రిపురలో సీపీఎం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. రాజ్​నగర్​ బజార్​ ప్రాంతంలో భాజపా, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. కర్రలు, రాడ్లతో కొట్టుకున్నారు. ఈ దాడిలో సీపీఎం ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడ్డారు. ఇరువర్గాలకు చెందిన మొత్తం 13 మందికి గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరో ఏడాది పాటు..

అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలాన్ని మరోసారి పొడిగించింది కేంద్రం. ఈ మేరకు 2022 జూన్ 30 వరకు ఆయన ఏజీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బోల్ట్ రికార్డు బద్దలు

పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్​ రికార్డును అమెరికా స్ప్రింటర్ ఎర్రియోన్ అధిగమించాడు. యూఎస్ ఒలింపిక్ ట్రయల్స్​లో భాగంగా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి ఈ ఘనత సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హనుమాన్​ దొరికేశాడు!

ప్రభాస్ 'ఆదిపురుష్' లో ఆంజనేయుడి పాత్రధారి ఎవరో తెలిసిపోయింది! ఇందుకు సంబంధించి ఓ నటుడి పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ అతను ఎవరంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 28, 2021, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details