తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 1 PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP TEN NEWS @ 1 PM
టాప్​టెన్​ న్యూస్​ @ 1PM

By

Published : Jun 25, 2021, 1:01 PM IST

  • పనులు చేపడితే జైలుకు పంపుతాం...

రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకేనని హెచ్చరిక. విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామంటూ ఏపీ సీఎస్‌కు హెచ్చరిక. పర్యావరణ అనుమతుల్లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • బోనాల నిర్వహణపై...

ఈ ఏడు భాగ్యనగరంలో బోనాల పండగను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు నిధులు, శాఖల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • నకిలీ విత్తనాల గుట్టురట్టు...

రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ పోలీసులు నకిలీ విత్తనాల గుట్టురట్టు చేశారు. రూ.60 లక్షల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.77 లక్షల విలువైన గడువు తీరిన విత్తనాలు సీజ్ చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • చీకటి రోజులను మరువలేం...

దేశంలో ఇదే రోజున అత్యవసర పరిస్థితి అమలులోకి వచ్చిన క్రమంలో ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరువలేమన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • దేశవ్యాప్త ఆందోళన...

ద్రవ్యోల్బణం, చమురు సహా.. నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జులై 7 నుంచి 10 రోజుల పాటు ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది కాంగ్రెస్​. బ్లాక్​, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ నిరసనలు కొనసాగిస్తామని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • వీడియో వైరల్​...

త‌మిళ‌నాడు తిరుచ్చిలోని జంబుకేశ్వర అఖిలాండేశ్వరి ఆల‌యంలో కొత్తగా నిర్మించిన నీటి కొలనులో అంబారీ ఏనుగు అఖిల జ‌ల‌కాలాడింది. నీటిని చూడగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయింది. కొలను అంతా క‌లియ‌తిరుగుతూ, నీళ్లలో ప‌డి దొర్లుతూ వేస‌వి తాపాన్ని చల్లార్చుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • 5 సార్లు అంత్యక్రియలకు సిద్ధం!...

కొవిడ్​ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. ఈ వైరస్​ బారినపడి రోజుల తరబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే.. ప్రపంచంలోనే సుదీర్ఘకాలం వైరస్​ చెరలో మగ్గారు బ్రిటన్​కు చెందిన ఓ వ్యక్తి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • రూ.30వేలు రావాలంటే...

ఉద్యోగ విరమణ తరువాత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అనుకుంటారు చాలా మంది. మరి కొంతమంది అమ్మాయి పెళ్లి, సొంత ఇల్లు నిర్మాణం లాంటివి చేయాలని భావిస్తారు. ఇందుకు వారికి వచ్చే జీతం నుంచి కొంత మదుపు చేయాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • మారిన బీసీసీఐ ఆలోచన...

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన టీమ్​ఇండియా.. ఆగస్టు నుంచి ఇంగ్లాండ్​తో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే ఈ మధ్యలో వార్మప్ మ్యాచ్​లు లేకపోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిని నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ప్రస్తుతం ఈసీబీతో చర్చలు జరుపుతోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • అందుకోసమే పోటీ!...

'మా' అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. సెప్టెంబర్‌ నెలలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయనున్న ఆయన గురువారం సాయంత్రం తన ప్యానెల్‌ని ప్రకటించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details