- ఏరువాక పున్నమి...
భద్రాద్రి రాముడి సన్నిధిలో ఏరువాక పున్నమి ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. లక్ష్మణసమేతసీతారాములకు అర్చకులు వైభవంగా అభిషేకం జరిపారు. గంధోదకములు, హరిద్రా చూర్ణములు, సమస్త నదీ జలాలతో తిరుమంజనం నిర్వహించారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- యాజమాన్యాల సన్నద్ధం...
జూలై ఒకటో తేదీ నుంచి పాఠశాలలు తెరిచేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు కరోనా భయం.. మరోవైపు తల్లిదండ్రుల్లో ఆందోళనల మధ్య స్కూళ్లు తెరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మూడో వేవ్ వస్తే.. ఏం చేస్తారు?...
పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని.. సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఆ పరిశ్రమకు ఊతమివ్వాలి...
ప్రధాని నరేంద్ర మోదీ 'టాయ్‌కాథోన్-2021(Toycathon-2021)' సదస్సులో వర్చువల్‌గా హాజరయ్యారు. బొమ్మల తయారీ పరిశ్రమలో భారత వాటాను పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- సూరత్ కోర్టుకు రాహుల్...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు. 2019 నాటి పరువునష్టం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తుది వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- భారత్ వెళ్లిపోండి!...