తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

టాప్ ​టెన్​ న్యూస్​ @9AM
టాప్ ​టెన్​ న్యూస్​ @9AM

By

Published : Jun 28, 2021, 8:59 AM IST

Updated : Jun 28, 2021, 9:21 AM IST

  • నవ భారత నిర్మాత..

సంస్కరణల పథంతో దేశ గతిని మార్చిన సమున్నత వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఆర్థికవ్యవస్థ దివాళా అంచున ఉన్న సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తెలుగు కీర్తి శిఖరం. అనేక సవాళ్లను ఒంటిచేత్తో ఎదుర్కొన్న అపర చాణక్యుని శత జయంతుత్సవాలను జరుపుకోవడం తెలుగువారికే కాక.. దేశ ప్రజలందరికీ గర్వకారణమే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హస్తం పార్టీలో అసమ్మతి సెగలు..

రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌ రెడ్డి నియామకంపై కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి సెగలు చెలరేగుతున్నాయి. మొదటి నుంచి రేవంత్‌ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించొద్దంటూ వ్యతిరేకిస్తూ వస్తున్న నాయకులు రగిలిపోతున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్లు బాహాటంగానే విమర్శలు చేస్తుండగా... మరి కొందరు నాయకులు పదవులకు, పార్టీకి రాజీనామా చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎస్సీల సాధికారతే ధ్యేయం..

రాష్ట్రంలో సర్వశక్తులు వినియోగించి ఎస్సీల సాధికారత సాధించటమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. ఒక్కో నిరుపేద ఎస్సీ కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తామని.. 12వందల కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. తాము కూడా పురోగమించగలమనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు సాగాలన్న సీఎం... ఇంకా నిర్లక్ష్యం చేస్తే రేపటి తరాలు నష్టపోతాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భయం గుప్పిట్లో ముంపు బాధితులు..

చెమట చిందించి ఒక్కో ఇటుకను పేర్చి కట్టుకున్న ఇంటి గోడల నెర్రెలు రోజురోజుకు పెద్దదవుతున్నాయి. పైకప్పు పెచ్చులూడి వాన నీరు వరదగా కురుస్తోంది. ఎప్పుడు ఏ గోడ కూలుతుందో.. ఏ ఇంటి పైకప్పు విరిగి మీద పడుతుందో తెలియదు. ఏదో ఒక రోజు వదిలేయాల్సిన ఇంటి మరమ్మతులకు డబ్బు ఖర్చు ఎందుకనేది వారి ఆలోచన. కానీ పాడైపోయిన ఇళ్లల్లో... అభద్రత మధ్య నివసించడమెలా? రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితుల గోడు ఇది. పునరావాస వసతుల కల్పనలో కొన్నిచోట్ల జాప్యం జరుగుతుండడమే దీనికి కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చిక్కిన భారీ చేప..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్యకారుల వలకు భారీ చేప(Big fish) చిక్కింది. ఇంత భారీ చేప లభించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఆ ఫిష్​ బరువు 26 కిలోలు ఉంటుందని మత్స్యకారులు పేర్కొన్నారు. గత 10 రోజులుగా ఈ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువ మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మధ్య మానేరు ప్రాజెక్టు గేట్ల దిగువన జల ప్రవాహానికి భారీగా చేపలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పిల్లల ప్రాణాలు తీసిన క్షణికావేశం..

క్షణికావేశం ఓ కుటుంబంలో విషాదం నింపింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల మృతికి కారణమయ్యింది. భర్త తన మాట వినకుండా ఓ పంచాయతీకి వెళ్లాడని.... తల్లి ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకుంది. అల్లారుముద్దుగా పెరగాల్సిన చిన్నారులు విగతజీవులుగా మారిన దృశ్యం అందరినీ కలిచివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీజేఐకి ధన్యవాదాలు..

కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులకు ప్రభుత్వపరంగా సాయం అందించాలని కోరుతూ.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు లేఖ రాయడాన్ని బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా(బీసీఐ) స్వాగతించింది. ఈ మేరకు బీసీఐ ఓ ప్రకటనలో జస్టిస్​ ఎన్వీ రమణకు ధన్యవాదాలు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దూసుకొస్తున్న తాలిబన్లు..

అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభమైన నేపథ్యంలో అఫ్గాన్​​లో శాంతి, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే కనిపిస్తోంది. అక్కడ రోజురోజుకూ తాలిబన్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. సైన్యం బలహీనతను ఆసరాగా చేసుకుని తమ ప్రాబల్యాన్ని విస్తరిస్తున్న తాలిబన్లు.. రెండు నెలల్లోనే 30 జిల్లాలను ఆక్రమించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పతకం అసాధ్యమేమీ కాదు..

ఒలింపిక్స్​లో పతకం సాధించడం అసాధ్యమేమీ కాదని అంటున్నాడు భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజు(Satwiksairaj Rankireddy). టోక్యో ఒలింపిక్స్‌ కోసం చిరాగ్‌ శెట్టితో కలిసి పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు సాత్విక్‌ వివరించాడు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చనిపోదామని అనుకున్న..

మూడేళ్లకే నటించడం మొదలుపెట్టారు.. ఆరేళ్లకే పాటలు పాడటం ప్రారంభించారు గాయని కల్పన. సంగీతమే కాదు చదువూ తనకు ఎంతో ఇష్టమంటారు కల్పన. ఒకానొక సమయంలో చనిపోదామనుకున్న ఆమె ఆలోచనని మార్చిందెవరు? తన వల్ల సినీ పరిశ్రమ పరువు పోతుందని ఎందుకన్నారు?పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 28, 2021, 9:21 AM IST

ABOUT THE AUTHOR

...view details