తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9am

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News 9am
టాప్​టెన్​ న్యూస్​ @9am

By

Published : Jul 25, 2020, 9:00 AM IST

  • అంతకంతకూ..

రాష్ట్రంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. శుక్రవారం కొత్తగా 1640 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 52,466కు చేరింది. మరో 8 మంది మృతి చెందగా... మరణాల సంఖ్య 455కి చేరింది. కరోనా బాధితుల్లో... 76.8 శాతం మేర కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • అడుగడుగునా అడ్డంకులే..

ఒక ప్రైవేటు ఉద్యోగి(40)కి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన భార్యకూ వైరస్‌ ఉన్నట్లు తేలగా, పిల్లలిద్దరికీ కరోనా సోకలేదు. లక్షణాలు లేకపోవడం వల్ల ఇంట్లోనే చికిత్స తీసుకోమని వైద్యసిబ్బంది సలహా ఇచ్చారు. ఇంటికెళ్లాడు గానీ.. ఏం మందులు వాడాలి? ఎవరిని సంప్రదించాలో అంతా అయోమయ పరిస్థితి. చివరకు తెలిసిన వారి ద్వారా ఒక వైద్యుడిని ఫోన్‌లో సంప్రదించారు. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • ఇక్కడ తగ్గుతూ.. అక్కడ పెరుగుతూ!

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 1,640 కరోనా కేసులు నమోదుకాగా... ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్​లో 683 మందికి వైరస్ నిర్ధారణ అయింది. గతంలో నగరంలో ఎక్కువ కేసులు నమోదు కాగా... జిల్లాల్లో అతి తక్కువగా ఉండేవి. ముఖ్యంగా నగరానికి నలువైపులా ఉన్న జిల్లాల్లో వైరస్‌ వ్యాపిస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • ఎన్నాళ్లీ ప్రసవ వేదన..

పురిటినొప్పులు పునర్జన్మతో సమానమంటారు. ప్రతి రూపానికి ప్రాణం పోసేందుకు ఆ మహిళ ప్రాణాన్ని సైతం పణంగా పెడుతుంది. అలాంటి పురిటి నొప్పులను సైతం ధైర్యంగా ఎదుర్కొంటున్న నిండు గర్భిణులకు.. ఏజెన్సీ పల్లెల్లో ప్రసవానికి ముందు ఎదురయ్యే కష్టాలు మాత్రం దినదిన గండంగా మారుతున్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • కరోనా తెచ్చిన తంటా..

పెళ్లింట కరోనా కష్టాలు మోసుకొస్తోంది. వధూవరుల్లో ఎవరో ఒకరు కొవిడ్‌ బారిన పడుతుండటంతో కొన్ని వివాహాలు వాయిదా పడుతుండగా... మరికొన్నింట్లో కల్యాణమైన కొద్ది గంటల్లోనే నవదంపతుల్లో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలుతోంది. ఆయా వేడుకలకు హాజరైన వారంతా క్వారంటైన్‌కి వెళ్లాల్సి వస్తోంది. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • తెలుగు వెలగాలి..

మాతృభాష, మాతృమూర్తిని మరచిపోకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పిల్లలకు మాతృభాష నేర్పడం ఇంటి నుంచే మొదలుపెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. మాతృభాష ప్రతి ఒక్కరి ఇంటిభాష కావాలన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • ప్రైవేటుకు మరిన్ని..

దేశంలో రైల్వే ప్రైవేటీకరణ తర్వాత రైల్వే శాఖ రైల్వే స్టేషన్లపై దృష్టి సారించింది. స్టేషన్ల ప్రాధాన్యత ఆధారంగా పునరాభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఈ జాబితాలో ఉండగా.. తాజాగా తెలంగాణలోని మరో 14 స్టేషన్లను ఎంపిక చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • స్వదేశీ దెబ్బ..

చైనాకు చెందిన స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థలపై బాయ్​కాట్​ చైనా, వోకల్​ ఫర్ లోకల్​ ప్రభావం తీవ్రంగా పడింది. భారత్​లో చైనా స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థల మార్కెట్ వాటా ఏప్రిల్​-జూన్​ మధ్య 81 శాతం నుంచి 72 శాతానికి పడిపోయినట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • అప్పటి నుంచే ప్రారంభం..

దేశంలో త్వరలోనే ఆటలు తిరిగి మొదలు కావొచ్చని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​​ రిజిజు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పోటీలు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్నినింపుతాయని అన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • సూపర్​స్టార్​కు ఫైన్..

సీట్​ బెల్ట్ ధరించని కారణంగా సూపర్​స్టార్ రజనీకాంత్​కు రూ.100 జరిమానా విధించారు చెన్నై ట్రాఫిక్ పోలీసులు. అనంతరం ఆ మొత్తాన్ని చెల్లించారు ఈ కథానాయకుడు. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details