- రాజధానిలో భారీ వర్షం..
ఛత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాజధానిలో భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయం కాగా.. మరికొన్ని చోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి.
- కరెంటు తీగలకు ఇద్దరు బలి..
కరెంటు తీగలు తెగి పడ్డాయి. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కోరుట్ల పరిధిలోని ఎగ్గింపూర్లో చోటుచేసుకుంది. మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి.
- కరోనా ఉద్ధృతి..
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది. కొత్తగా కొవిడ్‌తో తొమ్మిది మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 438కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 1,281 మంది డిశ్చార్జయ్యారు. మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి.
- గుడ్‌న్యూస్..
అక్టోబర్ కల్లా కరోనా మహమ్మారిని నియంత్రించ గల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో తదుపరి దశ ప్రయోగాలు భారత్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి.
- మూడో స్థానంలో తెలంగాణ..
దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ కూడా అదే స్థాయిలో ఉండటం కొంత ఊరట కలిగించే అంశం. అన్ని రాష్ట్రాల్లో కలిపి నిన్న ఒక్కరోజులో 28,472 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి. రికవరీలో దేశ రాజధాని దిల్లీ మొదటి స్థానంలో ఉండగా, మూడో స్థానంలో తెలంగాణ ఉంది. మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి.
- అన్నదాత మోము కళకళ..