- కాస్త తగ్గింది..
తెలంగాణలో కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో తాజాగా 1,198 కొవిడ్ కేసులు నమోదు కాగా.. వైరస్‌తో ఏడుగురు మృతిచెందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో మహమ్మారి బాధితుల సంఖ్య 46,274కు చేరింది. కొవిడ్ బారినపడి ఇప్పటివరకు 422 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలోనే అతి తక్కువ..
కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోనే అతి తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా పేర్కొంది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర బృందం ఇచ్చిన నివేదికలను పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ... కొవిడ్ నియంత్రణలకు సంబంధించి పలు సూచనలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ దశకు చేరలేదు..
భారత్‌లో మహమ్మారి కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. అందుకు ఆధారాలేమీ లేవని పేర్కొన్నారు. దిల్లీ వంటి నగరాల్లో వైరస్ ఇప్పటికే తీవ్ర దశకు చేరుకున్నట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరీక్షల్లో అస్పష్టత..
కరోనా యాంటీజెన్ పరీక్షల్లో అస్పష్టత నెలకొంది. ఇవి 60 శాతం కచ్చితత్వంతో ఉంటున్నాయి. కరోనా లక్షణాలున్న వారికీ నెగిటివ్ వస్తోంది. అనుమానితులు బయట తిరుగడం వల్ల వ్యాప్తి పెరుగుతోంది. రెండు రోజులకే కరోనా లక్షణాలు తీవ్రమై ఆరోగ్యం విషమిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోరాడి ఓడాడు..
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ తుదిశ్వాస విడిచారు. జూన్ 11న స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నారు. 41 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ మాస్కులు వాడొద్దు..