తెలంగాణ

telangana

By

Published : Jul 18, 2020, 9:01 AM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9am

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News 9am
టాప్​టెన్ న్యూస్ @9am

  • రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400 పైగా మరణాలు

రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. జిల్లాల్లోనూ కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేలా లేదు. తాజాగా రాష్ట్రంలో 1478 మందికి కొవిడ్‌ సోకగా... మొత్తం కేసుల సంఖ్య.. 42 వేల మార్కు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనా నివారణకు మరో రూ.100 కోట్లు: కేసీఆర్

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య ఆరోగ్యశాఖకు మరో రూ.100 కోట్లు కేటాయించారు. ఆరోగ్యమంత్రి, సీఎస్‌ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి ఈ నిధులను వెచ్చించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'కరోనా నియంత్రణకు ప్రపంచ దేశాలతో కలిసి పోరు'

ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని దేశాలతో కలిసి పోరాడుతున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఔషధాలను, ఇతర సామగ్రిని భారత్​ అందిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ఏడు నెలల్లో జైడస్ కాడిలా కరోనా వ్యాక్సిన్!'

కరోనా నియంత్రణకు తయారు చేసిన జైకొవ్-డీ వ్యాక్సిన్​ను మరో ఏడు నెలల్లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు జైడస్ కాడిలా సంస్థ ప్రకటించింది. వచ్చే మూడు నెలల్లో మనుషులపై ప్రయోగాలు పూర్తి చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • యాంటీజెన్‌ పరీక్షల నివేదికల్లోనూ జాప్యమే..!

అనుమానితులు, ప్రైమరీ కాంటాక్టులు నమూనాలు ఇస్తున్నారు.. వెంటనే ఫలితమూ వస్తోంది.. మెసేజ్​ సకాలంలో రాకపోవడం వల్ల వారు బయట తిరగడం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. గ్రేటర్‌ వ్యాప్తంగా అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 30 నిమిషాల్లోనే ఫలితం వస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అత్యధిక కొవిడ్‌ బాధితులకు ఆ మూడింట్లో ఏదో ఒక సమస్య

కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. అయితే జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల్లో ఏదో ఒక సమస్య కొవిడ్‌ బాధితుల్లో ఉంటున్నట్లు అమెరికాకు చెందిన సీడీసీ తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో నలుగురు ముష్కరులు హతం

జమ్ము కశ్మీర్ షోపియాన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్​లో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పాక్​ దుర్నీతికి ముగ్గురు భారతీయులు బలి

సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి పాకిస్థాన్​ తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలోని గల్పుర్​ సెక్టార్​ వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాక్​ సేనలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్​

బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్​, తన కుమార్తె ఆరాధ్య​ ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇటీవలే వీరిద్దరికీ కరోనా పాజిటివ్​ రాగా ఇన్నిరోజులు ఇంటివద్ద ఐసోలేషన్​లో ఉన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • స్టైలిష్​ గడ్డంతో సరికొత్తగా కనిపించిన ధోనీ

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ కొత్త లుక్​లో కనిపించాడు. ఐపీఎల్​ జట్టు సీఎస్కే ఫ్రాంచైజీ ట్టిట్టర్​లో మహీ వీడియోను పోస్ట్​ చేసింది. ఇందులో ధోనీ స్టైల్​ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details