తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM

By

Published : May 24, 2021, 7:00 PM IST

  • కొవాగ్జిన్​కు త్వరలోనే అనుమతులు..

కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు త్వరలోనే వస్తాయని విశ్వసిస్తున్నట్లు భారత్​ బయోటెక్​ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అవసరమైన ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అత్త గొంతు కోసి.. సంచిలో కుక్కి..

మహారాష్ట్ర పుణె జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. కోడలే అత్తను చంపి పొదల్లో పడేసింది. తెలెగావ్​ ప్రాంతానికి చెందిన బేబీ గౌతమ్​ శిందే(50), అమె కోడలు పూజా మిలింద్ శిందే మధ్య చిన్న వాగ్వదం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనాపై సీఎం సమీక్ష..

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. మంత్రులు హరీశ్​ రావు, సత్యవతి రాఠోడ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, ఆర్థిక, వైద్య-ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విచారణ షురూ..

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్‌రెడ్డి భూకబ్జా ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ మేరకు రావల్‌కోల్‌లోని సర్వే నెంబర్‌ 77లో గల భూములను పరిశీలించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రమాణ స్వీకారానికి వేళాయే..

తెరాస నుంచి ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్​ రెడ్డి, సురభి వాణీదేవి ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 26న ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్​లో బాధ్యతలు స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే చోరీ..

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు.. కానీ ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. పట్టుకోవటమే కాదు భారీగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కారేపల్లిలో ఇటీవల జరిగిన ఓ భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొత్తగా 12,994 కేసులు..

ఏపీలో కొత్తగా 12,994 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో కొవిడ్​ కేసుల సంఖ్య 15,93,821కి చేరింది. తాజాగా వైరస్​ బారిన పడి 96 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోర్టులో ప్రత్యక్షంగా హాజరైన సూకీ..

మయన్మార్​ బహిష్కృత నేత ఆంగ్​సాన్ సూకీ కోర్టు ముందు సోమవారం ప్రత్యక్షంగా హాజరయ్యారు. నెపిడా నగరంలోని సెంట్రల్​ కౌన్సిల్​ హాల్​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానానికి రావడానికి ముందు ఆమె తన వ్యక్తిగత న్యాయవాదుల బృందాన్ని కలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఈ గణాంకాలకూ ఓ లెక్కుంది!

క్రికెట్​లో సిక్సుల మోత.. ఫోర్ల ధమాకా చూసుంటారు. అయితే ఈ ఆటలో ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటితో టీమ్​ఇండియా క్రికెటర్లకు ఉన్న సంబంధమేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సల్మాన్​ చిత్రంలో ఇమ్రాన్​!

బాలీవుడ్​ హీరో సల్మాన్​ ఖాన్ ప్రధానపాత్రలో యశ్​రాజ్​ ఫిల్మ్స్​ నిర్మిస్తున్న చిత్రం 'టైగర్​ 3'. కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ఇందులో సల్మాన్​కు జోడీగా కత్రినా కైఫ్​ నటిస్తోంది. వీరితో మరో నటుడు ఇమ్రాన్​ హష్మీ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details