1. బస్సు సర్వీసుల పునః ప్రారంభం!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణకు చర్యలు జరిగాయి. బస్సులు నడపడంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు.. హైదరాబాద్ బస్‌భవన్‌లో సమావేశమయ్యారు.
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2. అనిశా కస్టడీకి నిందితులు
కీసర లంచం కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులను కస్టడీకి అనుమతిస్తూ అనిశా కోర్టు తీర్పు వెల్లడించింది. రేపటి నుంచి 3 రోజులపాటు నాంపల్లి అనిశా కార్యాలయంలో విచారణ సాగనుంది. రూ.కోటి 10 లక్షల లంచం వ్యవహారంపై మాజీ తహసీల్దార్ నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్, శ్రీనాథ్, అంజిరెడ్డిని అధికారులు విచారించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3. రాహుల్ అలా అనలేదట!
రాహుల్ అలా అనలేదు: ఆజాద్మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా రాహుల్ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. సీడబ్ల్యూసీలో కానీ, బయట కానీ భాజపాకు మద్దతుగా సీనియర్లు లేఖ రాశారని రాహుల్ అనలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4. డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంబీఏ సీటు
డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏఐసీటీఈ అనుమతించింది. కరోనా కారణంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క సంవత్సరానికి ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5. నీ మూతి పగలకొడతా: దేశాధ్యక్షుడి వార్నింగ్
రాజకీయ నేతలు ఎంతో సహనంతో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. కానీ.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో.. సహనం కోల్పోయి నిన్ను చితకబాదాలని ఉందని విలేకరిని బెదిరించారు. ఒక్కసారిగా అంత ఆగ్రహానికి గురి కావటానికి కారణం ఏంటి? ఆ విలేకరి అడిగి ప్రశ్నేంటి ? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.