తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్ ​టెన్​​ న్యూస్ @ 1 PM - TOP TEN NEWS 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​​ న్యూస్ @ 1 PM
టాప్​టెన్​​ న్యూస్ @ 1 PM

By

Published : Aug 13, 2020, 12:55 PM IST

1. ప్రైవేట్ ఆస్పత్రులపై ఉదాసీనత ఎందుకు? : హైకోర్టు

కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42 వేల మంది సెకండరీ కాంటాక్ట్‌లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కోర్టుకు తెలిపింది. హోటళ్లలో ఐసోలేషన్ పడకలు 857 నుంచి 2995కి పెరిగాయని వివరించింది. జిల్లాల్లో 86 కొవిడ్ కేర్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. ప్రభుత్వ దవాఖానాల్లో పడకలు ఖాళీగా ఉన్నా.. రోగులకు సేవల్లేవు!

రాజధాని నగరంలో కరోనా వైరస్‌ అనేక ప్రాంతాలకు విస్తరిస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో నిత్యం సుమారు 800 మంది వరకు దీని బారినపడుతున్నారు. వీరంతా నగరంలోని ప్రధానమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి వైద్య సహాయం పొందడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటప్పుడు వీటిలోని వేలాది పడకలు రోగులతో నిండిపోవాలి. అయినా 2429 పడకల వరకు ఖాళీగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3.రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి కేటీఆర్, హరీశ్ రావు, సబితల భూమి పూజ

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి భూమిపూజ నిర్వహించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. అమానవీయం.. రాత్రి నుంచి వర్షంలోనే కొవిడ్​ మృతదేహం

కొవిడ్​తో మరణిస్తే సొంత మనుషులే పరాయి వాళ్లలా చూస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సోకే అవకాశం తక్కువేనని నిపుణులు ఎంత చెప్పినా ప్రజల్లో అవగాహన రావడం లేదు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో కరోనా మృతుడిని బయట పడేసి వర్షంలో తడుస్తున్నా ఎవరూ కన్నెత్తి చూడటం లేదంటే... ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. పారదర్శక పన్ను విధానానికి మోదీ అంకురార్పణ

పారదర్శక పన్ను విధానాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయడం, నిజాయతీగా పన్నుచెల్లిస్తున్న వారికి బహుమతులు ఇచ్చే విధంగా పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6.'ఆ వార్తలు అవాస్తవం.. ఆయన​ ఆరోగ్యం స్థిరంగా ఉంది'

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ప్రణబ్ మరణించినట్లు వస్తోన్న వార్తలు అవాస్తవమని తెలిపారు కుమారుడు అభిజిత్​, కుమార్తె శర్మిష్ఠ. అయితే ప్రణబ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆర్మీ ఆసుపత్రి ప్రకటించింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన వెంటిలేటర్​పైనే ఉన్నారని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. కరోనా 2.0 భయం.. అక్కడ మళ్లీ అన్నీ బంద్ ​!

న్యూజిలాండ్​లో కరోనా 2.0 విజృంభిస్తుండటం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 17 కేసులు వెలుగుచూశాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. స్థానికంగా కేసులు నమోదై 100 రోజులు గడిచిన నేపథ్యంలో ఆదివారం సంబరాలు చేసుకున్న న్యుజిలాండ్​ ప్రజలను ఈ వార్త నిరాశకు గురిచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. మందిరానికి రక్షణగా ముస్లింల మానవహారం

ఇటీవల జరిగిన బెంగళూరు ఆందోళనల్లో ఓ మందిరం ధ్వంసం కాకుండా కొంతమంది ముస్లిం యువకులు మానవహారం ఏర్పాటు చేసిన వీడియో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. చెన్నై జట్టు ప్రాక్టీస్​ క్యాంప్​.. జడేజా

మిస్వ్యక్తిగత కారణాలతో చెన్నైలో జరగబోయే ప్రీ ప్రాక్టీసు క్యాంప్​కు గైర్హాజరు కానున్నాడు ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా. ఆగస్టు 21న దుబాయ్​ వెళ్లేముందు సీఎస్కే జట్టుతో కలుస్తాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. ఆ దర్శకుడి సినిమా సెట్​లో కుర్చీలకు నో ఛాన్స్

హాలీవుడ్​ దర్శకుడు క్రిస్టోఫర్​ నోలాన్ సినిమా​ సెట్​లో ఉంటే అక్కడ కుర్చీలు ఉండవు. ఎవరినీ సెల్​ఫోన్లు కూడా మాట్లాడనివ్వడు. అసలు దీని వెనకున్న వచ్చిందనే విషయాల్ని నటి అన్నా హాత్వే వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details