తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News 11AM
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Jul 22, 2020, 10:58 AM IST

  • కొవిడ్​ విజృంభణ..

దేశం​లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. ఒక్కరోజు వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్తగా 37,724 వైరస్​ కేసులు నమోదయ్యాయి. మరో 648 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • కడియంకు కరోనా..

ధనిక, పేద తేడా లేకుండా కరోనా ప్రతి ఒక్కరిని భయపెడుతోంది. ప్రపంచమంతా విస్తరిస్తూ తన సత్తా చాటుతోంది. ప్రజలతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • వాహనాలు కాల్చేశారు!

రహదారి పనులు చేస్తున్న రెండు వాహనాలను మావోయిస్టులు దహనం చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బత్తినపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • ఫేస్‌ షీల్డ్​తో భద్రతెంత..

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో.... ఎలాంటి మాస్క్‌లు ధరిస్తే మంచిది?.. గుడ్డతో చేసిన మాస్క్‌లతో ప్రయోజనం ఉంటుందా..? వాల్వ్‌లు ఉన్న మాస్కులు ధరించడం ప్రమాదకరమా? వంటి అనేక అనేక సందేహాలపై ప్రముఖ వైద్య నిపుణులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కొడాలి జగన్మోహన్​రావు పలు విషయాలను వెల్లడించారు. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • గ్రూప్ పాలసీగా కరోనా కవచ్..

'కరోనా కవచ్'ను గ్రూప్​ పాలసీగా విక్రయించేందుకు బీమా సంస్థలకు ఐఆర్​డీఏఐ అనుమతిచ్చింది. గ్రూప్ పాలసీకి.. వ్యక్తిగత పాలసీ నిబంధనలే వర్తిస్తాయని వెల్లడించింది. ఈ పాలసీకీ ప్రీమియం నిర్ణయించే అధికారం బీమా సంస్థలకే ఇచ్చింది. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • ఆకాశమార్గాన అమృత ధారలు..

నాలుగైదు రోజుల క్రితం పుట్టిన బిడ్డేమో దిల్లీలో.. అమ్మేమో అక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లేహ్‌లో. అయినా ఆ బిడ్డకు నెలరోజుల నుంచి ఆ అమ్మ తన పాలను అందిస్తూనే ఉంది. ఆ బాబు తాగుతూనే ఉన్నాడు. ఇదో ఆసక్తికర కథనంలా ఉంది కదూ.. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • కాల్పుల కలకలం..

అమెరికా చికాగోలోని రెండు వీధుల్లో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మరింత మంది గాయపడి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • కరోనా ఎఫెక్ట్​..

తెలంగాణలో గత ఏడాది డిసెంబరులో జరిగిన ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ నిమితం ఏర్పాటైన జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌.. విచారణ గడువును 6 నెలలు పొడిగించాలని తాజాగా సుప్రీంకోర్టును కోరింది. కమిషన్‌ తరఫు న్యాయవాది కె.పరమేశ్వర్‌ ఈ మేరకు అప్లికేషన్‌ దాఖలుచేశారు. కరోనా కారణంగా విచారణ ముందుకు సాగకపోవడంతో గడువు పెంచాలని కోరారు. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • బాలీవుడ్​ను వదిలేస్తున్నా..

బాలీవుడ్​ చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ప్రముఖ దర్శకుడు అనుభవ్​ సిన్హా. తాజాగా ఈ విషయాన్ని తన సోషల్​మీడియాలో పోస్టు చేశారు. అంతేకాకుండా తనపై ఓ వెబ్​ పోర్టల్​ రాసిన వార్తపైనా అసహనం వ్యక్తం చేశారు. తనను 'తప్పాడ్'​ సినిమా దర్శకుడిగా కాకుండా మరే విధంగా గుర్తించడం లేదని విచారాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

  • అత్యుత్తమ రికార్డు..

అమెరికా అథ్లెట్​ మైకెల్​ నార్మన్​ 100 మీటర్ల పరుగులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ట్రాక్​పై అడుగుపెట్టిన ఇతడు.. ఆరంభ మ్యాచ్​లోనే దుమ్ములేపాడు. మరిన్ని వివరాలకు క్లిక్​ చేయండి.

ఇదీచూడండి: టాప్​టెన్​ న్యూస్​ @9AM

ABOUT THE AUTHOR

...view details