- కరోనా విజృంభణ
భారత్‌లో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 37,148 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాలు 28 వేలు దాటాయి. ఒక్కరోజే 587 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అందరికీ దక్కదు!
హైదరాబాద్‌లో పాజిటివ్ వచ్చిన బాధితులు సుమారు 70 శాతం ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీరి కోసం ప్రభుత్వం అందిస్తోన్న ఐసోలేషన్ కిట్లలో క్షేత్రస్థాయి రాజకీయాలు బాధితుల పాలిట శాపంగా మారుతున్నాయి. హోమ్ ఐసోలేషన్ బాధితులకు ఇవ్వాల్సిన కిట్లను స్థానిక నేతలు పంచుతున్నారు. వాటిని ప్రచారానికి వాడుకుంటున్నారు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కేంద్రంపై రాహుల్ గుస్సా..
కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏయే నెలలో కేంద్రం ఏమి చేసిందో ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిడ్ నిర్ధారణకు ఆవైపే మొగ్గు!
ఆర్టీ-పీసీఆర్, ట్రూనాట్ వంటి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే సదుపాయాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో లేకపోవడంతో నేరుగా సీటీ స్కాన్‌తోనే కొవిడ్‌ను నిర్ధారిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నమూనా సేకరణ కేంద్రాలకు పంపించి పరీక్షలు చేయిద్దామనుకుంటే.. ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతోంది. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు వెంటనే తేల్చే సీటీ స్కాన్వైపు మొగ్గుచూపుతున్నాయి. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అమ్మా నీకేం కాదు..
కిటికీ ఎక్కి.. 'అమ్మా నీకు నేనున్నా' అని ధైర్యం చెప్పడం తప్ప గుండెలకు హత్తుకుని తల్లిని ఓదార్చలేని పరిస్థితి తనయుడిది. కడసారి కన్న బిడ్డను ముద్దాడలేని దీనస్థితి ఆ తల్లిది. పాలస్తీనాకు చెందిన ఆ తల్లి-కుమారుడి వేదనకు అద్దం పట్టే ఓ ఫొటోను ఐక్యరాజ్య సమితి ప్రతినిధి సామాజికమాధ్యమాల్లో పంచుకున్నారు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- తప్పిన ప్రమాదం..