తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

TOP NEWS
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

By

Published : Nov 1, 2021, 5:58 AM IST

Updated : Nov 1, 2021, 9:43 PM IST

20:59 November 01

TOP NEWS@9PM

  • కౌంట్​డౌన్

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం రేపు (Huzurabad By Election Counting) తేలబోతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 

  • తెరాస విజయగర్జన సభ వాయిదా

తెరాస ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 15న వరంగల్​లో తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను పార్టీ వాయిదా వేసింది. ఈనెల 29న దీక్షా దివస్ రోజున విజయ గర్జన నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 

  • 'నీట్‌' పరీక్షా ఫలితాలు విడుదల

నీట్​ ఫలితాలను(NEET 2021 Results) విడుదల చేసింది జాతీయ పరీక్షల సంస్థ (NTA). వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్‌ 12న నీట్‌ పరీక్ష నిర్వహించినప్పటికీ ఫలితాల(NEET 2021 Results) విడుదలలో జాప్యం కొనసాగుతూ రావడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

  • సాగు చట్టాలు రద్దు చేయండి

వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు కేంద్రానికి నవంబర్ 26 వరకు గడువు ఇచ్చారు బీకేయూ నేత రాకేశ్ టికాయిత్. లేదంటే మరింత మంది రైతులు తరలివచ్చి, తమ నిరసనను మరింత ఉద్ధృతం చేస్తారని హెచ్చరించారు.

  • కోహ్లీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు!

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) రెండు వరుస ఓటములతో ఇప్పటికే ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది టీమ్​ఇండియా. సామాజిక మాధ్యమాల్లో భారత క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్ జరుగుతోంది. 
 

19:55 November 01

TOP NEWS@8PM

  • విజయోత్సవ ర్యాలీలకు నో ఛాన్స్

హుజూరాబాద్​లో బయటకు వచ్చిన వీవీప్యాట్ పోలింగ్​కు వినియోగించినది కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 

  • ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

అక్టోబర్​ 30న జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్​సభ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. అందుకోసం అన్ని ఏర్పాటు చేపట్టింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో కీలక నేతలు పోటీ పడుతున్న స్థానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

  • కేఆర్ఎంబీకి లేఖ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ (Letter to Krmb) రాసింది. ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ను బోర్డు పరిధిలోకి తీసుకొని త్వరగా మరమ్మత్తులు పూర్తి చేయాలని ఆదేశించింది.

  • రామోజీ ఫిల్మ్ సిటీలో దీపావళి కార్నివాల్

అబ్బురపరిచే ప్రదర్శనలు, ఆకట్టుకునే ప్రకృతి సోయగాలతో పర్యాటకులు తడిసి ముద్దయ్యారు. సందర్శకుల కేరింతలతో భూతల స్వర్గాన్ని తలపించే రామోజీ ఫిల్మ్‌సిటీ కోలాహలంగా మారింది.

  • పునీత్ చివరి సినిమా

ఆకస్మిక మరణంతో అభిమానులకు తీవ్ర వేదన మిగిల్చారు కన్నడ స్టార్ హీరో పునీత్​ రాజ్​కుమార్(punith rajkumar death). అయితే ఆయన చివరి సినిమాను(puneeth rajkumar movies) వచ్చే ఏడాది పునీత్ జయంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు!

18:50 November 01

TOP NEWS@7PM

  • రెండేళ్ల చెల్లెలిపై అత్యాచారయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద తండాలో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు(rape attempt on girl) ఓ కామాంధుడు. చెల్లెలి వరుసైన చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించినట్లు బాలిక కుటుంబసభ్యులు తెలిపారు.

  • సీఎం దీపావళి కానుక

దీపావళి సందర్భంగా పంజాబ్ ప్రజలకు ఆ రాష్ట్ర సర్కార్ తీపికబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలను యూనిట్​కు మూడు రూపాయల మేర తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 11శాతం పెంచింది.

  • బ్రహ్మంగారు చెప్పినవన్నీ నిజాలవుతున్నాయా

తాటి, ఈత, ఖర్జూర చెట్లను చూడని వారు ఉండరు. వీటి నుంచి వచ్చే కల్లును చాలా మంది తాగడం.. మనం సహజంగా చూస్తూనే ఉంటాం. వేప కల్లును ఔషధంగా వినియోగిస్తారని కూడా మనకు తెలుసు. కానీ వీటన్నింటికి భిన్నంగా చింత చెట్టుకు కల్లు రావడం ఎప్పుడైనా మీరు చూశారా?..పోనీ.. విన్నారా? లేదు కదా?. కానీ చింత చెట్టుకు కల్లు వస్తుందోయ్​. ఇది నిజం. కావాలంటే మీరే చూడండి.

  • ఓటమికి 5 కారణాలివేనా!

తొలి మ్యాచ్​లో పాకిస్థాన్​ ఇచ్చిన షాక్​ నుంచి తేరుకొని న్యూజిలాండ్​పైనైనా గెలుస్తుందని భావించిన టీమ్​ఇండియా నిరాశే మిగిల్చింది. ప్రపంచస్థాయి క్రికెటర్లున్న జట్టు పసికూనల్లా తేలిపోయింది. కివీస్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో కోహ్లీసేన ఓటమి పాలవ్వడానికి ప్రధానంగా ఉన్న 5 కారణలేంటో చూడండి.

  • పునీత్​ నేత్రదానంతో వెలుగులు

నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​(Puneeth Rajakumar news). ఆయన నేత్రదానం(eye donation) చేయగా.. ఓ మహిళతో పాటు మరో ముగ్గురికి వైద్యులు చూపు తెప్పించారు.

18:08 November 01

TOP NEWS@6PM

  • క్రమశిక్షణ లేని వ్యక్తి... ఎప్పటికీ నాయకుడు కాలేడు

ఎవరి వృత్తికి వారే నాయకుడని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, నిబద్ధత లేని వ్యక్తి ఎప్పటికీ నాయకుడు కాలేడని పేర్కొన్నారు.

  • యంగ్ ​హీరో ఫాంహౌస్​లో పేకాట

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఫాం​హౌస్​లో పేకాట కేసు(Gambling Case in Hyderabad)లో ముమ్మర దర్యాప్తు(SOT Police Hyderabad) కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. 

  • తగ్గనున్న వంట నూనె ధర!

వంటనూనె ధర (Edible Oil Price News) మరోసారి తగ్గనుంది. కేజీకి రూ. 3 నుంచి రూ. 5 వరకు దిగిరానుంది. పండగ సీజన్​లో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఓ టన్నుపై సుమారు రూ. 3వేల నుంచి రూ. 5 వేల వరకు తగ్గిస్తున్నట్లు సాల్వెంట్​ ఎక్సట్రాక్టర్స్​ అసోసిషియేషన్​ ఆఫ్​ ఇండియా (ఎస్​ఈఏ) తెలిపింది.

  • హీరో సూర్య దాతృత్వం

స్టార్​ కపుల్​ సూర్య(suriya movies), జ్యోతిక మరోసారి మంచి మనసును చాటుకున్నారు. తమిళనాడులోని ఆదివాసీల సంక్షేమం కోసం రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. సీఎం స్టాలిన్(cm stalin helpline number)​ సమక్షంలో తమిళనాడుకు చెందిన ఇరులర్​ ట్రైబ్​ ట్రస్ట్​కు(irula tribe in which state) చెక్​ అందజేశారు.

  • 'వాళ్లేం రోబోలు కాదు'

న్యూజిలాండ్​ (IND vs NZ) చేతిలో పరాజయం అనంతరం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టుకు మద్దతుగా నిలిచాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen News). క్రీడాకారులు రోబోలు కాదని, వారికి అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉండాలని అన్నాడు.


 


 



 


 

16:52 November 01

TOP NEWS@5PM

  • మోదీ సభలో ఉగ్రదాడి

2013 పట్నా గాంధీ మైదాన్​లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. మొత్తం 9మందిలో నలుగురు దోషులకు మరణశిక్ష, ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి పదేళ్లు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. నాటి ప్రధాని అభ్యర్థి మోదీ నిర్వహించాల్సిన గాంధీ మైదాన్​ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరిగాయి.

  • కేంద్రం నుంచి సహకారం లేదు

సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao Paddy) ప్రారంభించారు. జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలుకు 396 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఇప్పటికే 265 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు.

  • ఐటీ దాడుల్లో రూ.100 కోట్ల నల్లధనం

బిహార్, ఝార్ఖండ్​లో కార్యకలాపాలు సాగించే రోడ్డు కాంట్రాక్ట్​ నిర్వహణ సంస్థపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. రూ.100 కోట్ల నల్లధనం బయటపడినట్లు వెల్లడించారు.

  • రెండేళ్ల బాలికనూ వదలని కామాంధుడు

రెండేళ్ల బాలికను లైంగిక వేధింపులకు (Sexual Harassment) గురి చేశాడు మానవ మృగం. అనంతరం హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది.

  • సమంత తొలి హిందీ సినిమా

సమంత(samantha akkineni movies).. బాలీవుడ్​లో తొలి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అంటూ గత కొన్నిరోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఓ స్టార్ హీరోయిన్​ నిర్మాతగా వ్యవహరిస్తోందట. ఇంతకీ ఎవరా భామ?

16:26 November 01

TOP NEWS@4PM

  • ఇవాళ, రేపు భారీ వర్షాలు

బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు. 

  • కొవాగ్జిన్​కు ఆస్ట్రేలియా గుర్తింపు

భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ (Covaxin) టీకాను ఆస్ట్రేలియా గుర్తించిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai) హర్షం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ వ్యాక్సినేషన్​కు ఘన విజయమని కొనియాడారు.

  • ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో 3,03,56,665 మంది ఓటర్లున్నారు. 2022 జనవరి ఒకటి అర్హత తేదీతో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదాను సోమవారం ప్రకటించారు.

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్

ఏపీలో మిగిలిపోయిన కార్పొరేషన్‌(corporation), స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల అయింది(notification release). ఎన్నికల కోసం నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

  • కరోనాకన్నా నిపా ప్రమాదకరమా?

నిపా వైరస్ మహమ్మారిగా మారే అవకాశముందా?(nipah virus cases) కొవిడ్‌తో పోలిస్తే నిపా అంత ప్రమాదకరమైందా?(nipah virus symptoms) నిపా వైరస్‌ను భవిష్యత్తు ముప్పుగా చూడాల్సిన అవసరముందా? నిపా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాలా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారు?

14:40 November 01

TOP NEWS@3PM

  • ఈటీవీ భారత్ కథనానికి స్పందన

వింత వ్యాధితో నరకరయాతన అనుభవిస్తున్న ఇద్దరు పిల్లల దీనగాథ పట ఈటీవీ భారత్ కథనం పట్ల మహబూబాబాద్‌ కలెక్టర్ స్పందించారు. ఆ పిల్లల కుటుంబపరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు వారి ఇంటిని సందర్శించారు. బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు.

  • పోటీ చేయట్లేదు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్‌ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఉత్తర్​ప్రదేశ్​లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు.

  • నిలిచిన తూకాలు

వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ కార్యాలయం వద్ద వ్యాపారులు ధర్నా నిర్వహించారు. నాగేంద్ర ట్రేడింగ్‌ కంపెనీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. వ్యాపారుల ఆందోళనతో మార్కెట్‌లో తూకాలు నిలిచిపోయాయి.

  • ఐఫోన్‌ 13పై రూ.24,000 తగ్గింపు!

ఇటీవల విడుదలైన ఐఫోన్​ 13పై ఆకట్టుకునే ఆఫర్​ను ప్రకటించింది యాపిల్​ సంస్థ. దీపావళి సందర్భంగా రూ.79,900 విలువైన ఐఫోన్‌ 13ను డిస్కౌంట్‌లో రూ.55,900కే అందుబాటులోకి తేనుంది. అది ఎలాగంటే..

  • ఎంత అద్భుతంగా పాడిందో!

'శ్రీదేవీ డ్రామా కంపెనీ'(Sri devi drama company latest promo) షోలో న్యాయనిర్ణేత ఇంద్రజ ఓ పాటను అద్భుతంగా ఆలపించి కంటెస్టెంట్​లను ఆకట్టుకున్నారు. సుడిగాలి సుధీర్​, హైపర్​ ఆది, గెటప్​ శ్రీను చేసిన 'అతడు' స్ఫూఫ్ కడుపుబ్బా నవ్విస్తోంది. అందుకు సంబంధించిన కొత్త ప్రోమో చూసేయండి.

13:53 November 01

TOP NEWS@2PM

  • సీఎస్ కీలక ఉత్తర్వులు.. హైకోర్టు స్టే

సమాచార అధికారులకు సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. సమాచారం ఇచ్చే ముందు శాఖాధిపతుల అనుమతి తీసుకోవాలని సూచించింది. సీఎస్ ఉత్తర్వులు సమాచార హక్కు చట్టానికి విరుద్ధమని వచ్చిన పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. సమాచార అధికారులకు గత నెల 13న సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్​ ఉత్తర్వులపై వచ్చిన వ్యాజ్యాలపై సీజే జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ (CJ Justice Satish Chandra Sharma) ధర్మాసనం విచారణ చేశారు. 

  • అయోధ్యలో యోగి జలాభిషేకం

అఫ్గానిస్థాన్​లోని కాబుల్ నది నీటిని గంగాజలంతో కలిపి అయోధ్యలో (Ayodhya Ram Mandir) అభిషేకం నిర్వహించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అఫ్గాన్ బాలిక పంపిన ఈ నీటితో రామ్ లల్లాకు అభిషేకం నిర్వహించడం తన అదృష్టమని యోగి పేర్కొన్నారు.

  • అమెజాన్​ సేల్​లో భారీ డిస్కౌంట్లు

శీతాకాలం వచ్చేసింది. శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు బ్లాంకెట్లు, స్వెటర్లు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. అమెజాన్ గ్రేట్​ ఇండియన్​ సేల్​లో కూడా చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వింటర్ గ్యాడ్జెట్స్​పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి ప్రముఖ కంపెనీలు. ఈ ఆఫర్లో అందుబాటులో ఉన్న టాప్​-12 వింటర్ గ్యాడ్జెట్స్​పై ఓ లుక్కేయండి.

  • 'దాని వల్ల మానసిక అలసట వేధిస్తోంది'

టీ20 ప్రపంచకప్​(t20 worldcup 2021)లో చెత్త ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశకు గురిచేస్తోంది టీమ్ఇండియా(team India t20 world cup 2021). ఇప్పటికే రెండు మ్యాచ్​లు ఓడి సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. దీంతో భారత ఆటగాళ్లపై విమర్శలు వస్తున్నాయి. కొందరు టీమ్ఇండియా బిజీ షెడ్యూల్​పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించాడు పేసర్ బుమ్రా(jasprit bumrah t20 world cup). బయో బబుల్ వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని వెల్లడించాడు.

  • దీపావళికి సందడి చేసే సినిమాలివే!

ఇటీవలే దసరా పండగకు పలు చిత్రాలు విడుదలై సినీప్రియులను ఆకట్టుకోగా.. వారిని మరింతగా అలరించేందుకు దీపావళికి కొత్త సినిమాలు(deepavali movie release 2021) ముస్తాబవుతున్నాయి. థియేటర్లు, ఓటీటీ వేదికగా రిలీజ్​ కానున్నాయి. ఆ చిత్రాలేంటో చూసేద్దాం..

12:35 November 01

TOP NEWS@1PM

  • రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో భేటీ

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో శశాంక్‌ గోయల్‌ భేటీ అయ్యారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చిస్తున్నారు. 

  • సర్కారు దవాఖానాల్లో ఇట్లనే ఉంటదట

చికిత్సకయ్యే ఖర్చు భరించలేని స్థితిలో ఉన్న పేదవాళ్లు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తుంటే.. అక్కడి సిబ్బంది మాత్రం వారి ప్రాణాలకు విలువనివ్వడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ప్రశ్నిస్తే సర్కార్ దవాఖానాల్లో ఇలాగే ఉంటుందంటూ సమాధానమిస్తున్నారు. తాజాగా గాంధీ ఆసుపత్రిలో(Gandhi Hospital in Secunderabad) రోగుల పట్ల నర్సుల వైఖరి.. ప్రభుత్వ ఆసుపత్రుల తీరుని బయటపెడుతోంది.

  • వాంఖడే ఇంటికి వారెందుకు?

ఎన్​సీబీ అధికారి సమీర్ వాంఖడే ఇంటికి.. జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ వెళ్లడానికి కారణాలేంటని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik news) ప్రశ్నించారు. ఎలాంటి దర్యాప్తు నిర్వహించకుండానే వాంఖడేకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని అడిగారు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు.

  • శ్వేతసౌధంలో కరోనా కలకలం

అమెరికాలోని శ్వేతసౌధంలో కరోనా కలకలం రేపింది. తనకు కొవిడ్​ పాజిటివ్​ అని తేలినట్టు పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్​ సాకి వెల్లడించారు. శ్వేతసౌధంలోని సిబ్బంది ద్వారా తనకు వైరస్​ సోకినట్లు సాకి తెలిపారు. గతవారంలో చివర సారిగా అధ్యక్షుడు జో బైడెన్​ను మంగళవారం కలిసినట్టు సాకి వెల్లడించారు.

  • ప్రమాదంలో మిస్ సౌత్ ఇండియా మృతి

మిస్​ సౌత్ ఇండియా-2021 అన్సీ కబీర్(25)​, మాజీ మిస్​ కేరళ రన్నరప్ అంజనా షాజన్(26) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కేరళలోని కొచ్చి దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది.

11:38 November 01

TOP NEWS@12PM

  • రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

పలు రాష్ట్రాల ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షల తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, హరియాణా గురించి వివరిస్తూ ట్వీట్లు చేశారు.

  • ఉప ఎన్నికపైనే అంతటా చర్చ.

ఉమ్మడి జిల్లాలో ఏదైనా చర్చ జరుగుతోందంటే.. అది ముమ్మాటికి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక గురించే.! (Huzurabad by-election results) హోరాహోరీగా జరిగిన ఉపపోరులో ఎవరు గెలుస్తారు..? ఎవరి అవకాశాలను ఎవరు దెబ్బతీస్తారు..? ఏ వర్గం ఓట్లు ఎటు పడి ఉంటాయి..? పెరిగిన మహిళలు, యువత ఓట్లు ఎవరికి ప్రయోజనం..? కొత్త ఓటర్లు ఎవరికి మద్దతునిచ్చి ఉంటారు..? ఇలా ప్రశ్నల పరంపరలతోపాటు విపరీత చర్చలకు నాలుగు జిల్లాలు వేదికవుతున్నాయి.

  • పెరిగిన బంగారం ధర

బంగారం (Gold Rate Today), వెండి (Silver price today) ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • బ్యాటింగ్ ఆర్డర్​లో మార్పులు

టీ20 ప్రపంచకప్​లో భాగంగా న్యూజిలాండ్​(ind vs nz t20)తో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలైంది టీమ్ఇండియా. టోర్నీలో వరుసగా రెండో ఓటమితో సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్పందించిన మాజీలు.. భారత జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • 'ఆర్​ఆర్​ఆర్​' గ్లింప్స్ వచ్చేసింది

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR movie) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్​ విడుదలైంది. అద్భుతమైన విజువల్స్​తో అభిమానులను ఆకట్టుకునేలా ఉంది(rrr glimpse teaser).

11:01 November 01

TOP NEWS@11AM

  • పేకాట ఘటనపై ముమ్మర దర్యాప్తు

రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల సమీపంలోని ఓ ఫామ్ హౌస్​పై సైబరాబాద్‌ పోలీసులు దాడులు(SOT police hyderabad raids) నిర్వహించారు. పేకాట శిబిరంలో తనిఖీలు చేసి... 30 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రూ.6.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

  • రామోజీ ఫిల్మ్ సిటీలో కార్నివాల్

అబ్బురపరిచే ప్రదర్శనలు, ఆకట్టుకునే ప్రకృతి సోయగాలతో పర్యాటకులు తడిసి ముద్దయ్యారు. సందర్శకుల కేరింతలతో భూతల స్వర్గాన్ని తలపించే రామోజీ ఫిల్మ్‌సిటీ కోలాహలంగా మారింది. కరోనాతో కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన ప్రజలు సరికొత్త అనుభూతులతో ఆనందడోలికల్లో మునిగిపోయారు. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూనే ఆద్యంతం సంతోషాల హరివిల్లును ఆస్వాదించారు.
 

  • ధరలు పెరిగితే ఏంటి?

ఆదాయం పెరిగినప్పుడు.. ద్రవ్యోల్బణాన్నీ (Price rise in India) ప్రజలు స్వీకరించాలని మధ్యప్రదేశ్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. పదేళ్ల క్రితం రూ.6,000 వేలు సంపాదించేవారు ఇప్పుడు రూ.50 వేలు సంపాదిస్తున్నారని... పెట్రోల్, డీజిల్​లు మాత్రం పాత రేట్లకే రావాలనుకోవడం సరికాదని అన్నారు.

  • 'భారత్​కు శనిలా తగిలావు'

టీ20 ప్రపంచకప్​లో భాగంగా న్యూజిలాండ్(ind vs nz 2021)​తో జరిగిన మ్యాచ్​లో ఓడిపోయింది టీమ్ఇండియా. అయితే ఈ మ్యాచ్​లో భారత్ ఓడిపోవడానికి అంపైర్ కూడా కారణమట. అతడుంటే భారత్ అస్సలు మ్యాచ్ గెలవదట. మరి అదేంటో చూసేయండి.

  • దెయ్యం​ లుక్​లో చిరంజీవి

మెగాస్టార్​ చిరంజీవి(chiranjeevi new look) దెయ్యం లుక్​లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్​ నెట్టింట్లో వైరల్​గా మారింది. ఇంతకీ ఈ గెటప్​లో ఆయన ఎందుకు కనిపించారంటే..

09:55 November 01

TOP NEWS@10AM

  • మెట్రో నిలుపు దోపిడీ

కొంతకాలంగా మెట్రో పార్కింగ్‌ దోపిడీపై తరచూ ఫిర్యాదులు వస్తున్నా.. హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ(హెచ్‌ఎంఆర్‌) మాత్రం పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజు మొత్తం నిలిపితే ఎంత వసూలు చేస్తారో గంట, రెండు గంటలకు కూడా అంతే వసూలు చేయడంపై వాహనదారులు మండిపడుతున్నారు.

  • రామారావు గారూ... బాగున్నారా?

మనం ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ మన భాష తెలిసిన వారి కనిపిస్తే ఎంతో సంతోషపడతాం. కానీ.. ఆ ప్రాంతానికి చెందిన వారు మన భాషలో అనర్గళంగా మాట్లాడితే.. ఇక మన ఆనందానికి అవధులే ఉండవు. అచ్చం అలాంటి పరిస్థితే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​కు ఎదురైంది. నాలుగు రోజుల ఫ్రాన్స్​ పర్యటన(Minister KTR France Tour )లో ఉన్న కేటీఆర్​ను పారిస్​లోని లక్సెంబర్గ్​ ప్యాలెస్​లో ఓ ఫ్రాన్స్​ జాతీయుడు పలకరించాడు. ఆ పలకరింపు కేటీఆర్​(Telangana IT minister KTR)కు​ ఎంతో హాయినిచ్చింది. అతని మాటలకు ఫిదా అయిన మంత్రి.. తెలంగాణకు వచ్చి కేసీఆర్​ను కలవాలని ఆహ్వానించారు. ఇంతకీ అతడేం మాట్లాడాడంటే..?

  • ఎల్​పీజీ సిలిండర్​పై రూ.266 పెంపు

దేశంలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలు (LPG Gas price) భారీగా పెరిగాయి.  వాణిజ్యపరంగా వినియోగించే ఎల్​పీజీపై రూ.266 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. నవంబర్ 1 నుంచే సవరించిన ధరలు అమలులోకి రానున్నాయి.

  • అవకాశాలు చేజారినట్లేనా?

టీ20 ప్రపంచకప్​(team india t20 world cup)లో భారత జట్టు ప్రదర్శన నిరాశాజనకంగా సాగుతోంది. ఆడిన రెండు మ్యాచ్​ల్లోను ఓడి సెమీస్ అవకాశాల్ని దాదాపు చేజార్చుకుంది. అయితే సెమీస్ చేరాలంటే ఓ అవకాశం మాత్రం ఉంది. అదెలాగో చూద్దాం.

  • పునీత్​కు మాటిస్తున్నా: విశాల్​

గుండెపోటుతో ఇటీవలే మరణించిన కన్నడ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ ఇంకా తన కళ్లలోనే మెదులుతున్నారని అన్నారు హీరో విశాల్​. పునీత్​ లాంటి గొప్ప వ్యత్తి తాను చూడలేదని అన్నారు.
 

08:55 November 01

TOP NEWS@9AM

  • ఆ దేశాలపై ఒత్తిడి తగదు

జీ20 శిఖరాగ్ర సదస్సులో (Modi G20 Summit) భాగంగా వివిధ అంశాలపై నిర్వహించిన సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi G20 speech) ప్రసంగించారు. ఆర్థిక సహకారం అందించకుండా.. వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి తీసుకురావడం న్యాయం కాదని అన్నారు. సంపన్న దేశాలు తమ జీడీపీలో ఒక శాతం నిధులను అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం కేటాయించాలని పిలుపునిచ్చారు.

  • ఫొటోకు ఫోజు ఇస్తూ..

ఫొటోకు ఫోజు ఇస్తూ.. ముందే టీకా వేసిన విషయాన్ని మరిచి.. మహిళకు మరో డోసు వేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటుచేసుకుంది.

  • సామాన్యుడికి 'పెట్రో' సెగ

దేశంలో 'పెట్రో'​ బాదుడు కొనసాగుతోంది. తాజాగా లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు, లీటర్​ డీజిల్​పై 36 పైసలు పెంచుతూ (Fuel price Today) చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

  • నీరజ్‌ చోప్రాకు సీఎస్‌కే స్పెషల్‌ జెర్సీ

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణంతో మెరిసిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా(neeraj chopra tokyo olympics)కు బహుమతుల వెల్లువ కొనసాగుతోంది. గతంలో ప్రకటించినట్లుగా ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్​కే.. నీరజ్​కు రూ.కోటితో పాటు స్పెషల్ జెర్సీ(neeraj chopra csk jersey)ని అందించింది.

  • రెండే ముఖ్యమని అర్థం చేసుకున్నా

కథ వినకుండానే 'మంచి రోజులు వచ్చాయి'(Manchi rojulu vachayi movie) సినిమాను ఒప్పుకొన్నట్లు తెలిపింది హీరోయిన్​ మెహ్రీన్​. దర్శకుడు మారుతి అంటే తనకెంతో నమ్మకమని చెప్పింది(manchi rojulu vachayi mehreen). దీంతో పాటే చిత్ర విశేషాలను చెప్పుకొచ్చింది. అవన్నీ ఆమె మాటల్లోనే..

07:52 November 01

TOP NEWS@8AM

  • గ్లాస్గోకు చేరుకున్న ప్రధాని మోదీ

బ్రిటన్​లోని గ్లాస్గోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి.. ఘనస్వాగతం పలికారు అక్కడి అధికారులు. అనంతరం హోటల్​కు చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు వినూత్నంగా ఆహ్వానించారు.

  • సౌరశక్తి బదిలీ కోసం భారత్- యూకే ఒప్పందం

గ్లాస్గోలో జరుగుతున్న సదస్సులో భారత్, యూకేలు సోలార్ ఎనర్జీపై కీలక ప్రకటన చేయనున్నాయి. అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్​ఏ)లో భాగంగా ఇరుదేశాలు కలిసి.. గ్రీన్ గ్రిడ్స్ ఇనీషియేటివ్​ను (COP26 in glasgow) ప్రారంభించనున్నాయి. ఐఎస్​ఏలో తమ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోనున్నాయి.

పోలీసు, ఎక్సైజ్‌ శాఖల వ్యూహం!

రాష్ట్రం మీదుగా గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసుశాఖ అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటిపై దృష్టిసారించింది. ముందుగా రవాణా మార్గాలపై కన్నేసింది. పనిలోపనిగా పాత పద్ధతిలో ఇన్ఫార్మర్ల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అక్రమ రవాణాను అడ్డుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది.

  • తెలంగాణకు వచ్చిన రాబడి ఎంతంటే?

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో తెలంగాణకు పన్నుల రాబడి(Telangana Tax revenue) రూ.45,859 కోట్లు వచ్చింది. వీటిలో అధికంగా జీఎస్టీ రాబడి(GST Revenue) ఉండగా.. ఆ తర్వాత స్థానంలో అమ్మకం పన్ను ఉంది. మొదటి ఆరు నెలల్లో పన్ను రాబడులు 43 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి.

  • అది ప్రేక్షకులకు, పరిశ్రమకు మంచిది

సూపర్​స్టార్​ రజనీకాంత్​ నటించిన 'పెద్దన్న'(rajinikanth new movie annaatthe) సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాత సురేష్​ బాబు. మంచి కథ, పాటలు, వాణిజ్యాంశాలున్న చిత్రమిదని చెప్పారు.

06:42 November 01

TOP NEWS@7AM

  • ఆప్యాయత చూపి యువకుల వల

బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే వయసు. అంతా కొత్తగా ఉంటుంది. వేర్వేరు వ్యక్తుల పరిచయాలు.. అనేక ఆకర్షణలు. చదువుకునేటప్పుడో..కొలువుచేసే సమయంలోనో ప్రేమ, పెళ్లి వంటి మాయమాటలకు తలొగ్గిన ఆడపిల్లలు మాయగాళ్ల వలలో చిక్కుతున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు. వాస్తవం తెలుసుకునేలోపే కడుపులో మరోజీవి ఊపిరి పోసుకుంటోంది. 

  • మనిషితనానికి చదువుల ఒరవడి

సాంస్కృతికంగా సమున్నతమైన, వైవిధ్యభరితమైన భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలంటే విద్యావ్యవస్థతోనే సాధ్యం. అంతర్జాతీయంగా పేరొందిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎయిమ్స్‌, ఐఐఎమ్‌లకు భారత్‌ నెలవు. కానీ, దేశంలో ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యుల మధ్య తీవ్ర స్థాయి అంతరాలు (inequality in india) నెలకొన్నాయి. విద్యావంతుల్లో చాలా మందికి దేశం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై సరైన అవగాహన ఉండటంలేదు. బాధితుల పట్ల సహానుభూతీ కొరవడుతోంది.

  • ఆకలి మంటల్లో అఫ్గాన్‌

అఫ్గాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశంలోని వ్యవస్థలన్నీ (food crisis in afghanistan) కుప్పకూలాయి. అంతర్జాతీయ సహాయం ఆగిపోయింది. దేశవ్యాప్తంగా నగదు కొరత నెలకొంది. నిరుద్యోగం పెరిగింది. వంటనూనె, గోధుమపిండి వంటి నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ప్రజలు పొదుపు చేసుకున్న సొమ్ములూ ఖర్చయిపోయాయి. ధరలు పెచ్చరిల్లి, నిత్యావసరాలు అడుగంటి క్షుద్భాధ తీవ్రస్థాయికి చేరింది.

  • 'నేనే చివరి కోచ్​ను కాకూడదు'

క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు అసిస్టెంట్​ కోచ్​గా ఎంపికైన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సారా టేలర్ ఆ పదవిపై కీలక వ్యాఖ్యలు చేసింది. టీ10 లీగ్​ నేపథ్యంలో టీమ్​ అబుదాబికి అసిస్టెంట్ కోచ్​ బాధ్యతలు స్వీకరించిన సారా.. ఫ్రాంచైజీ క్రికెట్​కు సేవలందించే చివరి మహిళ తాను కాకూడదని పేర్కొంది.

  • జీరో సైజు సుందరి బర్త్​డే స్పెషల్

ఇలియానా.. 'దేవదాసు' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. 'పోకిరి'తో సూపర్​ హిట్​ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేస్తూనే హిందీలో అవకాశాలు దక్కించుకుని అక్కడే సెటిల్​ అయిపోయింది. ఈ మధ్యలో అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ హాట్​ ఫొటోషూట్​లు చేస్తుంది. వాటితో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. నేడు(నవంబరు 1) ఈ అమ్మడు పుట్టినరోజు సందర్భంగా ఆమె హాట్​ ఫొటోలుపై ఓ లుక్కేద్దాం..

04:51 November 01

TOP NEWS@6AM

  • గ్లాస్గోకు బయలుదేరిన ప్రధాని మోదీ

కాప్​26 వాతావారణ సదస్సులో (Glasgow environmental conference) పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గ్లాస్గోకు బయలుదేరారు. నవంబర్​ 1,2 తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు.

 

  • జీ-20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరఫరా గొలుసులో తలెత్తుతున్న సమస్యలపై జీ-20 (G20 latest news) దేశాలు చర్చించాయి. వైవిధ్యమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్​ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ (PM Modi in italy) హాజరయ్యారు.

 

  •  కేటీఆర్‌ గొప్పలు చెబుతారా?

రాష్ట్రంలో నిరుద్యోగి మహేశ్‌ ఆత్మహత్యపై టీపీసీసీ రేవంత్​ రెడ్డి స్పందించారు. నిరుద్యోగులు పిట్టల్లా రాలుతుంటే కేటీఆర్‌ గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

  •  గులాబీ నేతల్లో గుబులు..

ఎమ్మెల్సీ పదవుల కోసం తెరాస నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తమ పదవులను నిలబెట్టుకోవాలని తాజా మాజీలు ఆశిస్తుండగా.. శాసనమండలిలో అడుగుపెట్టాలని మరికొందరు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. కేసీఆర్, కేటీర్​ను మెప్పించేందుకు నేతలు విశ్వయత్నాలు చేస్తున్నారు..

  •  ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్(MLC Election Schedule) విడుదలైంది. నవంబర్ 9న నోటిఫికేషన్ జారీ కానుండగా... 29న పోలింగ్ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం... తాజాగా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది.

  • నేడే పీఈసెట్ ఫలితాలు.. 

వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈ సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను వెల్లడించనున్నారు.

  • పరికరాలకు సుస్తీ.. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరికరాలకు సుస్తీ వచ్చింది. దాదాపు రూ. 700 కోట్ల విలువైన యంత్రాలు నిరూపయోగంగా మారాయి. దీంతో పేద రోగులు అవస్థల పాలవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్లో ఉన్న పరికరాలు, సీటీస్కాన్‌ మూలనపడి మూడేళ్లు దాటింది.

  •  సదర్‌ వేడుకలకు ముస్తాబవుతున్న భాగ్యనగరం.. 

ఏటా దీపావళి తర్వాత యాదవులు నిర్వహించే సదర్‌ ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. జంట నగరాల్లో దున్నరాజుల సందడి కనిపిస్తోంది. ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, నారాయణగూడ ప్రాంతాల్లో జరిగే వేడుకలకు హరియాణా నుంచి వాటిని నిర్వాహకులు తెప్పిస్తుండగా.. ఏటా సదర్‌ వేడుకలకు దుమ్ములేపే సుల్తాన్‌, యువరాజ్‌ల వారసులు రాణా, సర్తాజ్‌లతోపాటు ఈ ఏడాది కొత్తగా ‘కింగ్‌’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

  • 'డబ్ల్యూహెచ్​ఓ బలోపేతానికి జీ20 దేశాల అంగీకారం'

కొవిడ్ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవతం చేయడం కోసం డబ్ల్యూహెచ్​ఓను బలోపేతం చేయాలని జీ20 దేశాలు(G20 Summit 2021) నిర్ణయించాయి. డబ్ల్యూహెచ్​ఓ గుర్తించిన టీకాలను పరస్పరం అంగీకరించాలని తీర్మానించాయి. ఈ మేరకు జీ20 సదస్సు భారత ప్రతినిధి పీయూష్​ గోయల్ తెలిపారు.

  • భారత్ ఘోర పరాజయం.. సెమీస్​ ఆశలు గల్లంతు!

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 31) జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియాపై అలవోకగా గెలిచింది న్యూజిలాండ్. భారత్​ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో ఛేదించింది.

Last Updated : Nov 1, 2021, 9:43 PM IST

ABOUT THE AUTHOR

...view details