తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - TOP NEWS in telangana

TOP NEWS@6AM
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

By

Published : Oct 29, 2021, 6:00 AM IST

Updated : Oct 29, 2021, 10:03 PM IST

21:51 October 29

టాప్​న్యూస్​@ 10PM

  • ఉపసమరానికి సర్వం సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్‌ ఉపపోరుకు సమయం ఆసన్నమైంది. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం చేసిన ఉపఎన్నికకు రేపు పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 20 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 'చిత్ర పరిశ్రమ ఓ గొప్ప నటుడ్ని కోల్పోయింది'

కన్నడ కంఠీరవ రాజ్​కుమార్​ తనయుడు పునీత్​ రాజ్​కుమార్ (Puneeth rajkumar news)​ మరణంతో.. భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన అకాల మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ (Modi puneeth rajkumar) సహా పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయిందని అన్నారు.

  • 'మంగళవారం మరదలమ్మా' 

వైఎస్​ఆర్​టీపీ​ అధ్యక్షురాలు షర్మిలనుద్దేశించి చేసిన వ్యాఖ్యల(niranjan reddy comments on sharmila)పై మంత్రి నిరంజన్​రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరికైనా బాధ కలిగితే.. విచారం, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఏపీలో ఓ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు షర్మిల సమాధానం చెప్పాలని కోరారు.

  • బాణసంచా నిషేధంపై సుప్రీం క్లారిటీ

బాణసంచా నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టతనిచ్చింది. తాము అన్ని రకాల టపాసులపై నిషేధం విధంచలేదని, బేరియం సాల్ట్ ఉపయోగించిన వాటికే అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది.

  • ఆ 39 మహిళా అధికారులకు..

39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా కల్పిస్తూ భారత ఆర్మీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హోదా కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. .. నవంబరు 1లోగా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా(Permanent Commission For Women) కల్పించాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

20:54 October 29

టాప్​న్యూస్​@ 9PM

  • 'పునీత్​​' మరణం పట్ల ప్రముఖుల సంతాపం

కన్నడ చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

  • నిన్న లైవ్​లో ఉరి.. నేడు వాగులో..

హైదరాబాద్​లో నిన్న ఇన్​స్టా లైవ్​లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మాజీ మిస్​ తెలంగాణ భవాని(miss telangana 2018: ).. ఈరోజు మళ్లీ వాగులో దూకి బలవన్మరణానికి పూనుకుంది. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి హాని జరగకుండా.. ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. అసలు ఆమె ఇలా.. వరుసగా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందంటే..

  • 'కొవాగ్జిన్ తీసుకున్న వారికి'

కొవాగ్జిన్ టీకా తీసుకుని విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు మళ్లీ కొవిషీల్డ్(Covishield Vaccine News) టీకా అందించాలన్న పిటిషన్​పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొవాగ్జిన్ టీకా తీసుకున్నవారికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ అందించాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చి.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

  • డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​గా..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్​గా టెడ్రోస్‌ అధనోమ్‌ (WHO Chief) రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు డబ్ల్యూహెచ్​ఓ శుక్రవారం తెలిపింది.

  • టీమ్​ఇండియా ఫీల్డింగ్​ కోచ్​ రేసులో..

టీమ్​ఇండియా ఫీల్డింగ్​ కోచ్ బాధ్యతలు స్వీకరించేందుకు మాజీ క్రికెటర్ అభయ్​ శర్మ(abhay sharma fielding coach) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి దరఖాస్తు కూడా సమర్పించాడీ మాజీ క్రికెటర్.

19:56 October 29

టాప్​న్యూస్​@ 8PM

  • 'మంగళవారం మరదలమ్మా' వ్యాఖ్యలపై..

వైఎస్​ఆర్​టీపీ​ అధ్యక్షురాలు షర్మిలనుద్దేశించి చేసిన వ్యాఖ్యల(niranjan reddy comments on sharmila)పై మంత్రి నిరంజన్​రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరికైనా బాధ కలిగితే.. విచారం, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఏపీలో ఓ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు షర్మిల సమాధానం చెప్పాలని కోరారు.

  • 'కార్యకర్తల కాళ్లు విరిగేలా దాడి చేస్తారా?'

వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన కిసాన్ మోర్చా నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay today news) తెలిపారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే కార్యకర్తల కాళ్లు విరిగేలా దాడి చేస్తారా?' అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వందలాది మంది కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • బాణసంచా నిషేధంపై సుప్రీం క్లారిటీ

బాణసంచా నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టతనిచ్చింది. తాము అన్ని రకాల టపాసులపై నిషేధం విధంచలేదని, బేరియం సాల్ట్ ఉపయోగించిన వాటికే అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది.

  • 'చిత్ర పరిశ్రమ ఓ గొప్ప నటుడ్ని కోల్పోయింది'

కన్నడ కంఠీరవ రాజ్​కుమార్​ తనయుడు పునీత్​ రాజ్​కుమార్ (Puneeth rajkumar news)​ మరణంతో.. భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన అకాల మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ (Modi puneeth rajkumar) సహా పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయిందని అన్నారు.

  • విండీస్ విజయం

టీ20 ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​పై ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో విజయం సాధించింది వెస్టిండీస్. మూడు పరుగుల తేడాతో గెలుపొందింది.

19:18 October 29

టాప్​న్యూస్​@ 7PM

  • భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ

తెలంగాణలో భారీగా మున్సిపల్​ కమిషనర్లు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మందికి స్థానచలనం కలిగింది. 

  • నవంబర్ 1న పునీత్ ఏం చెప్పాలనుకున్నారు?

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ హఠాన్మరణం సినీలోకంతో పాటు అభిమానుల్ని తీవ్ర వేధనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుభవాల్ని పంచుకుంటున్నారు సినీ ప్రముఖులు. అలాగే ఆయనకు సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ..పునీత్​ను గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో పునీత్​కు సంబంధించిన వీడియోలపై ఓ లుక్కేద్దాం.

  • ఈ రాత్రికి జైలులోనే ఆర్యన్​ఖాన్!

డ్రగ్స్‌ కేసులో అరెస్టైన బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ విడుదల మరో రోజుకు వాయిదా పడింది. జైలు నుంచి శుక్రవారం విడుదలవుతాడని భావించినప్పటికీ.. బెయిల్​కు సంబంధించిన ఆర్డర్‌ కాపీ తమకు అందలేదని ముంబయి ఆర్ధర్‌ రోడ్‌ జైలు అధికారులు తెలిపారు.

  • పురుషుల జట్టుకు మహిళా కోచ్

క్రికెట్​ చరిత్రలో తొలిసారి ఫ్రాంచైజీ క్రికెట్​లో ఓ మహిళా క్రికెటర్​ పురుషుల జట్టుకు కోచ్​గా బాధ్యతలు స్వీకరించనుంది. టీ10 లీగ్ ఐదో సీజన్​​ నేపథ్యంలో ఈ కీలక ప్రకటన చేసింది టీమ్​ అబుదాబి. తమ జట్టుకు అసిస్టెంట్​ కోచ్​గా ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్​ను(sarah taylor coach) నియమిస్తున్నట్లు ట్వీట్ చేసింది.

  • ఫేస్​బుక్ పేరు మార్పుతో మనకేంటి లాభం?

మెటావర్స్​తో సరికొత్త సాంకేతిక యుగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపారు ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్. ఫేస్​బుక్ మాతృసంస్థ పేరును మెటావర్స్​(facebook new name)గా మార్చుతున్నట్లు ప్రకటించారు. మార్కె చెప్పిన ఈ కొత్త వ్యవస్థ ఎలా పనిచేయబోతుంది? వర్చువల్ ప్రపంచం ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో రాబోయే విప్లవాత్మక మార్పులు(facebook name change) ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

17:59 October 29

టాప్​న్యూస్​@ 6PM

  • 'పేలవమైన వాదన వల్లే..'

జాతీయ హరిత ట్రైబ్యునల్​ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పేలవమైన వాదనలు వినిపించడం వల్లే పాలమూరు-రంగారెడ్డిని నిలిపివేయాలని తీర్పు వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఫలితంగా ఆ ప్రాజెక్టును శాశ్వతంగా సమాధి చేశారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. దక్షిణ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్​ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు.

  • నేత్రదానం చేసిన పునీత్​.. 

గుండెపోటుతో మరణించిన పునీత్​ రాజ్​కుమార్​.. నేత్రదానం చేశారు. ఈ నిర్ణయం పట్ల అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. నటుడ్ని కొనియాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

  • ఇటలీలో మోదీకి ఘనస్వాగతం

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీలోని రోమ్​కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. మరోవైపు.. యూరోపియన్‌ యూనియన్ దేశాధినేతలతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్రమోదీ.

  • 'పీఎం రేసుపై అన్నీ ఇప్పుడే చెబితే ఎలా?'

2024 లోక్​సభ ఎన్నికల్లో పీఎం రేసులో ఉండడంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee News) కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. అయితే.. దీని గురించే అన్నీ ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు.

  • పూరన్​ మెరుపు ఇన్నింగ్స్.. 

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో 142 పరుగులు చేసింది వెస్టిండీస్(WI vs BAN T20 Match). నికోలస్ పూరన్(40) ధనాధన్ ఇన్నింగ్స్​తో అలరించాడు.

16:48 October 29

టాప్​న్యూస్​@5PM

  • పునీత్​ గురించి ఈ విషయాలు తెలుసా..?

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. 46 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి అభిమానులకు తీవ్ర వేదన మిగిల్చారు. అటు సినీ ప్రముఖుల నుంచి ఇటు అభిమానుల వరకు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పునీత్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

  • రజనీకాంత్​కు సర్జరీ..

సూపర్​స్టార్ రజనీకాంత్(rajinikanth health) స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనకు విజయవంతంగా సర్జరీ చేశారు చెన్నై కావేరి ఆస్పత్రి వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి.

  • మా ఓట్లు అంత చీపా..?

హుజూరాబాద్​ ఎన్నికల్లో ధనప్రవాహం హోరెత్తుతోంది. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. గెలవటమే ముఖ్యమని విచ్చవిడిగా ఆయా పార్టీలు.. నోట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఏ పార్టీ అని చూడకుండా అందినకాడికి తీసుకుందామని ఓటర్లు కూడా ఫిక్స్​ అయినట్టున్నారు. డబ్బు ఇవ్వకపోయినా.. కొందరికి ఎక్కువిచ్చి వాళ్లకు తక్కువిచ్చినా.. రోడ్లెక్కేస్తున్నారు. గుట్టుగా నడిపిస్తున్న తతంగాన్ని బజార్లో పెట్టేసి.. బహిరంగం చేసేస్తున్నారు.

  • 'భవిష్యత్​ విద్యుత్ వాహనాలదే '

విద్యుత్ వాహనాల వినియోగం పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీలు, తయారీదారులకు ప్రోత్సాహకాలు అందజేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy news) తెలిపారు. భవిష్యత్​లో విద్యుత్ వాహనాలదే హవా అని పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీ ట్రేడ్ ఎక్స్​పోను ఆయన ప్రారంభించారు.

  • ఆశ తీరకుండానే టీచర్ మృతి.. 

ఆమె ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆన్​లైన్​ క్లాసులు చెబుతున్న ఆమె.. తాను విద్యార్థులను చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. కానీ, ఆ ఆశ తీరకుండానే... క్లాసు ముగిసిన కాసేపటికే కన్నుమూశారు. తమ టీచర్ ఆకస్మిక​ మృతితో ఆ విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.

15:52 October 29

టాప్​న్యూస్​ @4PM

  • 'పునీత్​ మరణం తీరని లోటు'

కన్నడ చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

  • 'ప్రజల ప్రతి సమస్యా.. నా సమస్యే'

ఇబ్ర‌హీంప‌ట్నం నియోజకవర్గంలోని సీతమ్మపేట్​లో 10వ రోజు పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది (YS Sharmila Padayatra). సీతమ్మపేట్ నుంచి నోముల, లింగపల్లి క్రాస్ మీదుగా సాగుతోంది. సాయంత్రం మంచాల గ్రామంలో మాటా-ముచ్చట నిర్వహించనున్నారు.

  • మీకు మొబైల్ వ్యసనం ఉందా? 

ప్రస్తుతం యువత మొబైల్​ వ్యసనానికి బానిసలవుతున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక దొరికినా సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని డిజిటల్‌ ప్రపంచానికి దూరంగా ఉంచేందుకు గుజరాత్​ అహ్మదాబాద్​లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డిజిటల్ డీటాక్స్ సెంటర్ ​ ఏర్పాటైంది. మొబైల్ వినియోగానికి బానిసలైన చిన్నారులు, యువతీ యువకులకు ఇక్కడ ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.

  • టీమ్ఇండియా బౌలింగ్ దళంపై..

టీమ్​ఇండియా జట్టులో బ్యాటర్లు మాత్రమే ఉంటే సరిపోదని వికెట్లు తీసే స్పిన్నర్లు కూడా ఉండాలని మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar News) అభిప్రాయపడ్డాడు. ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్(IND vs NZ T20) జరగనున్న నేపథ్యంలో టీమ్​ఇండియా బౌలింగ్ దళంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

  • మార్కెట్లపై బేర్​ పంజా

వారాంతంలో స్టాక్ మార్కెట్లు(Stock Market) నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 678 పాయింట్లు, నిఫ్టీ(Nifty today) 186 పాయింట్ల మేర పతనమయ్యాయి.

14:48 October 29

టాప్​న్యూస్​​ @ 3PM

  • పునీత్ రాజ్​కుమార్ హఠాన్మరణం

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్(46) హఠాన్మరణం. శుక్రవారం ఉదయం జిమ్​లో వ్యాయామం​ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆస్ప్రత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈయన మృతి పట్ల కన్నడ, తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పునీత్​ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

  • తృణమూల్​ గూటికి టెన్నిస్​ దిగ్గజం

టెన్నిస్​ స్టార్​ ఆటగాడు లియాండర్​ పేస్​ తృణమూల్​ కాంగ్రెస్​లో (టీఎంసీ) చేరారు. ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ గోవా పర్యటన సందర్భంగా పేస్​ టీఎంసీలో చేరారు.

  •  భారత్​ చేతికి రూ.112 కోట్లు విలువైన..

దశాబ్దాలుగా అమెరికాలో ఉండిపోయిన 248 ప్రాచీన కళాఖండాలు తిరిగి భారత్​కు చేరాయి. ఇందులో నటరాజ కంచు విగ్రహం కూడా ఉంది.

  • ఆర్ఆర్ఆర్​ నుంచి అప్డేట్ 

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'(rrr release date) నుంచి అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ అదేంటి? దాని సంగతేంటి?

  • పడిలేచిన ఐఆర్‌సీటీసీ షేర్లు

జీవనకాల గరిష్ఠానికి చేరి... అతి తక్కువ సయమంలోనే రెండింతలైన ఐఆర్​సీటీసీ షేరు (IRCTC News).. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇటీవల భారీ నష్టాన్ని చవి చూసింది. అయితే అదే నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం వల్ల కంపెనీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠం నుంచి ఏకంగా 39 శాతం ఎగబాకాయి.

14:00 October 29

టాప్​ న్యూస్​ @2PM

  • తల్లి బతికుండగానే పెద్దకర్మ

కన్నతల్లికి ఏ కుమారుడైనా ఏదైనా చేయాలి అనుకుంటాడు. ఆమెకో బంగారం లేదా.. ఇల్లు... కొత్త బట్టలు ఇచ్చి మురిసిపోవాలి అనుకుంటాడు. కానీ అమ్మ ప్రేమ విలువ తెలియని ఓ ప్రబుద్ధుడు.. అమ్మ బతికి ఉండగానే... పెద్ద కర్మ పేరిట బంధువులకు కార్డులు పంచి తల్లి పట్ల... తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు. నమ్మలేకపోతున్నారు కదా... అవునండీ నిజమే... ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

  • ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కుట్ర

డ్రగ్స్ ​కేసు.. భాజపా పన్నిన కుట్ర అని ఆరోపించారు (Nawab Malik News) మహారాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్. మహారాష్ట్రను అప్రతిష్ఠపాల్జేసేందుకే ఇలా చేస్తోందని పేర్కొన్నారు.

  • తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపల్​

అల్లరి చేస్తున్నాడనే కారణంతో.. ఓ విద్యార్థిని బిల్డింగ్​ పైఅంతస్తు నుంచి వేలాడదీశాడో (Principal hangs student) స్కూల్​ ప్రిన్సిపల్(Mirzapur news today)​. తప్పు చేస్తే సర్దిచెప్పడం పోయి.. ఇలా శిక్షించడం వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • పడిలేచిన ఐఆర్‌సీటీసీ షేరు

జీవనకాల గరిష్ఠానికి చేరి... అతి తక్కువ సయమంలోనే రెండింతలైన ఐఆర్​సీటీసీ షేరు (IRCTC News).. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇటీవల భారీ నష్టాన్ని చవి చూసింది. అయితే అదే నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం వల్ల కంపెనీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠం నుంచి ఏకంగా 39 శాతం ఎగబాకాయి.

  • 'వరుడు కావలెను' ఎలా ఉందంటే?

13:10 October 29

టాప్​ న్యూస్​ @1PM

  • రఘునందన్‌రావు గృహనిర్బంధం

వరిసాగుపై కలెక్టర్‌ వ్యాఖ్యలకు నిరసనగా... సిద్దిపేట కలెక్టరేట్‌ ముట్టడికి భాజపా పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో భాజపా నేతలు, కార్యకర్తలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేటలో భాజపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 300 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

  • అంతా తెరచాటు వ్యూహమే.!

ఒక్కటంటే ఒక్కరోజే.. మిగిలింది. హుజూరాబాద్‌ ఉప పోరుకు ఘడియలు సమీపిస్తున్నాయి. ఇక్కడి శాసనసభ స్థానానికి ఎమ్మెల్యేగా ఎవరిని ఎంపిక చేసేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. రేపు జరుగనున్న పోలింగ్‌లో ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తారనే సంశయం నేతల్ని వెంటాడుతోంది.

వారి నుంచి కూడా 'డెల్టా' వ్యాప్తి!

టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ యూకే, రష్యా వంటి దేశాల్లో కొవిడ్​ మళ్లీ విజృంభిస్తోంది. టీకా వేసుకున్న వారి నుంచి కూడా డెల్టా వ్యాప్తి చెందడమే ఇందుకు గల కారణమని బ్రిటన్​కు చెందిన ఇంపీరియల్​ కాలేజ్​ లండన్​ చేసిన అధ్యయనంలో తేలింది.

  • హెచ్​ఏఎల్​- బోయింగ్​ బంధం

10ఏళ్ల బంధాన్ని కొనసాగిస్తూ.. హెచ్​ఏఎల్​-బోయింగ్​ మరో మైలురాయికి చేరాయి. ఎఫ్​/ఏ- 18 సూపర్​ హార్నెట్​ ఎయిర్​క్రాఫ్ట్​లో వినియోగించే 200వ గన్​ బే డోర్​ను బోయింగ్​కు డెలివరీ చేసింది హెచ్​ఏఎల్​.

  • మరో 'మల్లేశం'గా నిలిచిందా?

చేనేత కళాకారుల ప్రాధాన్యతను ఆవిష్కరిస్తూ 'మల్లేశం' దోస్త్ కథ అంటూ తెరకెక్కిన చిత్రం 'తమసోమా జ్యోతిర్గమయ'. కేవలం 11 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఎంతో మంది మేధావులు, విమర్శకుల ప్రశంసలందుకుంది. మరి ఆ చిత్రం ఎలా ఉంది? సామాన్య ప్రేక్షకులను మెప్పించిందా?

11:49 October 29

టాప్​ న్యూస్​ @12PM

  • చెన్నైఎన్జీటీ స్టే 

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy Lift Irrigation Project)పై చెన్నైఎన్జీటీ స్టే విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయవద్దని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను చెన్నైఎన్జీటీ పరిగణనలోకి తీసుకుంది.

  • అనుసంధానంపై సమావేశం

హైదరాబాద్​లోని జలసౌధ వేదికగా గోదావరి-కావేరి అనుసంధానంపై సమావేశం ప్రారంభమైంది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2వ సంప్రదింపుల భేటీ జరుగుతుంది.

  • బారికేడ్లు తొలగింపు

ఏడాదిగా మూతపడిన దిల్లీ-ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దును అధికారులు శుక్రవారం తెరిచారు. గాజిపుర్​లోని సరిహద్దును పునరుద్ధరించాలని తమకు స్పష్టమైన ఆదేశాలు అందాయన్నాయని అధికారులు వెల్లడించారు.

  • నిష్పక్షపాతంతో స్వాగతం

మహిళా క్యాడెట్లను నిష్పక్షపాతంతో స్వాగతం పలకాలని.. ఎన్​డీఏ పాసింగ్​ ​అవుట్​ పరేడ్(nda passing out parade 2021)​ వేదికగా పిలుపునిచ్చారు ఆర్మీ చీఫ్​ నరవణే. నూతన సాంకేతికతపై పట్టు సాధిస్తే, కొత్త సవాళ్లను అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.

  • సారీ చెప్పిన డైరెక్టర్

'మహాసముద్రం' సినిమాతో అంచనాలు అందుకోలేకపోయానని డైరెక్టర్ అజయ్ భూపతి అన్నారు. ఓ అభిమాని ట్వీట్​కు రిప్లై ఇస్తూ.. ఇలా చెప్పుకొచ్చారు.

10:58 October 29

టాప్​ న్యూస్​ @11AM

  • పలకరించేందుకు వెళ్లారా?'

దిశ హత్యాచారం నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో(disha encounter case) జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(Justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. సాక్షులు చెబుతున్న సమాధానాల పట్ల కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఎన్​కౌంటర్​లో పాల్గొన్న సీఐ లాల్​మదార్, కానిస్టేబుల్ సిరాజుద్దీన్​లపై ప్రశ్నల వర్షం కురిపించింది.

  • నిందితుడు పరారీ

వికారాబాద్ జిల్లాలో పోలీసు రిమాండ్‌లో ఉన్న నిందితుడు పరారయ్యాడు(escape from police). పరారైన నిందితుడు మహమ్మద్ అర్షద్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్టు చేయగా... అందులో ఒకరు తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

  • పెట్టుబడికి సిద్ధమవుతున్నారా?

ధన త్రయోదశి వచ్చేస్తోంది. ఆ రోజు కోసం అని కాదు కానీ.. అసలు పసిడిని ఎందుకు కొనాలి? ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్న డిజిటల్‌ గోల్డ్‌ను ఎలా కొనాలి? భవిష్యత్‌లో అవసరమైనపుడు దాన్ని సులువుగా ఎలా నగదుగా మార్చుకోవాలి?

  • పసిడి ధర ఎంతంటే?

బంగారం, వెండి ధరలు (Gold Rate Today) శుక్రవారం తగ్గాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

  • రొనాల్డోలా వార్నర్

ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్ వార్నర్​ (David Warner News) ఎంత చలాకీగా ఉంటాడో తెలిసిందే. కుటుంబంతో కలిసి టిక్​టాక్​ వీడియోలు, డబ్​స్మాష్​లతో సామాజిక మాధ్యమాల్లో అలరిస్తూ ఉంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేశాడు. స్టార్​ ఫుట్​బాలర్ రొనాల్డోను (Ronaldo Coca Cola) అనుకరించి నవ్వులు పూయించాడు.

09:54 October 29

టాప్​ న్యూస్​ @10AM

భర్త కాదు.. శాడిస్ట్

ఇద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాతే అతని అసలు స్వరూపం బయటపడింది. భార్యపై తన పైశాచికత్వాన్ని చూపించడం మొదలు పెట్టాడు. ఇక ఆమె చేసేది ఏమి లేక దిక్కుతోచని పరిస్థితుల్లో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • ఇవ్వకపోతే దాడి చేస్తారా?

నిన్నమొన్నటి వరకు ఓటుకు డబ్బులివ్వడం లేదని ధర్నాలు చేశారు. నడిరోడ్డుపైనే నిలదీశారు. నోటిస్తినే ఓటేస్తామని బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఓటర్లు కాస్త రూటు మార్చారు. ఇంకా ఎన్నికకు ఒక్క రోజే ఉంది... డబ్బులివ్వడం లేదని ఏకంగా ఓ కౌన్సిలర్​​ ఇంటిపై దాడి చేశారు. ఇలా తయారయ్యారేంటి... డబ్బులు ఇవ్వకపోతే దాడి చేస్తారా? అని కౌన్సిలర్​ ​ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • దేశంలో కరోనా

భారత్​లో కొత్తగా 14,348 కరోనా కేసులు (Covid cases in India) నమోదయ్యాయి. 805 మంది ప్రాణాలు కోల్పోగా.. 13,198 మంది వైరస్​ను జయించారు.

  • ఇటలీ చేరుకున్న మోదీ

ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోమ్​ నగరానికి(modi italy visit) చేరుకున్నారు. శని, ఆదివారాల్లో జరగనున్న జీ20 సదస్సులో(g20 summit 2021) పాల్గొనేందుకు ఇటలీ పర్యటన చేపట్టారు ప్రధాని.

  • హీట్ పెంచేస్తున్న రష్మీ

బుల్లితెర యాంకర్​ రష్మీ డ్యాన్స్​తో దుమ్మురేపింది. 'ఢీ' కొత్త ఎపిసోడ్ ప్రోమోలో భాగంగా దీపికతో కలిసి అలరించింది. 'అర్జున్​రెడ్డి'లోని 'మధురమే ఈ క్షణమే' పాటకు మత్తెక్కించే స్టెప్పులతో మాయ చేసింది.
 

08:57 October 29

టాప్​ న్యూస్​ @ 9AM

  • 'డిజిటల్‌' దొంగలొస్తున్నారు.. బీ అలర్ట్​..

సైబర్​ మోసాలపై (Cyber Crime) ఆర్‌బీఐ(RBI)కు, ఆర్‌బీఐ నియమించిన బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ కార్యాలయాలకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆర్‌బీఐ అంబుడ్స్‌మ్యాన్‌ కార్యాలయం డిజిటల్‌ మోసాల తీరుతెన్నులపై సమగ్ర నివేదికను రూపొందించింది. ఎవరికి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ నివేదిక సూచించింది. అవేంటో చూద్దాం.

  • జాతీయోద్యమంలో స్వదేశీ జ్వాలను రగిలించిన అగ్గిపెట్టే

మంట రగిలించే అగ్గిపుల్ల... జాతీయోద్యమంలోనూ (Azadi Ka Amrit Mahotsav) అదే పాత్ర పోషించింది. గాంధీజీ కంటే ముందే మనవాళ్లలో స్వదేశీ భావనను జ్వలింపజేసింది. స్వాతంత్య్రోద్యమాన్ని వినూత్నంగా వంటింటి ద్వారా ఇంటింటికీ చేర్చింది.

  • ఆర్​బీఐ గవర్నర్​ పదవీకాలం పొడిగింపు​

ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ పదవీకాలాన్ని కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది డిసెంబరు 12 నుంచి ఈ నియామకం అమలులో ఉంటుందని వెల్లడించింది.

  • ప్రత్యేక వృత్తిగా ఆ ఉద్యోగం

మార్కెట్ రిసెర్చ్​​ ఎనలిస్ట్​ ఉద్యోగాన్ని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్​ సేవల విభాగం ప్రత్యేక వృత్తిగా పరిగణించకపోవడంపై కొన్నేళ్లుగా అక్కడి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా ఎనలిస్ట్​ ఉద్యోగాన్ని ప్రత్యేక వృత్తిగా పరిగణిస్తూ యూఎస్​సీఐఎస్​ కుదుర్చుకున్న ఒప్పందాన్ని కోర్టు ఆమోదించడంపై కంపెనీలు అనందం వ్యక్తం చేస్తున్నాయి.

  • పాత స్మార్ట్​ఫోన్​ను సెక్యూరిటీ కెమెరాగా

సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతుంటే.. వినూత్న ఫీచర్లతో రోజుకో రకం గ్యాడ్జెట్లు మార్కెట్​లో కనిపించి ఊరిస్తుంటాయి. అందుకే నచ్చిన వాటిని వెంటనే కొనేయాలనిపిస్తుంటుంది. ఇదే సమయంలో పాత వాటిని ఏం చేయాలనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అలా మన దగ్గర మిగిలిపోయిన వాటిని మరింత ఉపయోగకరంగా మార్చుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

07:50 October 29

టాప్​ న్యూస్​ @ 8AM

  • 48 శాతం విద్యార్థులు ఇంటర్నెట్​లో అవే చూస్తున్నారు

అంతర్జాలం.. ఫేస్‌బుక్‌.. వాట్సాప్‌.. యూట్యూబ్‌.. వీటితో అమూల్యమైన ఉపయోగాలున్నా.. కౌమార దశలో ఉన్న విద్యార్థుల్లో 48 శాతం మంది వాటిలో అశ్లీల సమాచారం, దృశ్యాల(Pornographic Videos) వైపే మొగ్గుచూపుతున్నారు. ఎవరి కంట పడకుండా ఉండేందుకు ఆధునిక చరవాణులను ఎంచుకుంటున్నారు. కొందరు పార్టీల పేరుతో బూతు చిత్రాలను చూస్తున్నారు. ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈవ్‌టీజింగ్‌లకు పురిగొల్పుతోంది. ఈ పంథా కొనసాగితే మరింతమంది ఈవ్‌టీజర్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని షి బృందాలు తెలిపాయి.

  • ప్రకృతి ప్రకోపం.. వలసల విలాపం!

అభివృద్ధి చెందిన దేశాల్లో విచ్చలవిడిగా వాహనాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకం, ఇతరత్రా కారణాల వల్ల భూతాపం విపరీతంగా పెరుగుతోంది. దీని దుష్ప్రభావాలు ఇప్పటికే కళ్లెదుట కనిపిస్తున్నాయి. నీటి కొరత ఏర్పడటం, పంట ఉత్పత్తులు గణనీయంగా తగ్గడం, సముద్ర మట్టాలు పెరగడం వంటివన్నీ ఒకదానితో మరొకటి ముడివడి ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా ప్రపంచంలోని పలు ప్రాంతాలు నివాసయోగ్యానికి పనికిరాకుండా పోతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోయే 30 ఏళ్లలో దాదాపు 22 కోట్ల మంది నిరాశ్రయులుగా మారతారని ప్రపంచబ్యాంకు నివేదిక హెచ్చరిస్తోంది.

  • ఏ పెళ్లికైనా ప్రేమ కావాల్సిందే

'వరుడు కావలెను' విడుదల(varudu kaavalenu review) సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు హీరో నాగశౌర్య(naga shourya new movie). తర్వాతి చేయబోయే ప్రాజెక్టుల గురించి వెల్లడించారు.

  • కవలలకు జన్మనిచ్చిన దీపిక

టీమ్​ఇండియా క్రికెటర్​ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik Latest News) తండ్రి అయ్యాడు. అతడి భార్య, స్క్వాష్‌ స్టార్‌ దీపిక పల్లికల్‌ కవలలకు జన్మనిచ్చింది.

  • ఆగని బాదుడు..

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

06:53 October 29

TOP NEWS@7AM

  • తుపాకులగూడెం బ్యారేజీ నుంచే

గోదావరి-కావేరి అనుసంధానాన్ని(Godavari-Kaveri Rivers Connection) తుపాకులగూడెం బ్యారేజీ నుంచే చేపట్టే అంశాన్ని పరిశీలించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ(National Water Development Corporation) ప్రతిపాదించింది. నీటి లభ్యతను ఖరారు చేసే ముందు తమ ఆమోదం కూడా తీసుకోవాలని, ప్రవాహ మార్గాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకొని పోవడం ద్వారా భూసేకరణ సులభమవుతుందని తెలంగాణ తెలిపింది. మళ్లించే నీటిలో కనీసం యాభై శాతం తమకు ఇవ్వాలని కోరింది.

  • కోర్టులో పాఠం చెప్పిన ధర్మాసనం..

దేశ అత్యున్నత న్యాయస్థానంలో (Supreme Court News ) ఎన్నడూ చూడని ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ కేసుకు సంబంధించి జూనియర్​ న్యాయవాదిని అడుగడుగునా ప్రోత్సహిస్తూ.. న్యాయపాఠాలు నేర్పించింది సుప్రీం ధర్మాసనం. న్యాయపరమైన పదాలకు అర్థాలు వివరించింది. సీనియర్​ న్యాయవాది లేని పక్షంలో దాన్ని అవకాశంగా తీసుకొని వాదనలు వినిపించాలని సూచించింది.

  • టాలీవుడ్ నిర్మాత మృతి

తెలుగులో పలు లఘ చిత్రాలతో పాటు 'హార్మోన్స్' సినిమా తీసిన నిర్మాత నాయక్ తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

  • హార్దిక్​ను వదులుకోనున్న ముంబయి

బౌలింగ్​ చేయడానికి ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యను (Hardik Pandya News) ముంబయి ఇండియన్స్​ వదులుకోనుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు గతంలో దిల్లీ క్యాపిటల్స్​కు కెప్టెన్​గా వ్యవహరించిన శ్రేయస్​ అయ్యర్ (Shreyas Iyer News)​.. ఆ జట్టును వీడనున్నట్లు సమాచారం.

  • బ్రెయిన్‌ స్ట్రోక్‌.. ఈ లక్షణాలున్నాయా?

నేడు ప్రపంచ బ్రెయిన్​ స్ట్రోక్ దినం (world stroke day 2021). హైదరాాబాద్​లోనూ రోజురోజుకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు పెరుగుతున్నాయి. నిమ్స్‌లో నెలకు 40-50 మంది వరకు ఈ సమస్యతో చేరుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధిపై అవగాహన పెంచుకొని.. వెంటనే చికిత్స అందించడం ద్వారా ఈ రెండు రకాల మెదడు పోటులను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈనెల 29న ప్రపంచ స్ట్రోక్‌ దినం (world stroke day 2021) సందర్భంగా ఈ కథనం.

04:47 October 29

TOP NEWS@6AM

  •  కాస్మొటిక్‌ వ్యాలీ సంస్థల ఆసక్తి

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కాస్మొటిక్‌ వ్యాలీ సంస్థలు ఆసక్తి చూపాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఫ్రాన్స్​లో పర్యటిస్తున్న మంత్రి ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. భారత్‌లో సౌందర్య సాధనాలకు భారీగా డిమాండ్‌ ఉందని.. మార్కెటింగ్‌లో ఏటా భారీ వృద్ధి రేటు సాధిస్తోందని కేటీఆర్ చెప్పారు. కరోనా సమయంలోనూ సౌందర్య సాధనాల విక్రయాలు తగ్గలేదన్నారు.

 

  •  ధరణి పోర్టల్​కు ఏడాది

భూరికార్డుల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌కి ఏడాది పూర్తైంది. పారదర్శక భూలావాదేవీలతో పోర్టల్ విజయవంతమైందన్న సర్కారు 10 లక్షలకు పైగా లావాదేవీలు పూర్తైనట్లు తెలిపింది.

  • ఆంధ్రాలో తెరాస.. అసలేం జరుగుతోంది?

ఆంధ్రాలో తెరాస(TRS Party in AP).. తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్! తెరాస అంటేనే తెలంగాణ కోసం ఆవిర్భవించిన పార్టీ కదా.. మరి ఆంధ్రాలో తెరాస(TRS Party in AP) ఏంటి? అనే సందేహం అందరి మెదళ్లను తొలచేస్తోంది. 

  • ధరణిలో ఇబ్బందులు

ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తైనా ఇబ్బందులు తొలగలేదు. కొన్ని చోట్ల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఎలాంటి విక్రయాలు జరపలేని పరిస్థితి నెలకొంది. సర్వే నెంబరు, రైతు పేరు, విస్తీర్ణంలో ఎక్కువ, తక్కువల సవరణకు చట్టంలో అవకాశం లేకపోవడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి

 

  • ఇటలీకి ప్రధాని మోదీ

జీ20 సదస్సు (G20 Summit 2021) కోసం ఇటలీ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news) బయలుదేరారు. ఇటలీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాన్ని.. పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు.

  • మరో 30 కోట్ల డోసులు

ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేసే దిశగా (corona vaccines doses) ప్రయత్నాలను ముమ్మరం చేసింది కేంద్రం. వచ్చే నెలలో 30 కోట్ల టీకా డోసులు సేకరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

  • కొత్త చట్టంపై ఊహాగానాలు తగవు

తాము తీసుకువచ్చిన కొత్త చట్టం (china new policy2021) పొరుగు దేశాలపై ఎలాంటి ప్రభావం చూపదని చైనా స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సహాయం, సరిహద్దులపై వైఖరి మారదని పేర్కొంది. సరిహద్దులను పరిరక్షించడానికే కొత్త చట్టం తెచ్చామని డ్రాగన్‌ తెలిపింది.

  •  ఫేస్‌బుక్ కొత్త పేరేంటంటే!

ఫేస్‌బుక్ (facebook latest news) పేరు మార్చుతున్నట్లు ఆ కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు 'మెటా' మాతృసంస్థగా ఉండబోతుందని తెలిపారు.

  • రజనీకాంత్​కు స్వల్ప అస్వస్థత..

తమిళ సూపర్​ స్టార్ రజనీకాంత్ గురువారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు రజనీకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు.

  • '​ బౌలింగ్ చేయాలని ఆశిస్తున్నా'

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా.. టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య బౌలింగ్ చేస్తే జట్టుకు మరింత బలం చేకూరుతుందని మాజీ పేసర్ జహీర్ ఖాన్(Zaheer Khan News) అన్నాడు. నెట్స్​లో హార్దిక్​ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు.

Last Updated : Oct 29, 2021, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details