తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - ఈటీవీ తాజా వార్తలు

top news
top news

By

Published : Oct 18, 2021, 6:02 AM IST

Updated : Oct 18, 2021, 10:02 PM IST

21:50 October 18

టాప్​ న్యూస్​ @10PM

  • దళితబంధు నిధులు విడుదల 

దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు కోసం నిధులు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్​కర్నూల్ జిల్లా చారకొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాల్లో పథకం అమలు కోసం నిధులు మంజూరు చేశారు. 

  • మరో ప్రజాప్రస్థానం

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం (Ys Sharmila Maro Prajaprastanam) యాత్ర ఈనెల 20 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ యాత్రలో వైఎస్ అభిమానులందరూ పాల్గొనాలని వైఎస్ విజయమ్మ (Ys Vijayamma)కోరారు.

  • కోర్టు ప్రాంగణంలోనే న్యాయవాది దారుణ హత్య

దిల్లీలోని రోహిణీ న్యాయస్థానం ప్రాంగణంలో ఇటీవల ఓ గ్యాంగ్‌స్టర్‌ను హత్య చేసిన ఘటన మరవక ముందే.. అదే తరహాలో కోర్టులోనే మరో హత్య జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లా కోర్టులో(Lawyer Killed In Shahjahanpur) ఓ న్యాయవాదిని మరో న్యాయవాది తుపాకీతో కాల్చి చంపాడు.

  • రాణించిన ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ వార్మప్​ మ్యాచ్​లో భారత బౌలర్లు తేలిపోయారు. ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ రెచ్చిపోవడం వల్ల తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. బెయిర్​స్టో (49), మొయిన్ అలీ (43) రాణించారు.

  • 'ప్రకాశ్​రాజ్​ ఓడిపోవడానికి నాగబాబు కారణం'

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోవడానికి నాగబాబు, నరేశ్‌ చేసిన వ్యాఖ్యలే కారణమని సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ప్రకాశ్‌రాజ్‌తో పోలుస్తూ తనను కించపరిచేలా నాగబాబు మాట్లాడటం సరికాదని అన్నారు.

20:54 October 18

టాప్​ న్యూస్​ @9PM

  • ఈసీ కీలక నిర్ణయం

రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌కు ఈసీ లేఖ రాసింది.

  • 'వర్షాకాలంలోనూ వరిధాన్యాన్ని సేకరిస్తాం'

హైదరాబాద్ ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్... సీఎస్ సోమేశ్ కుమార్, తదితర అధికారులతో సమావేశమయ్యారు. ఈ వర్షాకాలంలోనూ వరిధాన్యాన్ని సేకరిస్తామని సీఎం (Cm Kcr on Paddy Procurement) స్పష్టం చేశారు.

  • 'ఏడేళ్లలో దళితబంధుకు రూ.1.7 లక్షల కోట్లు'

బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. రాజకీయాల్లో ఎన్నేళ్లు ఉన్నామనేది ముఖ్యం కాదని.. ఏం సాధించామన్నదే ముఖ్యమన్నారు. వెనకబడిన వర్గాలను బాగుచేసుకునేందుకు యావత్‌ తెలంగాణ ఏకంకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్​లో మోత్కుపల్లి తెరాసతో చేరిన సందర్భంగా దళితుల అభివృద్ధికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

  • డేరా బాబాకు జీవిత ఖైదు

ఓ హత్య కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌధ చీఫ్​ డేరా బాబా(dera baba news) అలియాస్​.. గుర్మీత్​ రామ్​ రహీమ్​ సింగ్​కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. ఆయనతో పాటు మరో నలుగురు దోషులకు సైతం శిక్ష ఖరారు చేసింది.

  • బంగ్లాదేశ్​లో ఆగని అల్లర్లు

దుర్గా పూజల వేళ బంగ్లాదేశ్​లో చెలరేగిన అల్లర్లు(bangladesh violence durga puja) సద్దుమణగటం లేదు. హిందూ ఆలయాలపై దాడిని నిరసిస్తూ మైనారిటీ కమ్యూనిటీలు నిరసనలు చేస్తున్న క్రమంలో అల్లరి మూకలు హిందువుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు(Bangladesh violence). ఈ ఘటనల్లో మొత్తం 86 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు స్థానిక మీడియా తెలిపింది.

19:49 October 18

టాప్​ న్యూస్​ @8PM

  • అక్కడ దళితబంధు బంద్​

హుజూరాబాద్‌ పరిధిలో ఉపఎన్నిక దృష్ట్యా దళితబంధు అమలును నిలపాలని ఈసీ వెల్లడించింది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు నిలపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈసీ లేఖ రాసింది. 

  • ప్రేమకు అడ్డొస్తుందని కన్నతల్లినే కడతేర్చింది... 

ప్రేమకు అడ్డొస్తుందని ప్రియుడితో కలిసి ఓ కుమార్తె తల్లిని చంపేసింది. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి చింతల్‌మెట్‌లో చోటుచేసుకుంది. 

  • రోడ్డు దాటుతుండగా దూసుకెళ్లిన పోలీసు వాహనం..

రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న యువతులను పైకి.. అతివేగంగా వస్తున్న వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువతి మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఓ పోలీస్ ఇన్​స్పెక్టర్ నడిపినట్లు తెలిసింది. (Jalandhar accident today)

  • టాస్ గెలిచిన భారత్

టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా నేడు (అక్టోబర్ 18) ఇంగ్లాండ్​తో వార్మప్ మ్యాచ్(ind vs eng warm up match) ఆడుతోంది టీమ్ఇండియా. ఈ మ్యాచ్​లో ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

  • సినిమా అప్​డేట్స్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో సూపర్​స్టార్​ రజనీకాంత్​, విశాల్​, శింబు, సూర్య, ఆకాశ్​పూరీ నటిస్తున్న చిత్రాల సంగతులు ఉన్నాయి.

18:49 October 18

టాప్​ న్యూస్​ @7PM

  • 'హరీశ్​ను ఇంటికి పంపే ప్లాన్​ సిద్ధమైంది'

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావులపై ఆసక్తికర వ్యాఖ్యలు (Revanth Reddy Interesting Comments) చేశారు. త్వరలో సీఎం కేసీఆర్​ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని చెప్పారు. హరీశ్​ను ఇంటికి పంపే ప్లాన్ సిద్ధమైందని ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయం వద్ద రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి(Revanth Reddy Chitchat)గా మాట్లాడారు.

  • పండుగ రోజు బాలికలపై గ్యాంగ్​ రేప్

దసరా రోజున ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారానికి(gang rape) పాల్పడ్డారు దుండగులు. ఉత్సవాలు చూసి తిరిగి వస్తున్న క్రమంలో వెంట ఉన్న బంధువులను కొట్టి.. అక్కాచెల్లెల్లను(gang rape victim) అపహరించిన దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ సంఘటన ఝార్ఖండ్​లోని గుమ్లా జిల్లాలో జరిగింది.

  • రష్యాలో కరోనా ఉగ్రరూపం

రష్యాలో కరోనా విజృంభణ(Russia covid cases) కొనసాగుతోంది. కరోనా రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆ దేశంలో ఇప్పటివరకు 80 లక్షల మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరోవైపు.. జపాన్​లో అనూహ్యంగా కరోనా(Japan Corona Cases) తగ్గుముఖం పట్టింది. అయితే.. వైరస్ వ్యాప్తి తగ్గడానికి గల కారణాలను అక్కడి నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు

నెదర్లాండ్స్​(ire vs ned t20)తో జరిగిన టీ20 ప్రపంచకప్(T20 world cup 2021) క్వాలిఫయింగ్ మ్యాచ్​లో రికార్డు నెలకొల్పాడు ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంఫర్(curtis campher t20). వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.

  • కాబోయే భర్తతో షిర్డీ సాయిని దర్శించుకున్న నయన్​

ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్(nayanthara vignesh shivan marriage) షిర్డీ సాయిబాబా సేవలో పాల్గొన్నారు. అక్కడి ఆలయ అధికారులు, పూజారులు వారిని శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

17:37 October 18

టాప్​ న్యూస్​ @6PM

  • పోడు భూముల అంశంపై సీఎం భేటీ

పోడు భూముల(CM KCR meeting on podu lands) సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. రాష్ట్రంలోని పోడు భూములపై సీఎస్​ సోమేశ్​ కుమార్​, సంబంధిత శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. పోడు భూముల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాచరణ చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. పోడు సాగుదారుల లెక్క తేల్చి సమస్య పరిష్కరించాలన్నారు.

  • హత్య కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు

ఓ హత్య కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌధ చీఫ్​ డేరా బాబా(dera baba news) అలియాస్​.. గుర్మీత్​ రామ్​ రహీమ్​ సింగ్​కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. ఆయనతో పాటు మరో నలుగురు దోషులకు సైతం శిక్ష ఖరారు చేసింది.

  • థాయ్​లాండ్​ను వణికిస్తున్న వరదలు

థాయ్​లాండ్​ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదనీటితో రిజర్వాయర్లలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జనావాసాల్లోకి నీరు వచ్చి చేరింది. పంటపొలాలు నీటమునిగాయి.

  • 'ధోనీ నాకు లైఫ్​ కోచ్'

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీ ప్రస్తుతం జట్టులో లేకపోవడం వల్ల టీ20 ప్రపంచ కప్​ భారమంతా తనపైనే ఉందని టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya In T20 World Cup) చెప్పాడు. ఈ టోర్నీ తన కెరీర్​లోనే అత్యంత పెద్ద బాధ్యత అని పేర్కొన్నాడు.

  • బోల్డ్​ హెయిర్​స్టైల్​లో శిల్పాశెట్టి.. అభిమానులు ఫిదా!

బాలీవుడ్​ ఫ్యాషన్​ క్వీన్​ శిల్పాశెట్టి(shilpa shetty new haircut) ఎరోబిక్​ వర్కౌట్స్​​ చేస్తున్న వీడియోను పోస్ట్​ చేసింది. ఇందులో ఆమె కొత్త హెయిర్​ స్టైల్​తో కనిపించి ఆకట్టుకుంది. ఈ వీడియో అభిమానులను తెగ అలరిస్తోంది.

16:49 October 18

టాప్​ న్యూస్​ @5PM

  • 'మోత్కుపల్లితో స్నేహం రాజకీయాలకు అతీతం'

బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. రాజకీయాల్లో ఎన్నేళ్లు ఉన్నామనేది ముఖ్యం కాదని.. ఏం సాధించామన్నదే ముఖ్యమన్నారు. వెనకబడిన వర్గాలను బాగుచేసుకునేందుకు యావత్‌ తెలంగాణ ఏకంకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్​లో మోత్కుపల్లి తెరాసతో చేరిన సందర్భంగా దళితుల అభివృద్ధికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

  • కశ్మీర్ విడిచి వెళ్తున్న కూలీలు

కశ్మీర్ లోయలో (Kashmir News) ఉగ్రవాదుల వరుస దాడులు (Non locals killed in Kashmir) అక్కడి ప్రశాంత పరిస్థితికి భంగం కలిగిస్తున్నాయి. జీవనోపాధి కోసం జమ్ము కశ్మీర్​కు వచ్చిన కూలీలు, చిరు వ్యాపారులు.. ఇటీవలి దాడులకు బెంబేలెత్తిపోతున్నారు. చేసేదేం లేక అక్కడి నుంచి తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు.

  • అది మిసైల్ కాదు.. హైపర్​సోనిక్ వాహనం: చైనా

హైపర్​సోనిక్ క్షిపణిని పరీక్షించినట్లు (China Hypersonic Missile) వచ్చిన వార్తలను చైనా తోసిపుచ్చింది. తాము పరీక్షించింది హైపర్​సోనిక్ వాహనమని తెలిపింది. అంతరిక్ష ప్రయోగాలకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. (China Hypersonic Missile news)

  • ఒకే పాముకు తోబుట్టువులు బలి

పాము కాటుకు(snake bite news) అక్క, తమ్ముడు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరినీ ఒకే పాము కాటువేసిన ఈ విషాద సంఘటన మహారాష్ట్ర సాంగలీ జిల్లాలో జరిగింది.

  • ధావన్ స్టైల్​లో కోహ్లీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో

సీనియర్ బ్యాట్స్​మన్​ శిఖర్‌ ధావన్‌ను ఆటపట్టించాడు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ(Virat Kohli). ధావన్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను(Shikhar Dhawan Batting Style) అనుకరిస్తూ ఆడాడు. దానికి సంబంధించిన వీడియోను పోస్ట్​ చేయగా అది కాస్త వైరల్​గా మారింది.

16:09 October 18

టాప్​ న్యూస్​ @4PM

  • తెరాసలో చేరిన మోత్కుపల్లి

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Mothkupalli Narsimhulu joins trs) గులాబీ గూటికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్, తెరాస నేతల సమక్షంలో తెలంగాణ భవన్​లో ఆయన పార్టీలో చేరారు.

  • గురుకులాల ప్రారంభంపై హైకోర్టుకు ప్రభుత్వం

రాష్ట్రంలో గురుకులాల ప్రారంభం(GURUKUL SCHOOLS REOPENING)పై స్టే ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్(Telangana Government) హైకోర్టును కోరింది. గురుకులాలు తెరవద్దని గతంలో హైకోర్టు(Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వం.. స్టే ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది.

  • రంకేసిన బుల్​

దేశీయ స్టాక్​ మార్కెట్లు(stock market today) సోమవారమూ బుల్​ జోరు కొనసాగటం వల్ల జీవితకాల గరిష్ఠాలను తాకాయి. చివరకు సెన్సెక్స్​ 460 పాయింట్లు పెరిగి 61,765 వద్దకు చేరింది. నిఫ్టీ(nifty today) 138 పాయింట్ల వృద్ధి చెందింది.

  • షోయబ్‌ అక్తర్‌కు చురకంటించిన భజ్జీ

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మరోసారి చురక అంటించాడు. అక్తర్‌ చేసిన ఓ సరదా ట్వీట్‌కు(Shoaib Akhtar Tweet) భజ్జీ తనదైనశైలిలో సమాధానమిచ్చాడు(Harbhajan Singh On Shoaib Akhtar). ప్రస్తుతం ఈ ట్వీట్స్​ వైరల్​గా మారాయి.

  • 'విష్ణును రెండేళ్ల వరకు నిద్రపోనివ్వను'

'మా' ఎన్నికల్లోఓటమి చెందిన ప్రకాశ్‌రాజ్‌(maa elections prakash raj panel).. అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణును రెండేళ్ల వరకు నిద్రపోనివ్వకుండా చేస్తానని అన్నారు. అసోసియేషన్‌లో అభివృద్ధి కోసం విష్ణు ప్యానల్​ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో తెలుసుకోవడానికి ప్రతిసారీ వారిని రిపోర్ట్‌ కార్డ్‌ అడుగుతానని మరోసారి స్పష్టం చేశారు(maa elections manchu vishnu panel).

14:39 October 18

టాప్​ న్యూస్​ @3PM

  • రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రోజున యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరతారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించడంతో పాటు.... యాదాద్రి పునఃప్రారంభ తేదీలు ప్రకటించే అవకాశముంది. మహాసుదర్శన యాగం వివరాలూ వెల్లడిస్తారని సమాచారం. 

  • శబరిమలకు నో ఎంట్రీ!

కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. పథనంతిట్ట, కొట్టాయం, కొల్లం, ఇడుక్కి జిల్లాలోని జలాశయాల​ గేట్లను అధికారులు ఎత్తేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు (heavy floods in kerala) ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా శబరిమల ఆలయానికి ప్రస్తుతానికి ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.

  • దివ్యాంగులైన కుమార్తెలే తండ్రికి 'ఆ నలుగురై'

దివ్యాంగులైన నలుగురు మహిళలు అనారోగ్యంతో మృతిచెందిన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృతితో వీరికి జీవనాధారం కోల్పోయినట్లు అయింది. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలో జరిగింది.

  • బెంగళూరు 'బెంగ' తీర్చే కెప్టెన్ ఎవరు?

ఆర్‌సీబీ కెప్టెన్‌గా (Virat Kohli RCB Captaincy) ఇదే చివరి ఏడాది అని విరాట్‌ కోహ్లీ ప్రకటించడం వల్ల ఎలాగైనా కప్‌ కొట్టాలనే కసితో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు (RCB Team) ఆడతారేమో అనుకున్నారంతా. అయితే రెండు అడుగుల దూరంలో ట్రోఫీ కోల్పోయింది కోహ్లీ సేన. ఈ సారి కూడా ప్లేఆఫ్స్‌లోనే నిష్క్రమించడం వల్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వచ్చే ఏడాది (IPL 2022) నుంచి ఎవరు కెప్టెన్‌గా(RCB Next Captain) ఉంటారనే దానిపైనా చర్చ కొనసాగుతోంది.

  • నాని 'శ్యామ్​సింగరాయ్' రిలీజ్ డేట్ ఫిక్స్

నాని-సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'శ్యామ్​సింగరాయ్'(shyam singha roy release date) థియేటర్లలోకి రావడానికి డేట్ ఫిక్సయింది. క్రిస్మస్​ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

14:04 October 18

టాప్​న్యూస్​@ 2PM

  • పెట్రోల్​పై రూ.20, డీజిల్​పై రూ.30 పెంచుతాం..

లీటరు పెట్రోల్ ధరను రూ.20, డీజిల్ ధరను రూ.30 మేర ఒకేసారి పెంచేందుకు అనుమతించాలని శ్రీలంక ప్రభుత్వాన్ని కోరింది లంక ఐఓసీ. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు తప్పదని వివరించింది.

  • సర్కారీ బడి పిల్లలకు సైబర్‌ పాఠం

తెలిసీ తెలియని ప్రాయం..అనుకోకుండా ఆన్‌లైన్‌ వలలో చిక్కుకుంటోంది. సైబర్‌ ప్రపంచంలో సమిధలుగా మిగుల్చుతోంది. తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోననే భయం.. స్నేహితులకు చెబితే పలుచన అవుతామేమోన్న ఆందోళన.. ఇలా చిన్నవయసులోనే విద్యార్థులు సైబర్‌ నేరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బాలికలను లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు వికృత చర్యలకు దిగుతున్నారు. దీన్ని అరికట్టి బాలబాలికల్లో సైబర్‌ నేరాలపై జాగృతం చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు.

 

  • ఈటలతో ఒరిగేదేం లేదు..

ఈటల రాజేందర్‌తో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) ఉద్ఘాటించారు. తెరాసనే గెలిపించాలని ఓటర్లను కోరారు. నియోజకవర్గంలోని జూపాకలో పర్యటించి తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరఫున ప్రచారం నిర్వహించారు.

  • హైదరాబాద్ పబ్లిక్ స్కూల్​కి 50 ఎకరాలు..

రంగ‌ల్ అద్దె భవనంలో నడుస్తున్న హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌(Hyderabad Public School in Warangal)కు ప్ర‌భుత్వం స్థ‌లాన్ని కేటాయించింది. విద్యారంగంలో ప్రాథ‌మిక స్థాయి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హచ్​పీఎస్(Hyderabad Public School in Warangal)​.. స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. 

  • అంచనాలకు మించి ధాన్యం దిగుబడులు

12:55 October 18

టాప్​న్యూస్​@ 1PM

  • చిరంజీవి వెబ్​సైట్​

మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ‘'చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ మరో ముందడుగు' వేసింది. ఇకపై ఈ ట్రస్ట్‌ సేవలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ను సోమవారం ఉదయం చిరు తనయుడు రామ్​చరణ్‌ ఆవిష్కరించారు. మరిన్ని ప్రాంతాలకు, మరెంతో మందికి చిరు బ్లడ్‌, ఐ బ్యాంక్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

  • వరదలపై రెడ్ అలర్ట్ 

కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. పథనంమిట్ట, కొట్టాయం, కొల్లం, ఇడుక్కి జిల్లాలోని జలాశయాల​ గేట్లను అధికారులు ఎత్తేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

కొనసాగుతున్న 'మా' రగడ..

ఇటీవల 'మా' ఎన్నికలు(maa elections 2021) నిర్వహించిన అధికారితోనే తమకు సమస్య అని అధ్యక్ష బరిలో నిలిచి ఓడిపోయిన ప్రకాశ్​రాజ్(praksh raj panel) అన్నారు. ఫిర్యాదులపై ఆయన సరిగా స్పందించట్లేదని చెప్పారు.

  • ఈ రికార్డులు బ్రేక్ చేస్తారా?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్​ ప్రారంభమైపోయింది. పాకిస్థాన్​తో టీమ్​ఇండియా తొలి మ్యాచ్ అక్టోబర్​ 24న​ ఆడనుంది. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్​లో భారత స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్​ శర్మ బ్రేక్ చేయబోయే రికార్డులపై ఓ లుక్కేయండి.

  • పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర (Silver price today) కూడా అదే బాటలో పయనించింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

11:44 October 18

టాప్​న్యూస్​@ 12NOON

  • రాజీనామాలు అందలేదు

'మా' అధ్యక్షుడిగా అన్ని విధాల కృషి చేస్తానని మంచు విష్ణు అన్నారు. ప్రకాశ్​రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు తనకు ఇంకా అందలేదని తెలిపారు.

  • రైతుల 'రైల్​ రోకో'

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. రైతు సంఘాలు రైలురోకోను చేపట్టాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి. అయితే ఈ ఆందోళనలో పాల్గొనేవారిపై కేసులు నమోదు చేస్తామని లఖ్​నవూ పోలీసులు హెచ్చరించారు.

  • స్నేహితులతో కలిసి హత్య చేసి

సోదరితో వివాహేతర సంబంధం ఉన్న కారణంగా ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు ఓ కర్ణాటకవాసి.అతడి స్నేహితులు ఇందుకు సాయం చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

  • యాదాద్రి ఆలయానికి పెంబర్తి కళాకృతులు

హస్తకళలకు నిలయమైన పెంబర్తిలో.. హస్త కళాకారులు యాదాద్రి ఆలయ పనుల్లో తలమునకలయ్యారు. త్వరలో ఆలయ ఉద్ఘాటన మహోత్సవం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న క్రమంలో ఆలయానికి వైవిధ్యమైన నగిశీలతో తొడుగులు(Pembarthy artifacts in Yadadri Temple) రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ ‘స్ఫూర్తి’ పథకం కింద ఆధునిక పరికరాలను రాయితీపై అందజేసింది. సరికొత్త యంత్రాలతో కళాకారులు వినూత్న కళాకృతులకు ప్రాణం పోస్తున్నారు.

  • ఈ వారం ఓటీటీ/థియేటర్​లో వచ్చే సినిమాలివే

ఈ వారం కూడా పలు సినిమాలు(ott movies releasing this week).. ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ అవేంటి? ఎందులో రిలీజ్​ కానున్నాయి? అనేది తెలుసుకోవాలంటే ఈస్టోరీ చదివేయండి.

10:50 October 18

టాప్​న్యూస్​@ 11AM

  • భూత వైద్యం పేరుతో అత్యాచారయత్నం..

ఆమె ఓ రైతు.. కూలీలను పిలుద్దామని అలా వెళ్లింది. అంతలోనే అక్కడో భూతవైద్యుడు మాట కలిపాడు. మోకాళ్ల నొప్పులు కదా.. మందిస్తా రావమ్మా.. అంటూ లోపలికి తీసుకెళ్లాడు. తన కుక్క బుద్ధిని చూపించబోయాడు. ఆమె ప్రతిఘటించింది. ఇదేం పద్ధతంటూ ఛీత్కరించుకుంది. భూత వైద్యుడికి కోపమొచ్చింది. కాళ్లూ చేతులూ కట్టేశాడు. గొడ్డలితో విచక్షణారహితంగా నరికేశాడు. ఆ తర్వాత ఆ భూతవైద్యుడినీ...

  • నిబంధనలు బేఖాతర్​!

రిజిస్ట్రేషన్ శాఖలో (Stamps and Registration Dept ) ప్రభుత్వ శాఖలకు భిన్నంగా పరిపాలన సాగుతోంది. కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసి అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారు. నియమ నిబంధనలు తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్లు చెయ్యడంలో.. వక్రభాష్యం చెప్పడంలో ఆరితేరినారు కొందరు సబ్ రిజిష్ట్రార్లు.

  • చైనా ఆర్థిక వ్యవస్థ డీలా!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో (China Slowdown 2021) ఒకటైన చైనా.. ఈ త్రైమాసికంలో స్వల్ప క్షీణతను నమోదు చేసింది. గత క్వార్టర్​తో పోల్చుకుంటే మరింత వెనకబడింది. చైనాలో నిర్మాణరంగం సంక్షోభాన్ని ఎదుర్కోవడమే ఇందుకు కారణమని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.

  • 'చెన్నై'కి కింగ్​ అయినా తల్లికి కొడుకే!

ఐపీఎల్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్(ruturaj gaikwad family)​.. ఇంటి దగ్గర ఘన స్వాగతం లభించింది. అతడి తల్లి ఎంతో ప్రేమతో స్వాగతం పలికింది. అందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే(csk win ipl) ట్వీట్ చేసింది.

  • స్వామివారి సేవలో మంచు కుటుంబం..

'మా' ఎన్నికల్లో విజయంతో తిరుమల శ్రీవారిని సినీనటుడు మోహన్‌బాబు, మంచు విష్ణు దర్శించుకున్నారు. ప్యానల్‌ సభ్యులతో కలిసి 'మా' అధ్యక్షుడు విష్ణు.. వేంకటేశ్వరుడిని దర్శించుకుని... స్వామివారి ఆశీస్సులు తీసుకున్నామని మంచు విష్ణు తెలిపారు.

09:56 October 18

టాప్​న్యూస్​@ 10AM

  • లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు (Stock Market today) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 448 పాయింట్లకుపైగా లాభంతో 61,753 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 126 పాయింట్లకుపైగా పెరిగి 18,467 వద్ద కొనసాగుతోంది.

  • 230రోజుల కనిష్ఠానికి

భారత్​లో ఒక్కరోజే 13,596 మంది​కి (Covid cases in India) వైరస్​ సోకింది. గత 230రోజుల్లో ఇవే అతి తక్కువ కేసులు.

  • ఉత్తరాఖండ్​లో రెడ్​ అలర్ట్​

దిల్లీ సహా పలు ఉత్తర భారత ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి(north india rain news ). దీంతో అనేక ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు(delhi rain news). ఉత్తరాఖండ్​లోని చమోలిలో అధికారులు రెడ్​ అలర్ట్​ జారీ చేశారు.

  • మ్యాచ్ ఓడినా..

బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్​ షకీబ్​ అల్ హసన్(shakib al hasan news) అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత సొంతం చేసుకున్నాడు.

  • చరణ్-గౌతమ్ సినిమా..

స్టార్ హీరో రామ్​చరణ్(ram charan new movie) డిఫరెంట్​ కథతో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. 'ఆర్ఆర్ఆర్'(rrr release date) పీరియాడికల్ కథ.. శంకర్​ సినిమా పొలిటికల్ బ్యాక్​డ్రాప్​తో ఉండనుంది. ఆ తర్వాత చేయబోయే సినిమా స్పై థ్రిల్లర్​ కథతో తీయనున్నట్లు తెలుస్తోంది.

08:49 October 18

టాప్​న్యూస్​@ 9AM

  • భారీ అగ్ని ప్రమాదం..

గుజరాత్​లోని సూరత్​కు సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ మాస్కుల తయారీ పరిశ్రమలో మంటలు పెద్ద ఎత్తున్న చెలరేగాయి. అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. కాగా పరిశ్రమలో మరో 200మంది కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం. 

  • అడుగడుగునా ఆహ్లాదం..

మైమరపించే ప్రదర్శనలు.. జిగేల్‌మనిపించే వెలుగులు.. పర్యాటకుల కేరింతలతో రామోజీ ఫిల్మ్‌సిటీ సందడిగా మారింది. భూతల స్వర్గంగా పేరొందిన రామోజీ ఫిల్మ్‌సిటీ... అద్భుతమైన అందాలను ఆవిష్కరిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తోంది. దాదాపు రెండేళ్లుగా ఇంటికే పరిమితమైన ప్రజలకు... సరికొత్త ఆశలను కల్పిస్తూ స్వాగతం పలుకుతోంది. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పర్యాటకులకు వినోదాన్ని అందిస్తోంది.
 

  • అన్ని వేల ఎకరాలు కాజేశారా?

తెలంగాణలో వక్ఫ్‌ ఆస్తులు కబ్జా కోరల్లో (Alienation of Waqf property) ఉన్నాయి. దాదాపు 57,423 ఎకరాల పరాధీనమయ్యాయి. వేలాది ఎకరాల రికార్డులు మాయమయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలతో 989 ఆస్తుల ఆక్రమణదారులకు వక్ఫ్‌బోర్డు నోటీసులు జారీ చేసింది.

  • ఎవరిది పైచేయి?

హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య (Huzurabad by poll 2021) పోటీ నెలకొంది. ప్రధానంగా చూస్తే రెండు పార్టీల మధ్యే అసలైన సమరం జరగనున్నట్లు తెలుస్తోంది. అధికార తెరాస, భాజపా మధ్యే నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ ఉంది. తెరాస వైపు మంత్రులు, భాజపా తరఫున ఈటల దంపతులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

  • టార్గెట్ రూ.10 వేల కోట్లు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ థియేటర్లు(theatres open) దాదాపుగా తెరుచుకున్నాయి. దీంతో ఈ ఏడాది మిగిలిన నెలలతో పాటు వచ్చే ఏడాది సినిమాల ద్వారా భారీగా ఆర్జన ఉంటుందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు.

08:01 October 18

టాప్​న్యూస్​@ 8AM

  • కరోనా టీకాకు పక్కా ప్రణాళిక

తెలంగాణలో నూరు శాతం కరోనా టీకాల పంపిణీ(Corona Vaccination in Telangana)కి రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రణాళికలు రచిస్తోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో ఇప్పటికే తొలిడోసు టీకా ప్రక్రియ 100 శాతం పూర్తయింది. పల్లెల్లోనూ అర్హులైన వారందిరికి 100 శాతం టీకాల పంపిణీ(Corona Vaccination in Telangana) అమలు చేసే విధంగా.. స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టింది.

  • ప్రాణాంతక డెంగీకి టీకా

జపాన్‌కు చెందిన తకేడా ఫార్మా తాను అభివృద్ధి చేసిన డెంగీ టీకాను (Dengue Vaccine Takeda) మన దేశంలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)తో సంప్రదింపులు చేపట్టినట్లు సమాచారం. దీనికి సానుకూల స్పందన లభిస్తే వెంటనే టీకా అందుబాటులోకి తీసుకురావటానికి తకేడా ఫార్మా (Dengue Vaccine Takeda) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

  • భారీగా పెరిగిన పసిడి దిగుమతి

ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో బంగారు దిగుమతి భారీగా పెరిగి 2,400 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,80,000 కోట్లు) చేరినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది ఈ సమయంలో దిగమతులు 680 కోట్ల డాలర్లు మాత్రమే కావడం గమనార్హం.

  • టీమ్​ఇండియాకు సవాలు ఇదే!

ఐపీఎల్‌లో వివిధ జట్ల తరపున ఆడేందుకు విడిపోయిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు మళ్లీ కలవాల్సిన సమయం వచ్చేసింది. లీగ్‌లో ఆయా ఫ్రాంఛైజీల తరపున గొప్ప ప్రదర్శనతో అదరగొట్టిన మన క్రికెటర్లు.. ఇప్పుడు జాతీయ జట్టు తరపున అదే జోరు కొనసాగించాల్సిన తరుణం ఆసన్నమైంది. 

  • రష్మిక రికార్డు

నేషనల్​ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలిచే రష్మిక(rashmika mandanna movies).. సినిమాలతో కాదు మరోలా వారి మనసు గెలిచింది. దక్షిణాది స్టార్స్​ను అధిగమించి, ఫోర్బ్స్ లిస్ట్​లో(forbes list 2021) అగ్రస్థానం దక్కించుకుంది.

06:42 October 18

టాప్​న్యూస్​@ 7AM

  • కేంద్రంలోనూ చక్రం తిప్పుతాం..

తెలంగాణ ప్రభుత్వాన్ని, తెరాస పార్టీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి అధికారంలో వస్తామని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో గులాబీ జెండాయే ఎగురుతుందని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అతి పెద్ద పార్టీల్లో తెరాస ఒకటిగా ఉంటుందన్న సీఎం.. కేంద్రంలో అధికారం కోసం ఇతర పార్టీలకు తమ అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. అప్పుడు తామే చక్రం తిప్పుతామని పేర్కొన్నారు.

  • చైనా సరిహద్దులో రాత్రింబవళ్లు నిఘా..

నిఘా నుంచి కాల్చడం వరకు (సెన్సార్‌ టు షూటర్‌) విధానంలో నిఘా వ్యవస్థలతో అనుసంధానం చేసిన టహెరాన్‌ట డ్రోన్లను చైనా సరిహద్దుల్లో మోహరించింది భారత్. నిరంతరం ఎగురుతూ గస్తీ కాసే ఇవి అవాంఛనీయ పరిస్థితులు ఎదురయినప్పుడు అతి తక్కువ సమయంలో బలగాలను సిద్ధం చేయగలవు.

  • మరింత దిగిరానున్న ఉల్లి ధరలు!

బఫర్ స్టాక్​ను విడుదల చేసి దేశంలో ఉల్లి ధరలను (Onion buffer stock) నియంత్రిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రధాన మార్కెట్లలో 67,357 టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్ ​నుంచి విడుదల చేసినట్లు వెల్లడించింది. దీని ఫలితంగా ఉల్లి ధర మెట్రో నగరాల్లో కేజీకి రూ.42-57 (Onion rate today) మధ్యకు చేరిందని తెలిపింది.

  • మిమ్మల్ని కాపాడే సూపర్‌ స్టారేనా?

కారణమేదైనా కానీ.. కారు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. పెరిగిపోతున్న ట్రాఫిక్‌ రద్దీ, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు సేఫ్టీ రేటింగ్స్​ని బట్టి కారు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ రేటింగ్‌ గురించి తెలుసుకుందామా?

  • సన్​ డే ఫన్​ డే..

" సన్‌ డే పన్‌డే" (Sunday funday at tank bund) కార్యక్రమానికి నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తుంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జనాల తాకిడి పెరుగుతుంది. ఆదివారం సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్‌ పరిసరాలు సరికొత్త అందాలను వీక్షిస్తూ....కుటుంబ సమేతంగా మధురానుభూతులను పొందుతూ.... నగరావాసులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సహంగా గడుపుతున్నారు.

03:25 October 18

టాప్​న్యూస్​@ 6AM

  • ఆ ఆలోచనే లేదు..!

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం తెరాసదేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు ధీమా వ్యక్తం చేశారు. తాజా సర్వే ప్రకారం తెరాసకు 13 శాతానికి పైగా ఓట్లు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలకు వివరించారు. ప్లీనరీ ముగిసిన తర్వాత ఈనెల 26 లేదా 27న ఎన్నికల ప్రచార సభకు తాను హాజరుకానున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.  
 

  • ప్రచారానికి రెడీనా..

హుజురాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి..? ఇతర పార్టీలతో పోటీ పడి కాంగ్రెస్‌ ఎందుకు ప్రచారం చేయడం లేదు...? (congress prepare campaign team) నామినేష‌న్ల ప్రక్రియ ముగిసి వారం దాటినా... ముఖ్య నేత‌లెవ‌రూ అటువైపు ఎందుకు క‌న్నెత్తి చూడ‌టం లేదు...? స్టార్ క్యాంపెన‌ర్లను నియమించినా ప్రచారానికి ఎందుకు పోవడం లేదు.

  • ఆలోచించి ఓటేయండి..

ఈటల రాజేందర్​ను (huzurabad by poll campaign news) కేసీఆరే పెంచి పెద్ద చేస్తే.. ఆయన మాత్రం.. కేసీఆర్​కు ఘోరీ కడతా అంటున్నారని హరీశ్​రావు తెలిపారు. కరీంనగర్​ జిల్లా వీణవంకలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్న ఈటల. ఏ పార్టీకి ఓటు వేస్తే హుజూరాబాద్​ అభివృద్ధి చెందుతుంతో ప్రజలు ఆలోచించాలని కోరారు.

  • వర్ష సూచన..

రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (weather report) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

  • ఆరంభం అదిరింది..

"ఏక్ శామ్ చార్మినార్ కె నామ్" కార్యక్రమం (Ek Shaam Charminar ke Naam ) ఆహ్లాదంగా సాగింది. ఆదివారం ప్రయోగాత్మకంగా ప్రారంభమైన వేడుకకు... భాగ్యనగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ స్పెషల్ పోలీసుల బ్యాండ్ ఆకట్టుకుంది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.

  • సైబరాసురులు

పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు.. అయితేనేం ఆన్‌లైన్‌ మోసాల్లో ఆరితేరారు. నయా మోసంలో ఆరితేరిన వారంతా దారిదోపిడీల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తాతలు. ఉండేది పూరిగుడిసెల్లో అయినా.. సాంకేతికతలో పట్టు సాధించి.. అమాయకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేయగల ఘనులు. ఆన్‌లైన్‌ వేదికగా దోపిడీలు చేస్తూ.. కాల్‌నేరాలకు కేంద్రంగా మారిన రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ జిల్లా గురించిన పరిచయమే ఇదంతా..

  • వరుణుడి ప్రకోపం

కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రవాసులకు కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. కొట్టాయం, ఇడుక్కిల్లో కొండచరియలు విరిగిపడి 26 మంది మృత్యువాత పడ్డారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

  • 'కొవాగ్జిన్'పై నిర్ణయం!​

కొవాగ్జిన్​కు అత్యవసర అనుమతులు (Covaxin WHO approval) ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు అక్టోబర్ 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహా మండలి సమావేశం కానుంది. అనుమతుల ప్రక్రియ (Covaxin WHO approval status) పూర్తి చేసేందుకు భారత్ బయోటెక్​తో కలిసి పనిచేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.

  • రెండో ఓపెనర్ ఎవరు?

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా టీమ్​ఇండియా నేడు(అక్టోబర్ 18న) ఇంగ్లాండ్​తో వార్మప్​ మ్యాచ్(team india warm up match)​ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా ముందు పలు సవాళ్లున్నాయి. రెండో ఓపెనర్​గా బ్యాటింగ్​కు దిగేదెవరు? హార్దిక్ పాండ్య ఏ స్థానంలో ఆడతాడు? అన్న విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • వాలు కళ్ల వయ్యారి.. తేనే కళ్ల సింగారి

సీనియర్​ నటి జ్యోతిక(jyothika birthday) తనదైన నటనతో ఎంతో మంది అభిమానుల మనసులో చోటు దక్కించుకుంది. నేడు ఆమె 44వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని సంగతులు మీ కోసం..

Last Updated : Oct 18, 2021, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details