తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - ఈరోజు ముఖ్యాంశాలు

top news
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

By

Published : Aug 5, 2021, 6:35 AM IST

Updated : Aug 5, 2021, 9:56 PM IST

21:50 August 05

టాప్​ న్యూస్​ @10PM

టాప్​ న్యూస్​ @10PM 

  • ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం 

వ్యాక్సిన్ తీసుకొనే లబ్ధిదారుల ఆరోగ్య పరిరక్షణ ఎప్పటికీ తమ తొలి ప్రాధాన్యమని భారత్​ బయోటెక్​ స్పష్టం చేసింది. కొవాగ్జిన్​ నాణ్యతపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న తప్పుడు ప్రచారాన్ని సంస్థ ఖండించింది. ఇలాంటి కథనాల వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

  • రాజన్న రాజ్యం తెస్తా.. 

ఆగస్టు 5 నుంచి జెండా పండుగ నిర్వహిస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. లోటస్ పాండ్​లో పార్టీ జెండా ఎగరవేశారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన రాష్ట్రంలో తీసుకురావటమే లక్ష్యంగా పార్టీ పెట్టినట్లు చెప్పారు.

  • కరోనా పంజా

కేరళలో కొత్తగా 22,040 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 117 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ఒక్కరోజే 1,997 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి.

  • గాయం కారణంగా.. 

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్.. భారత్​తో జరుగుతున్న టెస్టు సిరీస్, టీ20 ప్రపంచకప్​, యాషెస్ టెస్టు సిరీస్​లో పాల్గొనటం లేదని ఇంగ్లాండ్​ అండ్ వేల్స్ క్రికెట్​ బోర్డు స్పష్టం చేసింది. మోచేతి గాయానికి ఇటీవల మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడని తెలిపింది.

  • సెట్స్​లో ఫస్ట్​ టైం

'ఆర్​ఆర్​ఆర్'(RRR Movie)​ షూటింగ్​లో పాల్గొన్న హీరో ఎన్టీఆర్​.. సెట్స్​లో తనకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్​ చేశారు. తన కెరీర్​లో 'ఇలా జరగడం ఇదే తొలిసారి' అంటూ రాసుకొచ్చారు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే?

21:04 August 05

టాప్​ న్యూస్​ @9PM

టాప్​ న్యూస్​ @9PM 

  • కేంద్రానికి కేటీఆర్​ లేఖ

ఆదిలాబాద్​లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్లాంట్​ను పునరుద్ధరించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీసీఐని తిరిగి పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర పరిశ్రమల శాఖామంత్రి మహేంద్రనాథ్ పాండేకి కేటీఆర్ లేఖ రాశారు.

  • ఉభయ సభల్లో అదే రగడ

విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటులో కీలక బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో మూడు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. అన్ని బిల్లులు మూజువాణి ఓటుతోనే గట్టెక్కాయి. మరోవైపు, లోక్​సభలో రెట్రో ట్యాక్స్​ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.

  • ఈ-స్కూటర్​ వచ్చేస్తోంది..

బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ 'సింపుల్​ ఎనర్జీ'.. ఈ స్కూటర్ల అమ్మకానికి సిద్ధమైంది. ఆగస్టు 15న మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. మరి ఈ - స్కూటర్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..?

  • వర్షం అడ్డంకి 

ఇంగ్లాండ్​తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజు టీ బ్రేక్​ సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. వర్షం కారణంగా ప్రస్తుతం మ్యాచ్​ను నిలిపివేశారు.

  • దుల్కర్ నయా కారు అదుర్స్​

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్​.. ఇటీవల తన 35వ పుట్టినరోజును జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా రూ. 2.45కోట్ల విలువైన మెర్సిడెస్​ కారును కొనుగోలు చేశాడు దుల్కర్. దీనికి సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

19:49 August 05

టాప్​ న్యూస్​ @8PM

టాప్​ న్యూస్​ @8PM 

  • మంత్రి కేటీఆర్​ సమీక్ష

రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా పరిశ్రమల శాఖ కార్యాచరణను ముమ్మరం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడుల విజ్ఞప్తులు.. కంపెనీల విస్తరణ ప్రణాళికలు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

  • లగ్జరీ కార్ల పేరుతో బడా స్కాం

కార్లు కొనేందుకు బ్యాంకులు.. ఫైనాన్స్‌ సంస్థలు సులభంగా రుణం ఇస్తుండడంతో తెలివైన నిందితులు కొందరు బ్యాంకులకే కుచ్చుటోపీ వేస్తున్నారు. ఖరీదైన స్పోర్ట్స్ కార్లు ఫలానా డీలర్‌ వద్ద కొంటున్నామంటూ నకిలీ టీఆర్​నెంబర్, ఇన్వాయిస్‌ పత్రాలు సమర్పించి లక్షల్లో కొట్టేస్తున్నారు. నాలుగైదు వాయిదాలు చెల్లించి చేతులెత్తేస్తున్నారు. ఈ నయా మోసం వెనుక హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్ల డీలర్‌ ఉన్నాడని సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు.

  • అఖిలేశ్​ 'మిషన్​ యూపీ'

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము 400 స్థానాల్లో గెలుస్తామని సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా భాజపా ప్రభుత్వం.. పాత ప్రాజెక్టులకు పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ధరల పెరుగుదల, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన 'సైకిల్​ యాత్ర' చేపట్టారు.

  • చెక్కులు ఇచ్చే ముందు జరభద్రం

చెక్కుల జారీలో పారదర్శకతను, క్లియరెన్స్ వేగాన్ని పెంచేందుకు ఆర్​బీఐ ఇటీవల కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీనితో చెక్​లు జారీ చేసే ముందు పలు జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలు ఏమిటి? ఆర్​బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్​లో ఏముంది? అనే వివరాలు మీకోసం.

  • హాకీ ఇండియా- సక్సెస్​ స్టోరీ

టోక్యో ఒలింపిక్స్​లో అదరగొట్టిన భారత హాకీ జట్లు.. స్వర్ణ పతకం తీసుకురాకపోయినా కోట్లమంది హృదయాలు గెలిచాయి. అయితే ఇలాంటి ప్రదర్శన చేయడం వెనుక ఎవరి కృషి ఉందో తెలుసా?

18:39 August 05

టాప్​ న్యూస్​ @7PM

టాప్​ న్యూస్​ @7PM 

  • జోరుగా తాగేశారు.. 

తెలంగాణలో మందుబాబులు రెచ్చిపోయి తాగేశారు. జులై నెలలో రికార్డు స్థాయిలో భారీగా మద్యం అమ్ముడు పోయింది. ఏకంగా రూ.2,768 కోట్లు విలువైన మద్యాన్ని మందుబాబులు మంచినీళ్లలా తాగేశారు. ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ల ద్వారా మొత్తం విక్రయాల్లో 60 శాతం అంటే రూ.1,600 కోట్లుకు పైగా మొత్తం జులై నెలలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది.

  • భారత్​ కీలక నిర్ణయం 

లద్దాఖ్‌ వివాదానికి శాశ్వత పరిష్కారం వచ్చే వరకు సరిహద్దుల్లో సైన్యాన్ని కొనసాగించాలని భారత్‌ భావిస్తోంది. తరచూ ఇరుదేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు జరగుతున్నప్పటికీ బలగాల ఉపసంహరణలో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోవడం వల్ల భారత్‌ అసంతృప్తితో ఉంది. సరిహద్దుల్లో చైనా సైన్యం ఎంతకాలం ఉంటుందో అప్పటివరకు మన బలగాలను కూడా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

  • బోర్ కొట్టి రూ.2వేలు ఖర్చు చేస్తే.. రూ.7.5 కోట్ల జాక్​పాట్

విమానం రద్దు కావడం ఆ మహిళను కోటీశ్వరురాలిని చేసింది. ఆ సంగతి తెలిస్తే అదృష్టం అంటే ఇలా ఉండాలి అని అనుకుంటారు. ఇంతకీ విమానం రద్దుకు, ఆమె కోటీశ్వరురాలు అవడానికి సంబంధం ఏంటి?

  • దేశానికి గర్వకారణం

టోక్యో ఒలింపిక్స్​లో రజతం నెగ్గిన భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​​ కోవింద్ సహా పలువురు ప్రముఖులు ట్వీట్లు చేసి, మెచ్చుకున్నారు.

  • సినిమా కబుర్లు 

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో హీరోలు నాని, వరుణ్ తేజ్​, నితిన్​, అక్షయ్ ​కుమార్​, సోనూసూద్ సినిమా వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం.. ​

17:40 August 05

టాప్​ న్యూస్​ @6PM

టాప్​ న్యూస్​ @6PM 

  • సవరణ షెడ్యూల్​ ప్రకటన

2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్​ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరకు ముందస్తు కార్యక్రమాలు చేపట్టనుంది. ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణను చేపట్టనుంది.

  • భారత్​పై మరో కుట్ర 

జమ్ముకశ్మీర్​లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 140 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని సీనియర్​ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. అయితే.. వారు చొరబడకుండా సైన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసకుంటోందని చెప్పారు. భారత్​-పాక్​ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులకు సంబంధించిన మౌలిక వసతులు నిర్మాణాలు ఇంకా అలాగే ఉన్నాయని పేర్కొన్నారు.

  • తెరపైకి కొత్త ఉగ్ర సంస్థలు 

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని పలు నివేదికుల చెబుతున్నాయి. అయితే.. హిజ్బుల్​ ముజాహిద్దీన్​, లష్కరే తోయిబా, జైషే వంటి వాటి స్థానంలో కొత్త మిలిటెంట్​ గ్రూప్​లు వెలుగులోకి వచ్చాయి. అవి స్థానికంగా ఏర్పడినవేనని, పాక్​ హస్తం లేదని చూపేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  • కాంస్యం ఆశలు ఆవిరి

టోక్యో ఒలింపిక్స్​లోని 86 కిలోల ఫ్రీస్టైల్​ రెజ్లింగ్​ కాంస్య పతక పోరు భారత రెజ్లర్​ దీపక్​ పునియా పరాజయం చవిచూశాడు. శాన్​మెరినోకు చెందిన అమినీ మైల్స్ నాజెమ్​పై 4-2 తేడాతో ఓడి.. కాంస్య పతక అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 

  • గొడవ సర్దుబాటు

మెగా అల్లుడు చైతన్యపై న్యూసెన్స్ కేసు సద్దుమణిగింది. ఇరువర్గాల మధ్య రాజీ కుదరడం వల్ల, తమ ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నారు.

16:45 August 05

టాప్​ న్యూస్​ @5PM

టాప్​ న్యూస్​ @5PM 

  • భారత్​కు మరో పతకం

టోక్యో ఒలింపిక్స్​లో భారత రెజ్లర్​ రవికుమార్​ దహియా రజత పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. 57 కేజీల ఫ్రీస్టైల్​ రెజ్లింగ్​ ఫైనల్​లో జవూర్​(ఆర్​ఓసీ)పై ఓటమి పాలై.. సిల్వర్​ పతకంతో సరిపెట్టుకున్నాడు.  

  • భారీ మోసం 

బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై టెలికాం పరికరాల తయారీ సంస్థ వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ డైరెక్టర్ హిమబిందును ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్టియం నుంచి సుమారు రూ.1,700 కోట్ల రుణాలు తీసుకొని ఇతర అవసరాలకు మళ్లించి మోసం చేశారని అభియోగం. 

  • సరిహద్దుల రగడ!

అసోం, మిజోరం మధ్య కొద్ది రోజుల క్రితం సరిహద్దు వివాదం చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. తాజాగా సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాలకు ఏకతాటిపైకి వచ్చి.. చర్చలు చేపట్టాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన చేశాయి.

  • మళ్లీ రికార్డుల మోత

ఆరంభంలో నష్టాలను చవి చూసిన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex today) 123 పాయింట్ల లాభంతో తొలిసారి 54,450 పైన స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 25 పాయింట్ల లాభంతో 16,300 మార్క్​కు చేరువైంది.

  • వణికిస్తున్న డెల్టా!

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి మళ్లీ​ వణికిస్తోంది. డెల్టా వేరియంట్​ విజృంభణ నేపథ్యంలో పలు దేశాల్లో ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​లో ఆరోసారి లాక్​డౌన్ విధించారు. అమెరికాలో ప్రఖ్యాత 'ద న్యూయార్క్​ ఆటో షో'ను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. ఒలింపిక్స్​కు ఆతిథ్యమిస్తున్నజపాన్​ టోక్యో నగరంలోనూ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

15:50 August 05

టాప్​ న్యూస్​ @4PM

టాప్​ న్యూస్​ @4PM 

  • కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాశారు. సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరం తెలపడంపై ఈఎన్‌సీ నిరసన వ్యక్తం చేశారు. గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని ఈఎన్‌సీ అభిప్రాయపడ్డారు. 

  • వీఎంసీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అరెస్ట్​

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేశారనే అభియోగం నేపథ్యంలో వీఎంసీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ హిమబిందు అరెస్టయ్యారు. రుణాల పేరుతో రూ.1700 కోట్లు మోసం చేశారనే అభియోగం ఆమెపై నమోదైంది. 

  • విపక్షాలపై మోదీ విమర్శలు 

ఆర్టికల్​ 370 రద్దు చేసి రెండేళ్ల పూర్తయిన సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆగస్టు 5 చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఏడాది క్రితం ఇదే రోజున అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలి అడుగు పడిందన్నారు. ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన లబ్ధిదారులతో మాట్లాడారు. పార్లమెంట్​లో విపక్షాల ఆందోళనలపై విమర్శలు గుప్పించారు.

  • 'పెగసస్​ను ఆయుధంలా వినియోగిస్తున్నారు'

దేశ ప్రజలు.. నిజం మాట్లాడుకుండా ఉండేందుకు పెగసస్​ను ఓ ఆయుధంలా నరేంద్ర మోదీ ప్రభుత్వం వినియోగిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ అధికారంలో ఉన్నంత కాలం.. దేశ యువతకు ఉద్యోగాలు దొరకవని చెప్పారు.

  • మద్రాస్​ హైకోర్టు ఆగ్రహం

కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్​పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టం ముందు ప్రతిఒక్కరూ సమానులేనని చెప్పింది. ఇంతకీ ఏం జరిగిందంటే? ​

14:42 August 05

టాప్​ న్యూస్​ @3PM

టాప్​ న్యూస్​ @3PM 

  • ఉమ్మడి సమావేశం 

ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. హైదరాబాద్​లోని జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. గెజిట్‌లోని అంశాల అమలు కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. 

  • గణేశ్​ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ

హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యరహితంగా అందంగా ఉంచాలని.. పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని హైకోర్టు అభిప్రాయపడింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనం నిషేధించాలంటూ న్యాయవాది వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేపట్టింది.

  • పెన్నుతో గిన్నిస్​

విద్యార్థి దశలో ఉన్నప్పుడు చేతి వేళ్లతో సరదాగా పెన్ను తిప్పడం అందరికీ అలవాటే. అయితే ఈ సాధారణ అలవాటుతోనే గిన్నిస్​ రికార్డ్​ సృష్టించాడు కేరళకు చెందిన ఓ యువకుడు. బొటనవేలు చుట్టూ ఒక నిమిషంలో 108 సార్లు పెన్ను తిప్పి.. ఈ ఘనత సాధించాడు.

  • ప్రధాని మోదీ సర్​ప్రైజ్​

భారత హాకీ జట్టు సారథి మన్​ప్రీత్​ సింగ్, కోచ్ గ్రాహమ్​లను సర్​ప్రైజ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మ్యాచ్​ ముగిసిన వెంటనే వారికి ఫోన్​ చేసి స్వయంగా అభినందనలు తెలిపారు.

  • అలరించనున్న బన్నీ

'ఓ మై కాదవులే' రీమేక్​ చిత్రంలో అల్లు అర్జున్‌ కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మరో నటుడు విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా ఈ రీమేక్‌ రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది.

13:39 August 05

టాప్​టెన్​ న్యూస్​@2PM

1. కీలక పదవికి పీకే రాజీనామా

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రజాజీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొంత విరామం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు పీకే చెప్పారు. ఈ తాజా పరిణామాలు అనేక ఊహాగానాలకు తావిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకే పీకే రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

2.'ఘనమైన చరిత్ర రాసి.. గర్వకారణంగా నిలిచారు'

టోక్యో ఒలింపిక్స్​ క్వార్టర్స్​లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయంపై యావత్​ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. దశాబ్దాల కల నెరవేర్చారంటూ వారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ట్విట్టర్​ వేదికగా మంత్రి కేటీఆర్​ హాకీ జట్టుకు అభినందనలు తెలియజేశారు.

3. గోల్డ్​పై ఇన్వెస్ట్ చేస్తున్నారా?  

బంగారంపై పెట్టుబడి పెట్టాలంటే భౌతిక కొనుగోలు చేయొచ్చు. అంతే కాకుండా డిజిటల్ పద్ధతుల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ రెండింటిలో.. డిజిటల్​ పద్ధతే ఉత్తమమని నిపుణులు చెబుతుంటారెందుకు? ఇందుకు కారణాలు ఏంటి?

4. హాకీ పిచ్​పై నీళ్లు ఎందుకుంటాయి?

సాధారణంగా హాకీ(Field hockey) మ్యాచ్​ల్లో బంతిని క్రీడాకారుడు బ్యాట్​తో తోసిన తర్వాత నీటి కదలిక కనిపిస్తుంది. ఈ విషయాన్ని గమనిస్తే మ్యాచ్​ ఆడే సమయంలో పిచ్​పై నీళ్లు ఎందుకున్నాయనే డౌట్​ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే దానికి కారణమేంటో తెలుసుకుందాం.

5. క్లాసిక్‌ ప్రేమకథలో అల్లు అర్జున్‌, విశ్వక్‌సేన్‌!

13:02 August 05

టాప్​టెన్​ న్యూస్​@1PM

  • నగ్నంగా వాట్సాప్ వీడియోకాల్​...

ఓ విద్యార్థికి అపరిచత నంబర్​ నుంచి కాల్​ వచ్చింది. మాయమాటలతో ఆ విద్యార్థికి వల వేశారు. తర్వాత వాట్సాప్​ కాల్ చేశారు. అందులో యువతి తల కనిపించకుండా నగ్నంగా కనిపించింది. ఇంకేముంది నమ్మిన ఆ విద్యార్థి నగ్నంగా తయారై వీడియోకాల్‌లో కనిపించాడు. ఆ తర్వాత ఏమైందంటే..?

  • జగనన్న పచ్చతోరణం..

రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పెంపకాన్ని ఓ యజ్ఞంలా చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ప్రాంగణలో జగనన్న పచ్చతోరణం- వనమహోత్సవం-2021 కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 23శాతం అడవులు మాత్రమే ఉన్నాయని.. వాటిని 33 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు.

  • రూ.50 కోట్ల భారీ స్కామ్​

అహ్మదాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు.. రూ.50 కోట్లు భారీ మోసాన్ని బయటపెట్టారు. చైనీస్​ యాప్​ ద్వారా పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడిన ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి.. ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

  • అంబరాన్నంటిన సంబరాలు

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం సాధించడం ద్వారా 41 ఏళ్ల ఒలింపిక్స్​ పతక కలను నెరవేర్చింది భారత హాకీ జట్టు. దీంతో క్రీడాకారుల ఇంటి వద్ద ఆనందకరమైన వాతావరణం నెలకొంది.

  • ప్రైమ్​లో 'జై భీమ్'

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న 'జై భీమ్' ఓటీటీ రిలీజ్​ను ఖరారు చేసింది చిత్రబృందం. దీంతో పాటు సూర్య నిర్మిస్తోన్న మరో మూడు చిత్రాలూ ప్రైమ్​లోనే విడుదల కానున్నాయి.

12:04 August 05

టాప్​టెన్​ న్యూస్​@12PM

1. ఉపఎన్నిక కోసమే పథకాలు: ఈటల

భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్​ మరోసారి సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హుజూరాబాద్​ ఉపఎన్నిక కోసమే పథకాలు తెస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్ రాకముందే హామీలు నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.

2. జీవో ఎలా రాశారో న్యాయశాఖ చూడాలి కదా?

కోర్టు ధిక్కరణ కేసుల కోసం నిధుల కేటాయింపుపై సీఎస్ సోమేశ్​ కుమార్​.. హైకోర్టుకు వివరణ ఇచ్చారు. రూ.58 కోట్లు తనపై కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని సీఎస్​ స్పష్టం చేశారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని సీఎస్ ఆరోపించారు. వాస్తవాలు కోర్టు ముందుంచలేకపోయామన్న సీఎస్​.. నిధులు విడుదల చేయవద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని ధర్మాసనాన్ని కోరారు. కేటాయించిన నిధులు కోర్టు ధిక్కరణ కేసుల్లో భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమని స్పష్టం చేసిన ఏజీ ప్రసాద్​.. పిల్​పై అత్యవసర విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.  

3. పెగసస్​పై ఆగని ఆందోళన - సభలు వాయిదా

పెగసస్​, వ్యవసాయ చట్టాలపై విపక్షాలు పట్టుబట్టడం వల్ల రాజ్యసభ, లోక్​సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్​సభ మధ్యాహ్నం 12 గంటల వరకు, రాజ్యసభ ఉదయం 11.30 గంటల వరకు వాయిదా పడ్డాయి.  

4. 'పెగసస్​' చాలా తీవ్రమైన అంశం'

దేశంలో రాజకీయ దుమారానికి కారణమైన పెగసస్​ నిఘా వ్యవహారంపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులపై నిఘా పెట్టడానికి పెగసస్​ను ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

5. 'మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం'..

ఎన్నాళ్లో వేచిన హృదయాలకు ఒక చల్లని కబురు ఇది.. ఎన్నేళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది.. ఇక పునర్వైభవమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తరుణమిది.. పతకాల కరవు తీరుస్తూ హాకీ ఇండియా అద్భుతం చేసింది. జర్మనీతో జరిగిన పోరులో తిరుగులేని విజయం సాధించింది. అఖండ భారతావనిని మురిపించింది. టోక్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది. 

 

10:53 August 05

టాప్​టెన్​ న్యూస్​@11AM

1. దేశంలో మరో 42,982 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు(Coronavirus India) బుధవారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 42,982 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 533 మంది మరణించారు. తాజాగా 41,726 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

2. వాష్​రూంకు వెళ్లొచ్చేలోపు బ్యాగు చోరీ

ఓ వ్యక్తి వెయిటింగ్‌ హాల్‌లో బ్యాగును ఉంచి వాష్​రూంకు వెళ్లాడు... అతను తిరిగొచ్చేలోపు దుస్తులు.. బ్యాగు చోరీకి గురైంది. ఒంటిపై టవల్‌తో మాత్రమే ఉన్న అతడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక టవల్​తోనే... పోలీసు స్టేషన్​కు పరిగెత్తాడు. అసలు ఆ దొంగ అలా ఎందుకు చేశాడంటే..?

3. వరదల్లో చిక్కుకున్న హోంమంత్రి

వరదల్లో ముంపునకు గురైన గ్రామాలను పరిశీలించేందుకు వెళ్లిన హోంమంత్రి.. వరదల్లోనే చిక్కుకున్నారు. భారత వైమానిక దళం చాపర్​ సాయంతో హోమంత్రిని రక్షించారు సహాయ సిబ్బంది. మరో ఏడుగురు గ్రామస్థులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

4. పాక్​లో మరో ఆలయంపై దాడి

పాకిస్థాన్​లో హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా పంజాబ్​ రాష్ట్రం రహీమ్​ యార్​ ఖాన్​ జిల్లాలోని ఓ ఆలయంపై దాడి జరిగింది. ముస్లిం మూకలు ఆలయంలోకి చొరబడి నిప్పు పెట్టి, విగ్రహాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రేంజర్స్​ని మోహరించినట్లు చెప్పారు.

5. వినేశ్, అన్షు మాలిక్ ఓటమి

టోక్యో ఒలింపిక్స్​ క్వార్టర్​ ఫైనల్లో ఓటమి చవిచూసింది స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్. అయితే అప్పుడే ఆమె పోరు ముగిసిపోలేదు. కాంస్యం కోసం పోరాడేందుకు ఆమెకు మరో అవకాశం లభించే వీలుంది. అలాగే మరో రెజ్లర్ అన్షు మాలిక్ కూడా పరాజయం చెందింది.

09:56 August 05

టాప్​టెన్​ న్యూస్​@10AM

1. తీరిన 41 ఏళ్ల భారత్​ కల..

అఖండ భారతావని మురిసిపోయింది. అశేష ప్రజానీకం ఉప్పొంగి పోయింది. 130+కోట్ల భారతీయుల హృదయాలు పులకించిపోయాయి. సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. టోక్యో నడిబొడ్డున త్రివర్ణ పతకాం రెపరెలాడింది. చక్‌దే ఇండియా నినాదాలు మార్మోగాయి.. ఇక హాకీ ఇండియాకు పునర్వైభవం రానుంది. 4 దశాబ్దాల తర్వాత స్వర్ణోదయానికి అడుగులు పడ్డాయి. ఎన్నాళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది. ఎన్నేళ్లో వేచిన హృదయాలకు తీపి కబురు ఇది. ఒలింపిక్స్‌లో పతకాల కరవు తీరుస్తూ 'మన్‌'ప్రీత్‌ సేన ఆవిష్కరించిన మహాద్భుతం ఇది..

2. నిహారిక ఇంటి వద్ద అర్ధరాత్రి గొడవ

ఇటీవలే పెళ్లి చేసుకున్న నిహారిక దంపతులకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది​. అర్థరాత్రి సమయంలో నిహారిక ఇంటి వద్ద పెద్ద గొడవ జరిగిందట. బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఆయనపై కేసు కూడా నమోదైందని సమాచారం. సోషల్ మీడియాల్లో ఈ వార్త వైరల్​ అవుతోంది.

3. బంగారం, వెండి ధరలు ఇలా..

బంగారం ధరలు(Gold price today) గురువారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వెండి ధర రూ.70వేల దిగువకు చేరింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి.

4. పల్లెల్లో ఆన్‌లైన్‌ పాఠాలకు ఇక్కట్లు

ఉదయం పది గంటలయ్యే సరికి ఆ ఊరి బయట ఉన్న చెట్టు అంతా సెల్‌ సిగ్నల్స్‌ కోసం వచ్చే చిన్నారులతో నిండిపోతోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లిలో ఇది నిత్యకృత్యంగా మారింది. ఈ మండలంలోని పద్మన్నపల్లి, ఎంసీతండా, చెన్నంపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులదీ ఇదే అవస్థ.

5. ఒకే ఒక్క వాట్సాప్‌ మెసేజ్‌

వాట్సాప్​లో వచ్చిన ఆ ఒక్క మెసేజ్​.. అతని జీవితాన్నే మార్చేసింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. అసలు ఆ మెసేజ్ ఏంటీ? డబ్బులు ఎలా పోయాయి. అతనేం చేశాడు.. ఓసారి ఈ కథనం చదివి తెలుసుకుందాం.

08:43 August 05

టాప్​టెన్​ న్యూస్​@9AM

1. ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

ఒలింపిక్స్‌లో భారత్‌  మరో పతకం కైవసం చేసుకుంది. పురుషుల హాకీలో కాంస్య పతకాన్ని భారత్‌ సాధించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీకి పతకం వచ్చింది. మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత హాకీకి ఇదే తొలి పతకం. 1980 ఒలింపిక్స్‌లో భారత్​ స్వర్ణం సాధించింది. 12 పతకాలతో ఒలింపిక్‌ హాకీలో ఇప్పటికే అగ్రస్థానంలో భారత్‌ నిలిచింది. 

2. ఆయుష్షు తీరిందని ఆత్మహత్య

భర్తతో గొడవ జరిగింది.. ఇక బతకొద్దని నిర్ణయించుకుంది. ఈలోపు దేవుడికి పూజ చేద్దామనుకుంది. దేవుడికి హారతిద్దామనుకుంటే.. అది ఆరిపోయింది. కుంకుమ భరణి చేజారింది. ఇవన్నీ అపశకునాలేనని భావించింది. ఇంకేముంది.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

3. వేధిస్తోన్న యూరియా  కొరత

రాష్ట్రంలో మెల్లమెల్లగా యూరియా కొరత పెరుగుతోంది. ఈ సీజన్‌ మొత్తానికి అంటే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 10.50 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. దీనిని నెలవారీగా కొంత చొప్పున సరఫరా చేస్తారు. ఇప్పటివరకూ రాష్ట్రానికి మొత్తం 9.10 లక్షల టన్నులు రావాలి. కేవలం 4.25 లక్షలే వచ్చింది. ఇంకా 4.85 లక్షలు రాలేదు.

4. సైనిక రవాణాలో చైనా మరో ముందడుగు

సైనిక రవాణాను అత్యంత వేగిరం చేసే దిశగా చైనా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవలె ప్రారంభించిన హైస్పీడ్​ రైలులో తొలిసారిగా తమ సైనికులను భారత సరిహద్దు ప్రాంతాలకు తరలించింది. ఈ మేరకు ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ బుధవారం వెల్లడించింది.

5. సింధుకు కాబోయేవాడు అలా ఉండాలట!

తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పేసింది భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు. మంచి వాడై, తనను అర్థం చేసుకుంటే చాలని తెలిపింది. తన వ్యక్తిగత జీవితం గురించి ఇంకా బోలెడన్ని విశేషాలను పంచుకుందీ ఒలింపిక్ విజేత.

07:49 August 05

టాప్​టెన్​ న్యూస్​@8AM

1. THIRD WAVE: 'ఆగస్టు నుంచి రోజుకు గరిష్ఠంగా 1.40 లక్షల కేసులు రావచ్చు'

దేశంలో కరోనా మూడో దశ ప్రభావం ఉంటుందని, అది ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు కొనసాగుతుందని ఐఐటీ హైదరాబాద్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెంట్‌, ఎలక్ట్రానిక్‌ విభాగాల ప్రొఫెసర్‌ ఎం.విద్యాసాగర్‌ తెలిపారు. ఈ దశలో వైరస్‌ తీవ్రంగా ఉంటే గరిష్ఠంగా రోజుకు 1.40 లక్షల కేసులు రావచ్చన్నది తమ అంచనా అని పేర్కొన్నారు.

2. 'లా చేస్తున్నావ్‌.. పెళ్లొద్దా అనేవాళ్లు'

తాను డిగ్రీ చేసేటప్పుడు.. 'ఎందుకు లా చదువుతున్నావు? పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా? అని అడిగేవారు' అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. ఏ ఉద్యోగం రాకే న్యాయశాస్త్రాన్ని ఎంచుకున్నట్లు భావించేవాళ్లని పేర్కొన్నారు. 'సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ లా ఫర్మ్స్‌ కాఫీ టేబుల్‌' బుక్‌ విడుదల కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

3. రెక్కలు తెగిన పర్యటకం-ఆదుకుంటేనే జవజీవాలు

లాక్‌డౌన్‌ సమయంలో పర్యటక రంగం గణనీయంగా నష్టపోయింది. రెండో దశ విజృంభణతో మరింత కష్టాల్లో పడింది. ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకు బండిని లాగేవారందరికీ తీవ్ర నష్టం వాటిల్లింది. వరసగా రెండేళ్లు ఈ తరహా పరిస్థితులను ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమేనని, తమ బతుకులు మరింత భారంగా మారాయని వాపోతున్నారు. కనీస అవసరాల్ని తీర్చుకోవడానికి సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు.

4. అమెరికాలో భారీగా కేసులు- టీకా ఉత్పత్తికి 'క్వాడ్'​ సన్నాహాలు

అమెరికాలో కొవిడ్​ కేసులు అమాంతం పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. బ్రెజిల్​లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీకా ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాయి క్వాడ్ దేశాలు. మరోవైపు.. భారత్​ను రెడ్​ లిస్ట్​ నుంచి తొలగించనున్నట్లు బ్రిటన్​ ప్రకటించింది.

5. Ippudukaka Inkeppudu: అశ్లీలం కాదు ఎరోటిక్‌ సీన్స్‌ మాత్రమే!

యుగంధర్‌ దర్శకత్వంలో తొలి ప్రయత్నంగా తెరకెక్కిన చిత్రం 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు'. హస్వంత్ వంగ, నమ్రతా దరేకర్, వశిష్ట చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీ కోసం..

06:51 August 05

టాప్​టెన్​ న్యూస్​@7AM

1. కీలకాంశాలపై బోర్డుల అత్యవసర భేటీ

కీలకాంశాలపై నదీ యాజమాన్య బోర్డుల అత్యవసర సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ నెల తొమ్మిదిన గోదావరి బోర్డు అత్యవసర పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణా బోర్డు సమావేశం ఎప్పుడన్నది గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

2. మూడో ముప్పును ఎదుర్కొందాం!

రెండోదశ తీవ్రతను గట్టిగానే చవిచూసినప్పటికీ తేరుకోకపోవడం సామూహిక నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనపడుతోంది. సరికొత్త వ్యూహాల అమలులో ప్రభుత్వ అప్రమత్తత లేమి ప్రజారోగ్యాన్ని గాలిలో పెడుతోంది. రోజురోజుకీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో స్వీయ ఆంక్షలతోనే కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రజలపైనా ఉంది.

3. నికర లాభంలో రాణించిన ఎస్‌బీఐ

దేశీయ బ్యాకింగ్ దిగ్గజం నికర లాభంలో 55% వృద్ధిని కనబర్చింది. మొండి బాకీలు తగ్గడమే ఇందుకు కారణమని తన నివేదికలో తెలిపింది. 2008 తర్వాత అత్యధిక త్రైమాసిక లాభం ఇదేనని పేర్కొంది.

4. సచిన్​కు కోహ్లీ ఫోన్.. ఎందుకంటే?

గతంలో ఇంగ్లాండ్​ పర్యటన గురించి కెప్టెన్ కోహ్లీ మాట్లాడాడు. పరుగుల చేయలేకపోయిన ఆ సిరీస్ తర్వాత సచిన్​ సలహాలు తీసుకుని గాడిలో పడినట్లు వెల్లడించాడు. పరుగులు చేయకపోవడం వల్ల కొంతకాలం అంతా శూన్యంలా అనిపించిందని చెప్పాడు.

5. 'క్లాప్ బోర్డు కిందపెట్టినందుకు కొట్టారు'

ఎన్నో మంచి సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్న రేలంగి నరసింహారావు.. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోలో సందడి చేశారు. తన పాత జ్ఞాపకాలను ఆద్యంతం నవ్వుతూ వెల్లడించారు.

05:18 August 05

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

 తప్పుకున్న సీజేఐ ఎన్వీ రమణ

కృష్ణా జలాల వివాదం మరో ధర్మాసనానికి బదిలీ అయింది. పిటిషన్‌లో మధ్యవర్తిత్వానికి ఆంధ్రప్రదేశ్‌ విముఖత చూపింది. దాంతో ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తప్పుకొన్నారు.

ఆ సబ్జెక్ట్​పైనే విద్యార్థుల ఆసక్తి

దోస్త్ ద్వారా డిగ్రీలో చేరేందుకు మొదటి విడత సీట్లను అధికారులు కేటాయించారు. ఈసారి అబ్బాయిలకన్నా అమ్మాయిలే ఎక్కువగా ఆసక్తి చూపారు. అబ్బాయిలకు 89వేల 109 సీట్లు.. అబ్బాయిలకు 78 వేల 21 సీట్లు దక్కాయి. ఈ ఏడాది కూడా ఎక్కువ మంది విద్యార్థులు కామర్స్​లో చేరేందుకే ఆసక్తి కనబరిచారు. 

సింగరేణి రికార్డు లాభాలు

సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో అద్భుత వృద్దిని సాధించింది. కరోనా పరిస్థితులను అధిగమించి 8,180 కోట్ల టర్నోవర్‌ సాధించి రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పొలిస్తే 72 శాతం అధికమని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ వివరించారు.  

'వాసాలమర్రిలో దళితబంధు'

ప్రభుత్వాలు పథకాలు తెచ్చినా... వాటిపై ప్రజల్లో అవగాహన కొరవడిందని సీఎం కేసీఆర్​ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో సీఎం కేసీఆర్​ పర్యటించారు. వాసాలమర్రిలోని 76 ఎస్సీ కుటుంబాలకు రేపట్నుంచి దళితబంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

శరవేగంగా నిర్మాణం

2023 డిసెంబరు నాటికి అయోధ్య రామ మందిరానికి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. అలాగే 2025నాటికి మందిరం నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించాయి. మందిర ప్రాంగణంలో మ్యూజియంతో పాటు.. పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు నిర్వాహకులు.

'మాతృభాషలో బోధనతోనే రాణింపు'

పరాయి భాషల్లో కన్నా మాతృభాషలో బోధన వల్ల బాలల్లో సొంత వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఇనుమడించి సర్వతోముఖ వికాసానికి తోడ్పడతాయని యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు ధ్రువీకరించాయి. అయినప్పటికీ చాలామంది తల్లిదండ్రులు, కొందరు విద్యావేత్తలు ఆంగ్లంలో బోధనను ఇప్పటికీ పట్టుకువేళ్లాడుతూ పాఠశాలల్లో మాతృభాషను రెండో, మూడో భాష స్థాయికి దిగజారుస్తున్నారు. 

 డ్రోన్ కలకలం

దేశరాజధానిలోని ఎర్రకోట వద్ద అనుమానితంగా ఎగురుతున్న డ్రోన్​ను స్వాధీనం చేసుకన్నారు పోలీసులు. ఈ ప్రాంతంలో అనుమతి లేనప్పటికీ దీనిని ఉపయోగించినట్లు గుర్తింంచారు.

 

రూ.680 కోట్ల మాదకద్రవ్యాలు

భారత్-నేపాల్ సరిహద్దు గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మందుల రవాణాను పోలీసులు ఛేదించారు. ఘటనా స్థలం నుంచి రూ.680 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 

రవి ఫైనల్​ పోరు.. కాంస్యం కోసం హాకీ జట్టు

పసిడి గెలుస్తుందనుకున్న భారత పురుషుల హాకీ జట్టు ఆశలకు గండి పడింది. ఇప్పడు కనీసం కాంస్యమైన దక్కించుకుంటారో లేదో చూడాలి. గురువారం బెల్జియంతో తలపడనుంది మన్​ప్రీత్​ సేన. రెజ్లింగ్​లో స్వర్ణ పోరుకు రవి దాహియా సిద్ధమయ్యాడు. మొత్తంగా భారత అథ్లెట్లు 14వ రోజు ఆడనున్న మ్యాచ్​ల షెడ్యూల్ ఇదే..

 

తొలిరోజు మనదే పైచేయి

భారత్​-ఇంగ్లాండ్​ తొలి టెస్టులో తొలిరోజు తొలి ఇన్నింగ్స్​ను వికెట్లు నష్టపోకుండా ముగించింది. ఆట ముగిసే సమయానికి కోహ్లీ​సేన 21 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Last Updated : Aug 5, 2021, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details