.రేపటి నుంచే సెరో సర్వే రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి మరోమారు సెరో సర్వే జరగనుంది. ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్, రాష్ట్ర ప్రభుత్వం సయుక్తంగా సెరో సర్వే చేపట్టనుంది. ప్రతి జిల్లాలోని 10 గ్రామాల్లో సెరో సర్వే నిర్వహించనుంది. కోడలిని హత్య చేసిన మామమంచిర్యాల జిల్లాలో కోడలి గొంతు కోసి మామ హత్య చేశాడు. కోటపల్లి మండలం లింగన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీకు నిబంధనలు వర్తించవా? BJP Leaders on Bandi Sanjay Arrest: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం, అరెస్ట్‌పై భాజపా నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత రాజ్యాంగం రాసుకున్నారని విమర్శించారు. జీవో 317పై ఉద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని భాజపా నేతలు స్పష్టం చేశారు. నగరపాలక సంస్థగా అమరావతి.!Amaravathi Capital City: ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిని.. మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలోని 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా మార్చనున్నట్లు ప్రకటించింది.సీఎంను కలిసేందుకు వస్తే.. Janta Darbar Covid: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే జనతా దర్బార్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన 14 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇందులో ముగ్గురు కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు.'81% కేసులు అవే'Omicron effect in India: దేశంలో ఒమిక్రాన్ అలజడి కొనసాగుతోంది. దిల్లీలో.. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 81శాతం ఒమిక్రాన్ బాధితులో ఉన్నట్టు తేలింది. కేసులు పెరుగుతున్న క్రమంలో.. తాజా పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు దిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.జల్లికట్టు పోటీలు- చావుబతుకుల్లో మహిళ!Woman hit by bull: తమిళనాడులో తిరువన్నమలై జిల్లాలో నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు జల్లికట్టు పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఎద్దు రంకెలేసుకుంటూ.. ఓ ద్విచక్రవాహనంపైకి దీసుకెళ్లింది. బైక్ వెనక కూర్చున్న మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. సెన్సెక్స్ 929 ప్లస్Stock Market Closing: అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 929 పాయింట్ల వృద్ధితో 59వేల 183వద్ద స్థిరపడింది. నిప్టీ 271 పాయింట్ల లాభంతో 17వేల 625 వద్దకు చేరింది.స్టార్ హీరోను కాపాడిన 'బోల్ట్'!Vicky Kaushal bike number: నకిలీ నెంబర్ ప్లేట్ కేసులో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు ఇండోర్ పోలీసులు. షూటింగ్లో వాడిన బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ సరైనదేనని, 'లుకా చుప్పీ 2' సినిమా నిర్మాణ సంస్థ ఎలాంటి చట్ట ఉల్లంఘనకు పాల్పడలేదని చెప్పారు.రహానే తొలిసారి అలా!IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ అజింక్యా రహానే చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు.