తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @7PM - ts top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/14-July-2022/15648257_7pm.jpg

By

Published : Jul 14, 2022, 6:59 PM IST

  • వారధి చరిత్రలోనే రెండోసారి

భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతం అతలాకుతలమమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చిన వరదపోటు భద్రాద్రిలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది.

  • ' 19,071 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు'

వరద సహాయ, పునరావాస చర్యలపై సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు.

  • సీఐని కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్

CI Nageshwar Rao Case Update: సీఐ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ తెలిపారు. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించినట్టు స్పష్టం చేసిన సీపీ.. నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్​ దాఖలు చేసినట్టు తెలిపారు.

  • కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉద్ధృతి.. ఆ ప్రాంతాల్లో రెడ్​ అలర్ట్​

Kaleshwaram water flow: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో కాళేశ్వరంలో జలకళను సంతరించుకుంది. కాళేశ్వరం ఘాట్ వద్దకు ఎవరూ రాకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 15.900 మీటర్ల భారీ ప్రవాహం కొనసాగుతోంది.

  • కాలనీల్లో పులి సంచారం.. ఇళ్లలోకి మొసళ్లు

భారీ వర్షాలతో గుజరాత్​ వడోదరాలోని విశ్వామిత్రీ నది ఉప్పొంగి.. వరద నీరు ఇళ్లలోకి వస్తోంది. దీంతో.. మొసళ్లు కూడా కొట్టుకొస్తున్నాయి. జనం భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ అధికారులు వచ్చి వాటిని బంధించారు.

  • 'మట్టి'తో 750కి.మీ పాదయాత్ర

బంగాల్​ విభజనకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని జల్పాయ్​గుడి జిల్లాకు చెందిన శంకర్ భట్టాచార్య.. 750 కి.మీ పాదయాత్ర చేపట్టారు. 28 రోజుల తర్వాత బుధవారం కాళీఘాట్‌ చేరుకున్న ఆయన.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవాలని అనుకుంటున్నారు. తనతో తీసుకొచ్చిన మట్టిని ఇచ్చి.. రాష్ట్ర విభజన చేయొద్దని కోరనున్నారు.

  • జైలుకు పాప్​ సింగర్​ దలేర్ మెహందీ.!

Daler Mehandi:ప్రముఖ పాప్​ సింగర్​ దలేర్​ మెహందీకి మానవ అక్రమ రవాణా కేసులో 2018లో విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ తీర్పునిచ్చింది పటియాలా కోర్టు. వెంటనే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

  • మాల్దీవుల నుంచి సింగపూర్​కు రాజపక్స.!

Gotabaya Rajapaksa Singapore: రాజకీయంగా, ఆర్థికంగా పెను సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక అట్టుడుకుతోంది. మాల్దీవుల నుంచి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సింగపూర్​కు చేరుకున్నారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం కూడా అధికారికంగా వెల్లడించింది.

  • జబర్దస్త్ ఫైమా సొంతింటి కల సాకారం.. రింగు తొడిగి ప్రవీణ్ ప్రపోజల్!

Faima praveen: జబర్దస్త్​, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో అలరించే ఫైమా తన సొంతింటి కలను నెరవేర్చుకుందట. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ఎపిసోడ్​లో ఈ విషయం చెబుతూ.. ప్రవీణ్​ ఆమెకు రింగు తొడిగి ప్రపోజ్​ చేశాడు. ఫైమా అంటే ఎందుకు ఇష్టమో, ఆమెను ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పాడు.

  • మరో బిడ్డకు తండ్రైన ఊతప్ప

టీమ్​ఇండియా బ్యాటర్‌ రాబిన్‌ ఊతప్ప మరో బిడ్డకు తండ్రయ్యాడు. ఊతప్ప సతీమణి శీతల్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details