తెలంగాణ

telangana

ETV Bharat / city

Top News: టాప్‌ న్యూస్ @9PM - TELANGANA TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS

By

Published : Aug 4, 2022, 8:58 PM IST

  • భారతదేశ వ్యవస్థకే తెలంగాణ పోలీసు ఒక కలికితురాయి: సీఎం కేసీఆర్

దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం రూపకర్త డీజీపీ మహేందర్​రెడ్డి అని తెలిపారు. భారతదేశ వ్యవస్థకే తెలంగాణ పోలీసు ఒక కలికితురాయి అని తెలిపారు.

  • ఈ నెల 12న హైదరాబాద్​కు తరుణ్​ చుగ్​..

రాష్ట్రంలో తాజా రాజకీయాలపై సమీక్ష నిర్వహించేందుకు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌ చుగ్‌ ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర , మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర నాయకత్వంతో చర్చించనున్నారు.

  • నిండుకుండలా శ్రీశైలం..

ఎగువ నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ఒక గేటును పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులుగా ఉంది.

  • కొత్త పోస్టుల్లో రిపోర్టు చేయని వీఆర్వోలపై ప్రభుత్వం చర్యలు!!

వీఆర్వోల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. 5,137 మందిలో ఇప్పటి వరకు 5,014 మంది కొత్త పోస్టుల్లో చేరినట్లు సమాచారం వచ్చింది. 19 మంది విషయంలో మాత్రం యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 19 మందిలోనూ 15 మంది కొత్త పోస్టుల్లో చేరినట్లు సమాచారం. వీఆర్వోలను ఎట్టి పరిస్థితుల్లోనూ రెవెన్యూశాఖలో కొనసాగించేది లేదని ప్రభుత్వం చెబుతోంది.

  • 'మోదీకి, ఈడీకి భయపడను'.. కేంద్రంపై రాహుల్ ఫైర్​.. ఖర్గేకు సమన్లు

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మోదీకి, ఈడీకి తాను భయపడబోనని అన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేసింది.

  • ట్రాక్టర్​ నడిపిన యువతి.. ఊరి నుంచి బహిష్కరించిన గ్రామస్థులు

ఓ యువతి ట్రాక్టర్​ నడుపుతూ వ్యవసాయం చేస్తుందని.. దీని వల్ల గ్రామానికి చెడు జరుగుతుందని నమ్మిన గ్రామస్థులు.. ఆమెను బహిష్కరించారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని గుమ్లాలో జరిగింది.

  • బైక్​ వెనుక సీట్​పై మగవాళ్లు కూర్చోవడం నిషిద్ధం.. పోలీసుల కొత్త రూల్!

ద్విచక్ర వాహనం వెనుక సీటుపై పురుషులు ప్రయాణించడాన్ని నిషేధించారు కర్ణాటకలోని మంగళూరు పోలీసులు. ఆగస్టు 8 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

  • మేనత్త కుటుంబాన్ని పరామర్శించిన జూనియర్​ ఎన్టీఆర్​

మూడు రోజుల క్రితం మరణించిన తన మేనత్త ఉమామహేశ్వరి కుటుంబాన్ని జూనియర్​ ఎన్టీఆర్​ పరామర్శించారు. సతీసమేతంగా వెళ్లి.. మేనత్త కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

  • టీమ్​ఇండియా నయా 'స్వింగ్ క్వీన్'..

కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న భారత మహిళల క్రికెట్​ జట్టు బౌలర్​ రేణుకా సింగ్ ఠాకూర్.. తన సూపర్ ఫామ్​తో ఆకట్టుకుంటోంది. హిమాచల్‌ ప్రదేశ్​కు చెందిన ఈ ప్లేయర్ టీమ్​ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యర్థి బ్యాటర్లకు అర్థంకాని పజిల్‌‌గా మారి, వికెట్లను తన ఖాతాలో వేసుకుంటుంది.

  • చైనా దూకుడు.. తైవాన్ లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం

తైవాన్​లోని ఈశాన్య, నైరుతి ప్రాంత జలాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ డాంగ్​ఫెంగ్​ బాలిస్టిక్​ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని తైవాన్​ రక్షణశాఖ సైతం ధ్రువీకరించింది.

ABOUT THE AUTHOR

...view details