తెలంగాణ

telangana

ETV Bharat / city

Top News: టాప్‌ న్యూస్ @5PM - 5PM టాప్‌ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Aug 4, 2022, 5:01 PM IST

  • కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్​ బై..

కాంగ్రెస్‌కు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అధికారికంగా రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు రాజీనామా లేఖను పంపారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు.

  • భారతదేశ వ్యవస్థకే తెలంగాణ పోలీసు ఒక కలికితురాయి: సీఎం కేసీఆర్

దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం రూపకర్త డీజీపీ మహేందర్​రెడ్డి అని తెలిపారు. భారతదేశ వ్యవస్థకే తెలంగాణ పోలీసు ఒక కలికితురాయి అని తెలిపారు.

  • హైదరాబాద్​లో ఒక్కసారిగా దంచికొట్టిన వాన..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసిముద్దయ్యారు. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

  • మునుగోడుపై ప్రధానపార్టీల ఫోకస్​..

కాంగ్రెస్‌ పార్టీకి, మునుగోడు శాసనసభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనతో.... ప్రధాన పార్టీలు కార్యాచరణను వేగవంతంచేశాయి. మునుగోడు నియోజకవర్గంలోని మండలాల్లో క్షేత్రస్థాయిలో తెరాస, కాంగ్రెస్‌లు తమ బలాబలాలు అంచనా వేసుకుంటున్నాయి. కార్యకర్తలను కలుస్తున్నరాజగోపాల్‌రెడ్డి.. ఉపఎన్నికకు దారితీసిన కారణాలను వివరిస్తున్నారు.

  • శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా ఈ-సిగరెట్లు

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిత్యం కట్టుదిట్టంగా తనిఖీలు చేపడుతున్నా స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి విదేశాల నుంచి భారీ స్థాయిలో తరలిస్తున్న ఈ-సిగరెట్లు, సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  • 'మోదీకి, ఈడీకి భయపడను'..

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మోదీకి, ఈడీకి తాను భయపడబోనని అన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేసింది.

  • రూ.1400 కోట్ల 'మ్యావ్ మ్యావ్' డ్రగ్స్ సీజ్..

అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ముంబయి యాంటీ నార్కోటిక్ సెల్ అధికారులు అరెస్టు చేశారు. రూ.1400 కోట్లు విలువైన మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు, కేరళలో 8వేల జిలెటిన్ స్టిక్స్ దొరకడం కలకలం రేపింది.

  • యుద్ధం vs ప్రేమ : హిస్టారిక్​ టచ్​తో రెండు అదిరే మూవీస్​.. విజేత ఎవరో?

హీరో నందమూరి కల్యాణ్​రామ్​ నటించిన సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార'.​ తొలిసారి ఆ జోనర్​లో కల్యాణ్​రామ్​ నటించిన ఈ సినిమా శుక్రవారం ధియేటర్లలోకి రానుంది. మరోవైపు మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్​ నటించిన సీతారామం కూడా రేపే రిలీజ్​ కానుంది. వీటితో పాటు ఓటీటీలోకి కొన్ని సినిమాలు రానున్నాయి.

  • 'మరో పది రోజుల్లో ప్రాబ్లమ్స్ క్లియర్​​.. కాస్త వెయిట్​ చేయండి!'

కరోనా తర్వాత నిర్మాతలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు షూటింగ్స్​ను నిలిపివేసినట్లు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ స్పష్టం చేశారు. మరో పది రోజుల్లో సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని, నిర్మాతలెవరూ బయట జరిగే ప్రచారాన్ని నమ్మ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • అంతరిక్షంలో అద్భుతం 'కార్ట్​వీల్​ గెలాక్సీ'..

విశ్వం లోగుట్టును తెలుసుకునేందుకు నాసా పంపిన జేమ్స్‌వెబ్ స్పేస్ టెలిస్కోప్​ అంతరిక్ష అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అలా పరిచయం చేసిన మరో అద్భుతమే కార్ట్‌వీల్ గెలాక్సీ. భూమికి ఐదువందల కాంతి సంవత్సరాల దూరంలో గిరగిరా తిరుగుతూ ఉన్నట్లుగా ఉండే ఈ గెలాక్సీ ఫోటోలను జేమ్స్‌ వెబ్ అద్భుతంగా చిత్రీకరించింది.

ABOUT THE AUTHOR

...view details