తెలంగాణ

telangana

ETV Bharat / city

Top News: టాప్‌ న్యూస్ @9PM - టాప్‌ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top News: టాప్‌ న్యూస్ @9PM
Top News: టాప్‌ న్యూస్ @9PM

By

Published : Aug 2, 2022, 9:01 PM IST

  • రాజగోపాల్​రెడ్డి రాజీనామా..

రాష్ట్రంలో చాలా రోజులుగా నడుస్తోన్న మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా ఎపిసోడ్​కు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. ప్రజల కోసమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపిన రాజగోపాల్‌రెడ్డి.. అవమానాలు భరిస్తూ ఉండలేనన్నారు.

  • భారత్​ ఖాతాలో మరో గోల్డ్​..

బర్మింగ్​హామ్​ వేదికగా జరుగుతున్న కామన్​వెల్త్​ గేమ్స్​లో భారత్​ అదరగొడుతోంది. ఆటల ఐదో రోజు(మంగళవారం) జోరు మీద ఉంది. ఇప్పటికే ఇవాళ రెండు స్వర్ణాలు భారత్​ ఖాతాలో చేరాయి. భారత పురుషుల టేబుల్​ టెన్నిస్​ టీం పసిడితో మెరిసింది. సింగపూర్​పై 3-1 తేడాతో గెలుపొందింది. దీంతో.. భారత్​ ఖాతాలో ఐదో గోల్డ్​ చేరింది.

  • కేసీఆర్​ను గద్దె దించాలి..

BANDI SANJAY: తెలంగాణలో రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రతి కార్యకర్త ఉగ్ర నరసింహుడి అవతారమెత్తాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పిలుపునిచ్చారు. బుక్కెడు బువ్వ కోసం విద్యార్థులు రోడ్డెక్కితే పట్టించుకోలేని ముఖ్యమంత్రి.. దేశ రాజకీయాలంటూ బయలుదేరారని విమర్శించారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవంలో కేసీఆర్​ సర్కార్​పై నిప్పులు చెరిగిన ఆయన.. హామీలతో మభ్యపెట్టి, రాష్ట్రంలో అన్ని వర్గాలను నిండా ముంచారని ధ్వజమెత్తారు.

  • భారీగా పెరిగిన కరోనా కేసులు..

రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోమారు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 1000కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,054 మంది మహమ్మారి బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో ఇప్పటి వరకు 8,21,671 మందికి వైరస్ సోకినట్లు అయింది. తాజాగా 795 మంది బాధితులు వైరస్​ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 8,11,568 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

  • రాకాసి పిడుగులు..

Three farmers died: వ్యవసాయాన్నే నమ్ముకున్న కర్షకులు.. పొలంలోనే కన్నుమూశారు. వరుణునిపైనే ఆశలు పెట్టుకున్న అన్నదాతలను రాకాసి పిడుగులు పొట్టనబెట్టుకున్నాయి. పొలం పనుల్లో నిమగ్నమైన ముగ్గురు రైతులను పిడుగుల వర్షం బలితీసుకుంది. జయశంకర్​భూపాలపల్లి జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అన్నదాతలు కన్నమూయటంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

  • ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం..

Students Missing: ఏపీలోని కృష్ణాజిల్లా కంకిపాడు జడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల (students missing) అదృశ్యం కలకలం రేపుతోంది. విద్యార్థులను అదే గ్రామానికి చెందిన గుండి జోజి అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

  • మంకీపాక్స్​పై ఆందోళన వద్దు..

MONKEYPOX MANDAVIYA ADVICE: మంకీపాక్స్ విషయంలో దేశ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వైరస్ కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేశామన్న మంత్రి.. వ్యాక్సిన్ విషయంలోనూ చకచకా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.

  • తైవాన్​లో అడుగుపెట్టిన పెలోసీ..

అమెరికా ప్రతినిధుల సభ(హౌస్​ ఆఫ్​ రిప్రసెంటేటివ్స్​) స్పీకర్ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన.. చైనా, అగ్రరాజ్యం మధ్య అగ్గిరాజేసింది. చైనా హెచ్చరించినా.. తైవాన్​ రాజధాని తైపీలో అడుగుపెట్టారు పెలోసీ. ఆమె తైవాన్​కు వస్తే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చైనా హెచ్చరించినా.. ఆమె వెనక్కి తగ్గలేదు. పెలోసీ పర్యటన నేపథ్యంలో తైవాన్ స్ట్రైట్‌లో చైనా సైనిక విన్యాసాలు చేస్తోంది. అమెరికా సైతం తమ ఆసియా-పసిఫిక్ కమాండ్‌ను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో పెలోసీ.. తైవాన్‌ పర్యటన క్షణక్షణం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

  • కామన్​వెల్త్​లో ఘనమైన చరిత్ర..

COMMONWEALTH GAMES INDIA: కామన్​వెల్త్​ గేమ్స్​లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే నాలుగు స్వర్ణాలు భారత్ వశమయ్యాయి. టోర్నీ ముగిసేలోపు మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. అయితే, భారత్​కు కామన్​వెల్త్​ క్రీడల్లో ఘనమైన చరిత్రే ఉంది. ఇప్పటివరకు ఈ క్రీడల్లో మన ప్రయాణం ఎలా ఉందంటే..

  • నిఖిల్‌కు మంచు విష్ణు భరోసా..

Karthikeya 2 Manchu Vishnu: హీరో నిఖిల్​కు మా అధ్యక్షుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు ధైర్యం చెప్పారు. 'కార్తికేయ 2' చిత్రం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 'కార్తికేయ 2' చిత్రానికి థియేటర్లు ఇచ్చేది లేదంటూ కొందరు మాట్లాడారని నిఖిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నేపథ్యంలో.. మంచు విష్ణు ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details