ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుద్రవ్యోల్బణం కట్టడి చేస్తున్నాం.. దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రశ్నే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ధరల పెరుగుదలపై మాట్లాడిన మంత్రి... ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలోనే ఉన్నామని చెప్పారు.ఇంజినీరింగ్ ఫీజులపై కీలక నిర్ణయం..ఇంజినీరింగ్ ఫీజులపై టీఎస్ఏఎఫ్ఆర్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులకు పాత ఫీజులే వర్తింపు చేయాలని నిర్ణయించింది. రెండేళ్ల కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయించింది.ఆ పిటిషన్లు కొట్టివేత.. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పరిహారం ప్యాకేజీకి అంగీకరించి.. తర్వాత పిటిషన్లు వేయడం సరికాదని వ్యాఖ్యానించింది.సంతోషంతో నిర్వహించుకోవాలి..Governor Tamilisai: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రాజ్‌భవన్ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాలు పంపిణీ చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు గవర్నర్ త్రివర్ణ పతాకాలు అందజేశారు.భద్రాద్రి అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి.. ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవంటారు.. మనసులు కలిసిన మనుషులను ఏదీ విడదీయలేదంటారు. వారి ప్రేమలో నిజాయతీ ఉంటే పెద్దలు సైతం అంగీకరించి.. ఆశీర్వదించేస్తారు.. అలా మనసులు కలిసిన ఓ ఫ్రాన్స్ అమ్మాయి-భద్రాద్రి అబ్బాయి పెద్దల మనసును గెలిచి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.మీకు రోడ్డు వేసేయాలా ఏంటి..MINISTER AMBATI: ఏపీలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పల్నాడు జిల్లా రాజుపాలెంలో పర్యటించిన ఆయనను.. ఓ దివ్యాంగురాలు నిలదీసింది. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని మూడేళ్లయినా రాలేదని చెప్పగా.. ఇంటికి నాలుగు విద్యుత్ మీటర్లు ఉన్నాయని.. అందుకే ఇవ్వలేదని అధికారులు చెప్పడంతో మంత్రి ముందుకెళ్లారు.తల్లి శవంతో బైక్‌పైనే 80 కి.మీ.. తల్లి చనిపోయింది.. శవాన్ని ఇంటికి తీసుకెళ్దామంటే ఆస్పత్రిలో అంబులెన్సు లేదు.. ప్రైవేటు వాహనాలకు ఇచ్చేంత డబ్బు లేదు.. దీంతో ఏం చేయాలో తెలీక.. బైక్‌పైనే 80కిలోమీటర్లు తల్లి శవాన్ని మోసుకెళ్లాడు ఓ వ్యక్తి.ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం..5G spectrum auction: 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. ఏడురోజుల పాటు సాగిన వేలంలో రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. జియో, ఎయిర్టెల్ టాప్ బిడ్డర్లుగా నిలిచాయి.పాక్ చేసిన తప్పే బీసీసీఐ చేస్తోంది.. Rashid latif on india captain change: 1990లో పాకిస్థాన్ ఇలానే నాయకులను మార్చి తప్పు చేసిందని.. భారత్ కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తోందన్నాడు పాకిస్థాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన.. లతీఫ్ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అనుపమ క్లారిటీ..Anupama on karthikeya promotions: 'కార్తికేయ 2' సినిమా ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదో చెప్పారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియా వేదికగా తన పరిస్థితిని వివరించారు. ఇంతకీ ఈ విషయం ఏంటో తెలుసకోండి..