ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి కన్నుమూత.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.భాజపా నేతలు చెప్పాలి..Harishrao Latest News: భాజపా నేతలు ఏం సాధించడం కోసం ఉప ఎన్నిక తెస్తారో చెప్పాలని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. భాజపా నేతలు రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు తీసుకు రాలేదని... రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలన్నారు. ఉచిత కరెంటు, పింఛన్లు ఇవ్వొద్దనేది భాజపా సిద్దాంతమని ఆయన ఆరోపించారు.దిల్లీ చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు.. తెలంగాణ రాజకీయం హస్తిన చుట్టూ తిరుగుతోంది. వారం పాటు దిల్లీలో మఖాం వేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేరుకున్న వెంటనే.. కాంగ్రెస్, భాజపాలు హస్తిన బాట పట్టాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్న నేతలు.. దిల్లీ వేదికగా జాతీయ నేతలతో దిశానిర్దేశంతో వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అధిష్ఠానాల పిలుపు మేరకు హస్తినకు చేరుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్, భాజపా నేతలు.. పార్టీ బలోపేతం, నేతల చేరికలపై ప్రధానంగా చర్చించే అవకాశముంది.అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం..Chenetha Bhima scheme in Telangana : చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నెల 7 నుంచి రైతు బీమా తరహాలో 'నేతన్న బీమా' పథకాన్ని అమలు చేస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి... జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి బీమా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.నిందితులకు బెయిల్ మంజూరు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. రైల్వే కోర్టు 16 మందికి బెయిల్ మంజూరు చేసింది. నిందితులుగా ఉన్న అభ్యర్థులకు పరీక్షలు ఉండటంతో బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. ఏ1 నుంచి ఏ10 వరకు ఉన్న నిందితులకు రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసులో మొత్తం 63 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.టీకాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపుతెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు దిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు వచ్చింది. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. పార్టీలో చేరికలు, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరగనుంది.వందకు 151 మార్కులు.. సాధారణంగా 100కు 35 మార్కులు వస్తే పాస్ అయినట్లే.. టాపర్లు అయితే వందకు 90కి పైగా మార్కులు తెచ్చుకుంటారు.. అలాంటిది వందకు 150కి పైగా మార్కులు వస్తే...? అయినప్పటికీ ఆ విద్యార్థి ఫెయిల్ అయితే? బిహార్‌లో అలాగే జరిగింది.. వివరాల్లోకి వెళ్తే..రోడ్డు దాటేందుకు జేసీబీ..హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలతో వాగులు పొంగిపోర్లతుండగా.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం సిరాజ్‌లోని బలిచౌకి ప్రాంతంలో రోడ్డు దాటాడానికి జేసీబీని ఉపయోగిస్తున్నారు. స్టన్నింగ్ క్యాచ్.. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే రీలితో ఒంటిచేత్తో బంతిని పట్టుకుని అబ్బురపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.నా సినిమా బాయ్‌కాట్ చేయొద్దు..Boycott Laal singh chaddha: తన చిత్రాన్ని ఎవరూ బాయ్‌కాట్ చేయొద్దని బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ విజ్ఞప్తి చేశారు. దేశభక్తి విషయంలో అందరూ తనని తప్పుగా అర్థం చేసుకొంటున్నారని అన్నారు.