తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @5PM - 5PM TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Jul 23, 2022, 4:59 PM IST

  • రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు..

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు.

  • వాగును తలపిస్తోన్న రహదారి..

భారీ వర్షానికి హైదరాబాద్‌ శివారులోని దూలపల్లి నుంచి కొంపల్లి వెళ్లే మార్గంలో రోడ్లపైకి భారీగా వరద నీరు వస్తోంది. రహదారిపై వరద కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోకాళ్ల లోతుతో నీరు ప్రవహించటంతో.. రోడ్డు వాగును తలపిస్తోంది.

  • రాష్ట్రంలో కొత్తగా 13 మండలాల ఏర్పాటు..

రాష్ట్రంలో మరికొన్ని కొత్త మండలాలు రానున్నాయి. మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజా ఆకాంక్షలు, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • 'వరల్డ్‌లో టాప్ 5 కంపెనీలకు నిలయంగా హైదరాబాద్'

ప్రపంచంలో టాప్ 5 కంపెనీలకు హైదరాబాద్ వేదికగా మారిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. నీతి ఆయోగ్ ఆవిష్కరణల ర్యాంకింగ్‌లో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు.

  • గల్ఫ్​ బాధితుని దుర్భర జీవితానికి విముక్తి.. 21 ఏళ్లకు స్వస్థలానికి..

పొట్టకూటి కోసమని గల్ఫ్​ దేశాలకు వలసపోతే.. ఏ పని దొరక్క యాచక వృత్తే దిక్కయింది. ఈడు ఉడిగి పోతున్న వయసులో నరకం అనుభవించాడు. చెట్టు కిందే తన అస్తవ్యస్తమైన జీవనం గడిపాడు. చిత్తు కాగితాలే అతనికి నేస్తాలయ్యాయి.

  • 'బాబోయ్​ చేపలు.. పొలాలన్నీ పాడు చేస్తున్నాయి'

ఎక్కడైనా చేపలు తక్కువ ధరకు దొరికితేనే ఎవరూ ఆగరు.. అలాంటిది ఉచితంగా దొరికితే ఇక ఆగుతారా.. కానీ.. నీళ్లలోకి కొట్టుకొచ్చిన చేపల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులంటే ఆశ్చర్యమే కదా. అలాంటి ఘటనే.. ఏపీలోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో జరిగింది.

  • నదిలో కొట్టుకుపోయిన పులి.. బ్యారేజీ వద్ద చిక్కుకొని...

ఉత్తర్​ప్రదేశ్ లఖింపుర్​ఖేరీ ప్రాంతంలోని కర్తానియాఘాట్​ టైగర్​ రిజర్వ్​ దగ్గర వరద ధాటికి ఓ పులి కొట్టుకుపోయింది. గిరిజపురి బ్యారేజీ వద్ద ఘగ్రా నది ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల పులి చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు స్థానికుల సాయంతో పులిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

  • నటితో రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయిన హీరో..

ఓ ప్రముఖ హీరో, తన భార్య నడిరోడ్డుపైనే కొట్లాటకు దిగారు. అందరూ చూస్తుండంగానే విపరీతంగా తిట్టుకున్నారు. ఆ కథనాయకుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

  • ఆ టీవీ డిబేట్​లపై సీజేఐ ఆందోళన..

వీ ఛానెల్‌లలో చర్చలు, సామాజిక మాధ్యమాల్లో 'కంగారూ కోర్టు'ల నిర్వహణ దేశ ప్రజాస్వామ్యానికి హానికరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మీడియా చర్చలు న్యాయవ్యవస్థ పనితీరు, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయన్నారు.

  • యాక్షన్​ కింగ్​ అర్జున్​ ఇంట విషాదం

నటుడు అర్జున్​ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details