తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @5PM - 5PM టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Jul 19, 2022, 4:59 PM IST

  • 'అలా అయితే పెరుగు, పప్పు, బియ్యంపై నో జీఎస్​టీ'..

సోమవారం అమలులోకి వచ్చిన కొత్త జీఎస్​టీ నిబంధనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ మరింత స్పష్టత ఇచ్చారు. పెరుగు సహా 11 రకాల వస్తువుల జాబితాను పేర్కొంటూ.. అవి విడిగా అమ్మితే వాటిపై జీఎస్​టీ వర్తించదని తేల్చిచెప్పారు.

  • కోతకు గురైన మేడిగడ్డ బ్యారేజీ గ్రావిటీ కాలువ, కరకట్ట..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజీ గ్రావిటీ కాలువ, కరకట్ట కోతకు గురయ్యాయి. సుమారు 100 మీటర్ల మేర కోతకు గురికాగా.. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో దర్శనమిస్తున్నాయి.

  • మద్యం మత్తులో దివ్యాంగుడు హల్చల్​.. పోలీసులకు ధమ్కీ ఇస్తూ నానా రచ్చ..

కారు నడపిన యువకుడు మద్యం తాగాడు. అందులో ఉన్న అతడి సోదరుడు మద్యం మత్తులోనే ఉన్నారు. పైగా కారులో మద్యం సీసాలూ ఉన్నాయి. ఇవన్ని చూసి.. కారు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా నచ్చని.. డ్రైవర్​ సోదరుడు మాత్రం ఏకంగా పోలీసులకే ధమ్కీ ఇచ్చాడు. మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించాడు.

  • ల్యాండ్‌ ఫోన్‌ కోసం మహిళ దారుణ హత్య.. ఎక్కడంటే..?

ఎవరైనా బంగారం కోసమో.. లేక డబ్బుల కోసమో చోరీలు చేయడం.. ఇంట్లో వాళ్లు ఎదురు తిరిగితే హత్య చేయడం లాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఏపీలోని ఎన్టీఆర్​ జిల్లా సత్యనారాయణపురంలోనూ ఇలానే జరిగింది. కాకాపోతే ఫోన్​ కోసం దొంగతనానికి వచ్చిన దుండగులు.. ఎదురు తిరిగిన మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు.

  • లారీతో ఢీకొట్టి డీఎస్​పీ దారుణ హత్య..

అక్రమ మైనింగ్​ జరుగుతోందని విచారణకు వెళ్లిన డీఎస్​పీని దుండగులు లారీతో ఢీకొట్టి చంపేశారు. ఈ ఘటన హరియాణాలో జరిగింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • 'లోదుస్తులన్నీ ఓకే చోట.. చున్నీ కూడా లేదు'..

కేరళలో నీట్ పరీక్ష వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. విద్యార్థులు తమకు ఎదురైన అవమానకరమైన అనుభవాలను 'ఈటీవీ భారత్'​తో పంచుకున్నారు. మరికొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. మరోవైపు, కళాశాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది.

  • యువకుడిపై దుండగుల హత్యాయత్నం.. 'నుపుర్​ శర్మ వీడియో చూడడమే కారణం'!

బిహార్​లోని ఓ యువకుడిపై మరో వర్గానికి చెందిన పలువురు కత్తితో దాడి చేశారు. నుపుర్​ శర్మ వివాదాస్పద వీడియో చూడటం వల్లే యువకుడిపై హత్యాయత్నం జరిగినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు.

  • బస్సు-లారీ ఢీ.. 22 మంది మృతి.. 33 మందికి గాయాలు

ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మంది గాయపడ్డారు. ఈజిప్ట్​ మిన్యా రాష్ట్రం మాలావిలో జరిగిందీ ఘోర ప్రమాదం.

  • కోహ్లీ నాతో 20నిమిషాలు మాట్లాడితే.. తిరిగి ఫామ్​లోకి..: గావస్కర్‌

ఫామ్​ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే కొంతమంది ఆటగాళ్లు, సీనియర్లు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా.. దిగ్గజ ఆటగాడు గావస్కర్‌ కోహ్లీకి తన విలువైన సలహాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

  • రవితేజ- నిర్మాత సుధాకర్​ మధ్య గొడవకు కారణం వాళ్లేనట..

రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'రామారావు ఆన్‌ డ్యూటీ'. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జులై 29న విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details