తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @5PM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Jul 18, 2022, 4:58 PM IST

  • ముగిసిన రాష్ట్రపతి పోలింగ్​..

దేశ ప్రథమ పౌరుడు, 16వ రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పోలింగ్ ముగిసింది. హైదరాబాద్​లో సీఎం కేసీఆర్​ సహా 117 మంది ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • బ్రిడ్జ్​పై నుంచి పడిన కారు, బైక్.. ఆరుగురు మృతి

ద్విచక్రవాహనాన్ని ఓ ఎస్​యూవీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. అనంతరం రెండు వాహనాలు నాలాలో పడిపోయాయి.

  • 'క్లౌడ్ బరస్ట్ ఎక్కడ పడితే అక్కడ కుదరదు'

క్లౌడ్ బరస్ట్‌పై సీఎం కేసీఆర్ మరింత స్పష్టమైన సమాచారంతో మాట్లాడాల్సిన అవసరముందని భాజపానేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. క్లౌడ్ బరస్ట్ అనేది కొంత ప్రాంతానికే పరిమితం అవుతుందని తెలిపారు. క్లౌడ్‌ బరస్ట్‌ అంశంపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు.

  • సీఎంకు ఎన్ని కష్టాలొచ్చినయ్.. షర్మిల సెటైరికల్ ట్వీట్

‘క్లౌడ్‌ బరస్ట్‌’పై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. ముఖ్యమంత్రి కామెంట్స్‌పై సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు.

  • మాజీ ఇన్​స్పెక్టర్ నాగేశ్వర్​రావు​కు ఐదు రోజుల పోలీస్ కస్టడీ..

మహిళపై అత్యాచారం కేసులో అరెస్టయిన మాజీ ఇన్​స్పెక్టర్​ నాగేశ్వర్‌రావు కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కేసులో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్​కు కోర్టు అంగీకరించింది. 5 రోజుల కస్టడీ అనుమతితో వనస్థలిపురం పోలీసులు.. మొత్తం ఘటనను సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.

  • రాయచూర్​లో నలుగురు హైదరాబాద్​ వాసుల మృతి

హైదరాబాద్‌కు చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. గోవా నుంచి తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని రాయచూర్ వద్ద జరిగింది.

  • టేస్టీ సోయా దోశ.. ఎముకలకు బలం.. గుండె జబ్బులకు చెక్!

ఇంట్లో అందరూ ఇష్టంగా తినే అల్పాహారం దోశ. మరి దీన్ని ఇంకొంచెం రుచికరంగా, ఆరోగ్యకరంగా ఎందుకు మార్చకూడదు? అందుకే ఓసారి సోయా దోశ ట్రై చేసి చూడండి. సోయాలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

  • మార్కెట్లకు లాభాల పంట.. సెన్సెక్స్ 760 ప్లస్​

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 760 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు లాభపడ్డాయి.

  • మళ్లీ తెరపైకి హెచ్​సీఏ రగడ..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి రాజ్యం ఎలుతోందని... అసోసియేషన్ అధ్యక్షుడు అజార్​తో పాటు... ఇతర సభ్యుల ప్రస్తుత పనితీరు అవినీతి ఆరోపణలతో ఉందని... బీసీసీఐ మాజీ మధ్యంతర అధ్యక్షుడు శివలాల్ యాదవ్ ఆరోపించారు.

  • చిక్కుల్లో మణిరత్నం, విక్రమ్​.. నోటీసులు పంపిన కోర్టు!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, హీరో విక్రమ్​పై ఓ న్యాయవాది పలు ఆరోపణలు చేశారు. కోర్టును ఆశ్రయించి.. వారికి నోటిసులు పంపారు. ఇంతకీ ఏం జరిగిందంటే...

ABOUT THE AUTHOR

...view details