తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​ న్యూస్ @3PM - 3PM TOPNEWS

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Jul 15, 2022, 3:00 PM IST

  • జగిత్యాల జిల్లాలో భాజపా ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్​పై దాడి

వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కారుపై దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ పర్యటనకు వచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్‌ వాహనాన్ని పలువురు గ్రామస్తులతో పాటు తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.

  • 'సీఎంగా కేసీఆర్​ హ్యాట్రిక్ ఖాయం..'

కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ ఖాయమని మంత్రి కేటీఆర్‌ ఉద్ఘాటించారు. కాంగ్రెస్, భాజపా సర్వేలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల పాలన తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని కేటీఆర్‌ వివరించారు. నేతల మధ్య గొడవలు తెరాసలో పోటీతత్వాన్ని చాటుతున్నాయన్న కేటీఆర్​.. బలంగా ఉన్న నాయకులను పార్టీ కలుపుకొని పోతుందన్నారు.

  • కేంద్రంపై పోరాటానికి కేసీఆర్​ పిలుపు..

ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్​ సమావేశాల నేపథ్యంలో.. కేంద్రంపై పోరాటానికి సీఎం కేసీఆర్​ పిలుపునిచ్చారు. కేంద్రంపై పోరాటానికి కలసి రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలు, నేతలతో ఫోన్లో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ మేరకు.. మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్‌, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్‌, శరద్ పవార్‌లతో మాట్లాడారు.

  • రోడ్ల దుస్థితి తెలిసేలా.. పవన్‌ వ్యంగ్య చిత్రం ట్వీట్‌

ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్​లో.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. 'గుడ్ మార్నింగ్ సీఎం సార్ ' అనే హ్యాష్ ట్యాగ్ తో.. ఛిద్రమైన రహదారుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని.. జనసేన కార్యకర్తలు, నాయకులకు సూచించారు.

  • క్వింటా మిర్చికి రూ.23వేలు.. ఎక్కడంటే..?

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఎర్రబంగారం మెరిసింది. మిరప.. రికార్డు ధర పలికింది. ఓ రైతు వద్ద మిరప పంటను క్వింటా​కు రూ.23వేలు చెల్లించి కొనుగోలు చేశారు. మార్కెట్‌ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావటం విశేషం.

  • పెళ్లి కోసం సాహసం.. థర్మకోల్​ షీట్​తో వరదలో 7కి.మీ జర్నీ!

మహారాష్ట్ర నాందేడ్​ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే హడ్గావ్​ మండలం కొర్రి గ్రామానికి చెందిన ఓ వరుడు తన పెళ్లి కోసం సాహసం చేశాడు. థర్మకోల్​ షీట్​ సాయంతో 7 కిలోమీటర్ల దూరంలోని ఉమర్​ఖేడ్ మండలం సంగమ్ చించోలి వరకు నీటిలో ప్రయాణించాడు. అతడితో పాటు బంధువులు సైతం థర్మకోల్​ షీట్ల సాయంతోనే వివాహానికి వెళ్లారు.

  • ఆల్ట్​ న్యూస్​ జుబైర్​కు బెయిల్​.. కానీ...

ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్ చేశారన్న కేసులో జర్నలిస్ట్​ మహ్మద్​ జుబైర్​కు బెయిల్ లభించింది. అయితే.. అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం షరతు విధించింది.

  • నాజీల అరాచకం.. అక్కడ 8,000 మంది అస్థికలు గుర్తింపు

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు కాన్సన్​ట్రేషన్​ క్యాంపులు నిర్వహించిన బంధీలను అతిదారుణంగా హింసించేవారు. వీరి అరాచకాలకు సంబంధించి మరో ఉదాహరణ తాజాగా పోలాండ్​లో బయటపడింది. సోల్డౌ ప్రాంతంలో దాదాపు 8వేల మంది చితా భస్మన్ని అస్థికలను గుర్తించారు.

  • వడ్డీ రేటు తగ్గాలా? బ్యాంకుతో బేరమాడండి!

రెండేళ్లుగా తక్కువగా ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు పెరగడం ప్రారంభించాయి. ఏప్రిల్‌లో గృహరుణాల వడ్డీ రేట్లు 6.40%-6.80% మధ్య ఉండేవి. ఇప్పుడు దాదాపు 90 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి. ఆర్‌బీఐ రెపో రేటును మరింత పెంచుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి రుణం మరింత భారం కానుంది. ఇలాంటి సందర్భంలో వడ్డీ రేటుపై ఎంతో కొంత రాయితీ వచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? తెలుసుకుందాం.

  • శివకార్తికేయన్ కొత్త సినిమా టైటిల్​ టీజర్​ రిలీజ్​​​​.. హీరోయిన్​గా సామ్​!

తమిళ స్టార్​ హీరో శివ‌కార్తికేయ‌న్​ 22వ సినిమా టైటిల్​ టీజర్​ను సూపర్​స్టార్​ మహేశ్​బాబు విడుదల చేశారు. యాక్షన్​ సీన్స్​తో మొదలైన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

ABOUT THE AUTHOR

...view details