తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @5PM - 5PM టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Jul 14, 2022, 4:58 PM IST

  • వరదల్లో బాహుబలి సన్నివేశం రిపీట్​..

పెద్దపల్లి జిల్లా మంథనిలో బాహుబలి సినిమాలోని ఓ సన్నివేశం రిపీటైంది. సినిమా మొదట్లో.. చంటిబిడ్డగా ఉన్న మహేంద్ర బాహుబలిని సైనికుల నుంచి తప్పించే ప్రయత్నంలో శివగామి నదిలో పడుతుంది. తన ప్రాణాలు పోతున్నా.. చంటిబిడ్డను అరచేతితో పైకెత్తిపట్టుకుని రక్షించే సన్నివేశం రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. అయితే.. సుమారు అలాంటి సన్నివేశమే ఇప్పుడు మంథనిలోని మర్రివాడలో పునరావృతమైంది.

  • మేడిగడ్డ వద్ద వరదలో చిక్కుకున్న ఇంజినీర్లు

కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. అంతకంతకూ వరద ఉద్ధృతి పెరుగుతోంది. వరదతో కాళేశ్వరం పంప్‌హౌజ్ నీట మునిగిపోయింది. పంప్ హజ్ లోకి క్రమంగా నీరు చొచ్చుకువచ్చింది. దీంతో.. పంప్ హౌజ్ లోని 17 మోటర్లూ నీటిలో మునిగాయి. 2టీఎంసీ, 1టీఎంసీ నీటిని తోడే ఈ పంపులు మునిగిపోయాయి.

  • కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి.. ఆ ప్రాంతాల్లో రెడ్​ అలర్ట్​

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో కాళేశ్వరంలో జలకళను సంతరించుకుంది. కాళేశ్వరం ఘాట్ వద్దకు ఎవరూ రాకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 15.900 మీటర్ల భారీ ప్రవాహం కొనసాగుతోంది.

  • డ్రోన్​ దృశ్యాల్లో గోదావరి ఉగ్రరూపం

భద్రాచలంలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు గోదావరిలో 60.80 అడుగులకు నీటిమట్టం చేరింది. భద్రాచలం వద్ద అధికారులు జారీ చేసిన మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నదిలో ప్రస్తుతం 18.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాద్రి రామాలయం అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది.

  • వరదల్లో కొట్టుకుపోతున్న ట్రాక్టర్లు.. ఏం చేయలేక బాధలో రైతు..

ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తున్నాయి. మరోవైపు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన గంప వెంకట్రావు అనే రైతు.. దుక్కులు దున్ని తన రెండు ట్రాక్టర్లను గోదావరి మధ్యలో ఉన్న లంకలో నిలిపి ఉంచాడు. అయితే..

  • నదిలో చిక్కుకున్న ఇద్దరిని అలా రక్షించారు..

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఓడ్డు సోమనపల్లిలో వాటర్‌ట్యాంకు మీద చిక్కుకుపోయిన ఇద్దరు రైతులను ప్రభుత్వ విపత్తు నిర్వహణ యంత్రాంగం రక్షించింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెలికాప్టర్ తెప్పించి.. వారి ప్రాణాలను కాపాడారు.

  • వరుణుడి ప్రతాపంతో ఆ రాష్ట్రాలు గజగజ..

భారీ వర్షాలు గుజరాత్​, మహారాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలకు ఆయా రాష్ట్రాల ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

  • సింగపూర్​ ఓపెన్​ క్వార్టర్స్​లోకి సైనా..

స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​ సింగపూర్​ ఓపెన్​లో రాణిస్తోంది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్​లో గెలుపొందిన సైనా.. క్వార్టర్స్​కు ఎంపికైంది. మరోవైపు పురుషుల డబుల్స్​ విభాగంలో ఎంఆర్​ అర్జున్, ధ్రువ్​ కపిలా జోడీ క్వార్టర్స్​కు దూసుకెళ్లింది.

  • సైన్యం ఎంట్రీతో శ్రీలంక లైన్​ క్లియర్!

శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. చాలా మంది ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలోనే ఉన్నారు. మరోవైపు.. హింసాయుత నిరసనల కట్టడికి లంక సైన్యం రంగంలోకి దిగింది. పార్లమెంటు పరిసరాల్లో యుద్ధ ట్యాంకులను మోహరించింది. కొలంబో రోడ్లపైనా ఆర్మీ వాహనాలతో గస్తీ కాస్తోంది.

  • ఇందిరా గాంధీగా కంగనా..

ఎమర్జెన్సీ సినిమా టీజర్​ రిలీజైంది. ఇందిరా గాంధీగా కంగనా లుక్​ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు. ఎమర్జెన్సీ దేశ రాజకీయ చరిత్రలో కీలకపాత్ర పోషించిందని అందుకే ఈ కథ చెప్పాలనుకుంటున్నట్లు కంగనా వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details