ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు ఏకధాటి వర్షం.. స్తంభించిన జనజీవనం Heavy rains in telangana:రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలతో.... జనజీవనం స్తంభించిపోయింది. ఎకదాటి వర్షంతో.. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాల్లో కొన్నిచోట్ల ప్రధాన రహదారులు వరదలకు కొట్టుకుపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేక.... ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రోజులతరబడి వర్షాలకు నానిపోయిన ఇళ్లు కూలిపోతున్నాయి. నిలువనీడలేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 'ఆర్డీఎస్ పనులు ఆపేలా ఆదేశాలివ్వండి'ఆర్డీఎస్ కుడికాల్వ పనులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. కేఆర్‌ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా ఆర్డీఎస్ కుడికాల్వ పనులు కొనసాగిస్తున్నారని తెలిపింది. మరో రెండ్రోజులు ప్రజలు బయటకు రావొద్దు!! రాగల మూడ్రోజులపాటు తెలంగాణకు వర్షసూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. రైతులను ఆదుకోవాలి.. కేసీఆర్‌కు రేవంత్ లేఖpcc chief revanth reddy letter to a cm kcr: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇచ్చే పరిహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. తక్షణ సాయం కింద ఎకరాకు రూ.15 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ట్విస్ట్ ఇచ్చిన ఉద్ధవ్.. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదికే జై ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూకే మద్దతివ్వాలని తీర్మానించారు.కోట్ల విలువైన హెరాయిన్ సీజ్Heroin Seize Mundra port: గుజరాత్ ముంద్రా ఓడరేవు సమీపంలో.. భారీగా హెరాయిన్ పట్టుబడింది. రూ.376.50 కోట్ల విలువైన సుమారు 75 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.ఇరాన్‌కు పుతిన్.. ఉక్రెయిన్‌కు ఇక కష్టమే! Iran Drones To Russia: ఉక్రెయిన్‌పై యుద్ధం జరుగుతున్న సమయంలోనే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే వారం ఇరాన్ వెళ్లనున్నారు. ఇరాన్ నుంచి రష్యా మానవరహిత డ్రోన్ల సాయం కోరిందని అమెరికా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఉక్రెయిన్‌లో కీలక లక్ష్యాలను ఛేదించడానికి రష్యా.. ఇరాన్ సాయం కోరుతోందా? ఇరాన్ నుంచి వందలాది డ్రోన్లు రష్యాకు చేరుకోనున్నాయా?గడువులోగా చేస్తే లాభాలెన్నో!ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీ జులై 31. ఆఖరి నిమిషం వరకు వేచిచూడకుండా ఆ పని ముందే పూర్తి చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.ఆ సమయంలో ఏడ్చేశాను విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్' సినిమాలోని 'అక్డీ పక్డీ' పాట దుమ్ము లేపుతోంది. విజయ్, అనన్య స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే సాంగ్ కొరియోగ్రఫీ సమయంలో తాను ఏడ్చేసినట్లు చెప్పుకొచ్చాడు విజయ్.నిప్పులు చెరిగిన బుమ్రా.. 110కే ఇంగ్లాండ్ అలౌట్ బుమ్రా (6/19) దెబ్బకు తొలి వన్డేలో ఇంగ్లాండ్ కుప్పకూలింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ఎదుట 111 పరుగుల స్వల్ప లక్ష్యం నిర్దేశించింది. ఇందులో నలుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం.