తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్‌న్యూస్ @ 5PM - topnews in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Jul 11, 2022, 4:58 PM IST

  • రాష్ట్రంలో 'ముసురు'కున్న వర్షాలు..

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ముసురుపట్టగా... మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడ్రోజులుగా పలుజిల్లాల్లో కురిసిన ఏకధాటి వానలకు... పల్లెలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద నీరు భారీగా చేరి... అనేక చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

  • 'కేసీఆర్​ బలం, బలహీనత, భయం.. అన్ని నాకు మాత్రమే తెలుసు..'

సీఎం కేసీఆర్​పై హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్​ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ బలం, బలహీనత, భయం అన్ని తనకు మాత్రమే తెలుసన్నారు. కేసీఆర్‌ దుర్మార్గమైన పాలన అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు.

  • కనువిందు చేస్తున్న జలపాతాలు..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లింగాపూర్ మండల కేంద్రంలోని సప్తగుండాల, మిట్ట, చింతల మదర జలపాతాలు కనులవిందు చేస్తున్నాయి.

  • అమర్‌నాథ్​ వరదల్లో.. ఆంధ్రావాసి దుర్మరణం

అమర్​నాథ్​ యాత్రలో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా ఇప్పటికే 16 మంది మరణించగా.. ఏపీకి చెందిన మరో మహిళ కూడా మృత్యువాతపడ్డారు. ఏపీకి చెందిన మరో 25 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

  • అసెంబ్లీని రద్దు చేసే ధైర్యముందా?: జీవన్ రెడ్డి

రాష్ట్రంలో తెరాసపై ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే సీఎం కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. వర్షాలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సహాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు మాట్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

  • ముర్మూకే తెదేపా మద్దతు.. ప్రకటించిన చంద్రబాబు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తెదేపా తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తెదేపా వ్యూహ కమిటీలో చర్చించిన అనంతరం తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ప్రకటించారు.

  • అమర్‌నాథ్‌ యాత్ర మళ్లీ షురూ..

ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయిన అమర్‌నాథ్‌ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. జమ్ములోని భగవతి నగర్‌ యాత్రి నివాస్‌ నుంచి.. యాత్రికులు భారీ బందోబస్తు మధ్య బేస్‌ క్యాంపులకు బయలుదేరారు.

  • 'ఉబర్' లీక్స్​.. బిజినెస్ ప్రయాణంలో చీకటి రహస్యాలు

ఉబర్ ఫైల్స్ లీకులు.. ఇప్పుడు బిజినెస్​ ప్రపంచాన్ని విస్తుగొలుపుతున్నాయి. కార్యకలాపాల విస్తరణ సమయంలో ఉబర్​ అవకతవకలకు పాల్పడ్డట్లు లీకుల్లో బయటపడింది. ఫ్రాన్స్​ అధ్యక్షుడు మేక్రాన్​తోపాటు యూరోపియన్ కమిషన్.. ఉబర్‌కు నిబంధనలకు విరుద్ధంగా సాయం చేసినట్లు కీలక పత్రాల ద్వారా తెలుస్తోంది. ఇంతకీ లీకైన ఫైల్స్​లో ఏమున్నాయి? ఎలా జరిగింది? ఉబర్​ ఏం చెబుతోంది?

  • 94ఏళ్ల వయసులో 'స్వర్ణ' రికార్డు..

కొంతమందిని చూస్తే వీళ్లు వయసుకు ఎదురీదుతున్నారేమో అనిపిస్తుంది. అలాంటి వారే 94 ఏళ్ల ఈ బామ్మ. కారణం.. ఈ వయసులో అంతర్జాతీయ పరుగు పందెం పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. దీంతోపాటే షాట్​పుట్​లోనూ పాల్గొని కాంస్యాన్ని అందుకుంది. ఆమె ఎవరంటే..

  • హీరో నితిన్​పై ఆ దర్శకుడు ఫుల్​ఫైర్​..

నటుడు నితిన్‌పై ఓ దర్శకుడు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ స్టేజ్​పైనే తీవ్రంగా మండిపడ్డారు. నితిన్​ తనకు మాటిచ్చి తప్పాడంటూ, అది తనకెంతో అవమానకరంగా ఉందంటూ ఎమోషనల్​ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details