తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS : టాప్‌న్యూస్ @ 5PM - 5PM టాప్‌న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Jul 10, 2022, 4:58 PM IST

  • మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచే మూడు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వర్షాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

  • పోలీసుల అదుపులో నాగేశ్వరరావు..

అత్యాచారం ఆరోపణలతో సస్పెండైన మారేడ్‌పల్లి మాజీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు, సాంకేతిక ఆధారాలను సరిపోల్చిన వనస్థలిపురం పోలీసులు ఆయనను ఆదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పూర్తి విచారణ చేసిన తర్వాతే రేపు అరెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు.

  • 'భాజపా ఆపరేషన్ ఆకర్ష్.. ఈ నెల 21 నుంచి బైక్​ ర్యాలీలు'

ఆపరేషన్ ఆకర్ష్​పై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. ఈనెల 21 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్​ ర్యాలీలు ప్లాన్​ చేసిన కమలదళం.. అదే సమయంలో ఆసక్తి ఉన్న వారిని చేర్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవాళ హైదరాబాద్​లో జరిగిన పార్టీ కోర్ కమిటీలో పలు అంశాలపై చర్చించారు.

  • బెడ్​రూంలోని శృంగార చిత్రీకరణకు భర్త పట్టు..

భారతీయ సంస్కృతి ప్రకారం కాపురం అనేది కేవలం భార్యాభర్తలకు మాత్రమే పరిమితమైన అంశం. నాలుగు గోడల మధ్య అన్యోన్యంగా సాగాల్సిన సృష్టి కార్యం అది. అలాంటి శృంగారం నలుగురి కంట పడితే..? పరువు బజారున పడుతుంది.. మానం మర్యాద మంట గలిసిపోతాయి.. సంసారం కుప్పకూలిపోతుంది.. మరి, ఇవన్నీ ఆలోచించాడో లేదో..? అసలు అతని మనసులోని దుర్భుద్ధికి కారణాలేంటో తెలియదు కానీ.. బెడ్ రూమ్ సన్నివేశాలను వీడియో తీయాలని పట్టుబట్టాడు ఓ భర్త!

  • 'నేను జయలలిత సోదరుడ్ని.. ఆస్తిలో సగం వాటా నాదే'..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తాను సోదరుడినని పేర్కొంటూ కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు కోర్టు మెట్లెక్కారు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్​ దాఖలు వేశారు.

  • ఒడిలో తమ్ముడి మృతదేహం.. మదిలో పుట్టెడు దుఃఖం..

తనతో కలిసి సరదాగా ఆడుకోవాల్సిన తమ్ముడు.. ఒడిలో నిర్జీవంగా పడి ఉన్నాడు. కుమారుడి మృతదేహాన్ని ఎలా ఇంటికి తీసుకెళ్లాలో తెలియక.. పేద తండ్రి అందరినీ బతిమలాడుతున్నాడు. ఇలాంటి దయనీయ స్థితిలో అనేక గంటలపాటు రోడ్డు పక్కనే శవంతో ఏడుస్తూ కూర్చున్నాడు 8ఏళ్ల బాలుడు. ఎక్కడ? ఎందుకు?

  • వరదలో కొట్టుకుపోయిన లారీ

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​ జిల్లాలో ఓ లారీ వరదలో కొట్టుకుపోగా.. అనేక టన్నుల రేషన్​ బియ్యం నీటిపాలైంది. భోపాలపట్టణంలోని మెట్టుపల్లి వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. అనేక చోట్ల రహదారులు నీటమునిగాయి.

  • వాట్సాప్‌లో ఇక డబుల్ ధమాకా..

ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్‌.. త్వరలోనే అదిరిపోయే ఫీచర్​ను తమ యూజర్లకు​ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైమరీ మొబైల్‌లోని వాట్సాప్‌ అకౌంట్‌ను మరో స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసి వాడుకునేలా ఫీచర్​ను​ తీసుకొస్తోంది.

  • హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా? ఇవి తెలుసుకోండి!

అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఆరోగ్య బీమా ఆదుకుంటుంది. కొన్నిసార్లు బీమా సంస్థ మనం పరిహారం కోసం చేసిన క్లెయింను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. ఏ పరిస్థితుల్లో ఇలాంటి అనుభవం ఎదురవుతుంది? దాన్ని నివారించేందుకు ఏం చేయాలో చూద్దాం..

  • ప్యాలెస్ జిమ్​లో కసరత్తులు.. సోఫాలో చిల్..

శ్రీలంకలో నిరసనకారులు అధ్యక్షుడి భవనంలోకి చొచ్చుకెళ్లి రచ్చరచ్చ చేశారు. భవనంలోని స్విమ్మింగ్ పూల్​లో కొంతమంది ఈత కొట్టగా.. మరికొందరు అక్కడి జిమ్​లో కసరత్తులు చేశారు. ఇంతటి ఆందోళనల్లోనూ కొందరు సరదాగా.. పిక్నిక్ చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details