తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2022, 6:58 PM IST

ETV Bharat / city

Telangana Top news: టాప్ న్యూస్@7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7pm topnews
7pm topnews

  • కేంద్ర మంత్రి పదవికి నఖ్వీ రాజీనామా- ఉపరాష్ట్రపతిగా అవకాశం!

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఉక్కు శాఖ మంత్రి ఆర్​సీపీ సింగ్​.. తమ పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు సమర్పించారు. బుధవారం ఉదయం జరిగిన కేబినెట్​ సమావేశంలో నఖ్వీ, ఆర్సీపీ సింగ్ దేశానికి​ చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు.

  • ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు నేటితో ముగియనుండగా... ఈనెల 8వరకు పొడిగించారు. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10 వరకు జరగనున్నాయి.

  • కాంగ్రెస్ వర్సెస్ భాజపా.. పోటాపోటీ నిరసనలు

భాజపా రాష్ట్ర కార్యాలయం ముట్టడికి మహిళా కాంగ్రెస్ యత్నించింది. సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ మహిళా కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టగా.. మహిళా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా భాజపా మహిళా మోర్చా నేతలు నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.

  • మున్సిపల్​ కౌన్సిలర్​ రాసలీలలు.. మహిళపై దాడికి దిగిన భార్య

ప్రజాప్రతినిధి భార్య ఓ మహిళపై దాడికి యత్నించింది. ఎందుకంటే ఆమె కూడా ఓ భార్యే కాబట్టి..! అదేంటీ అనుకుంటున్నారా..? అదేనండి ప్రజాప్రతినిధిగా ఉన్న తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిశాక.. ఊరికే ఉంటుందా ఏంటీ..! అసలు ఎవరా ప్రజాప్రతినిధి..?

  • మంత్రి రాజీనామా.. రాజ్యాంగంపై ఆ వ్యాఖ్యలే కారణం

రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మంత్రి సాజి చెరియన్.. పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగం దోపిడీని సమర్థిస్తూ, దేశ ప్రజలను మోసం చేసే విధంగా రాశారని అనడం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • దోమలపై పోరుకు దోమలే అస్త్రాలు..

దేశంలో ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న వైరస్‌ల నియంత్రణకు భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్​) విస్తృత ప్రయోగాలు చేస్తోంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్‌లను ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన దోమలతోనే నియంత్రించేందుకు సిద్ధమైంది.

  • డోలో-650 మాత్రల తయారీ సంస్థపై ఐటీ దాడులు.. ఒకేసారి 40 చోట్ల..!

డోలో- 650 ఔషధాల తయారీ సంస్థపై ఐటీ శాఖ విస్తృత సోదాలు నిర్వహించింది. ఆదాయానికి తగిన పన్ను చెల్లించడం లేదని ఆరోపణల నేపథ్యంలో.. బెంగళూరు రేస్​ కోర్స్​ రోడ్డులోని మైక్రో ల్యాబ్స్​ లిమిటెడ్​ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

  • ధావన్‌ కెప్టెన్సీలో విండీస్‌తో వన్డే సిరీస్​..

వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ధావన్‌ కెప్టెన్సీలో విండీస్​తో తలపడనుంది. ఇదిలా ఉండగా.. ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్​లో రిషభ్​ పంత్ తన కెరీర్​లోనే అత్యుత్తమ ర్యాంక్​కు ​చేరుకున్నాడు.​

  • బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం..

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ స‌ర్కార్ రాజ‌కీయ సంక్షోభంలో చిక్కుకుంది. మంగళవారం ఆర్థిక మంత్రి రిషి సునాక్​, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్​ రాజీనామా చేయగా.. తాజాగా మరో నలుగురు మంత్రులు అదే బాటలో నడిచారు.

  • 'పజువూరు రాణి నందిని'.. యువరాణి ఆహార్యంలో మెరిసిన ఐశ్వర్యరాయ్​

స్టార్​ డైరెక్టర్​ మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'పొన్నియన్​ సెల్వన్-1​' సినిమా నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చేసింది. బుధవారం సినిమాలోని ఐశ్వర్యరాయ్​ ఫస్ట్​ లుక్​ను విడుదల చేయగా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details