ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుభాజపా నెక్ట్స్ టార్గెట్.. ఆ రెండు రాష్ట్రాలే హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు తీర్మానాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన అమిత్ షా ఆ పార్టీ ఎప్పుడూ భ్రమల్లోనే రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బంగాల్, తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారి ప్రవేశం.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న హెచ్‌ఐసీసీలో కలకలం రేగింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం హాల్లోకి ప్రవేశించారంటూ భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులను భాజపా సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి గుర్తించారు.అవును... ప్రధాని మోదీ సేల్స్‌మెనే Bandi Sanjay Fire on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రధానిని సేల్స్‌మెన్ అంటావా అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని.. కేసీఆర్ అవమానపరిచారని.. ప్రజలు క్షమించరని ఆయన ధ్వజమెత్తారు.పదవి లేకున్నా... ప్రజా సమస్యలు పరిష్కరిస్తాPawan Kalyan: ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని.. ఆలోచన ఉంటే ప్రజల ఆవేదన నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేతలు అధికారం ఉంటేనే సమస్యల పరిష్కారం అంటే కుదరదని మండిపడ్డారు. దేశంలోనే యంగెస్ట్ సభాపతి! Maharastra Politics: శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలో ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం బలనిరూపణకు వీలుగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరిగింది. ఏక్‌నాథ్ బృందం మద్దతుతో భాజపా నేత రాహుల్ నర్వేకర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్న రామ్‌రాజేనాయక్ అల్లుడే రాహుల్ నర్వేకర్. మరోవైపు, విధాన్భవన్లోని శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీల్ చేశారు శివసేన నేతలు.జావా, పైథాన్.. 13 ఏళ్లకే పట్టుతమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఓ విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. అర్నవ్ శివరామ్ అనే విద్యార్థి 13 ఏళ్ల వయసుకే 17 కంప్యూటర్ ల్యాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. అతి చిన్న వయసులో ఈ ఘనతను సాధించిన వారిలో ఒకరిగా నిలిచాడు.ఉగ్రవాదులను పట్టుకున్న కశ్మీరీలు.. గవర్నర్ భారీ నజరానా జమ్ముకశ్మీర్‌లో.. లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. గ్రామస్థుల ధైర్య సాహసాలు మెచ్చి రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్, డీజీపీ భారీ నజరానా ప్రకటించారు.వాట్సాప్‌లో మరో ఫీచర్..!Whatsapp New Feature: వాట్సాప్‌లో ఎవరికైనా తప్పుగా మెసేజ్ పంపేశారా? అది కూడా రెండు గంటలు తర్వాత చూసుకున్నారా? అయ్యో డిలీట్ చేయడం కుదరదు కదా అని బాధపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు మెసేజ్ చేసి రెండు రోజులు అయినా కూడా డిలీట్ చేయవచ్చు. అందుకు సంబంధించిన కొత్త ఫీచర్‌ను వాట్సాప్ త్వరలోనే తీసుకురాబోతుంది.నరేశ్-పవిత్రతో తగాదా పడిన రమ్య.. చెప్పుతో కొట్టేందుకు యత్నం! Naresh Pavitra lokesh relation: ఓ హోటల్లో బస చేస్తున్న తన భర్త-పవిత్రా లోకేష్ దగ్గరకు వెళ్లి తగాదా పడ్డారు నరేశ్ భార్య రమ్య రఘపతి. ఈ క్రమంలోనే ఆమె పవిత్రను కొట్టబోయారని తెలిసింది.జడ్డూ ఈజ్ బ్యాక్IND VS ENG Ravindra Jadeja: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బ్యాట్‌తో ఇటు బంతితో జట్టుకు కీలకమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. ఈ సందర్భంగా అతడు గతంలో భారీ ఇన్నింగ్స్ ఆడి టీమ్‌ను ఆదుకున్న సందర్భాలను తెలుసుకుందాం.