ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఅది ప్రభుత్వ వాహనమా?! హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌లో 17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఇన్నోవా కారు కీలకంగా మారింది. అయితే అది ఎవరిది.. ఎక్కడ ఉంది అనే సందేహాలను ఇప్పటివరకు పోలీసులు నివృత్తి చేయలేకపోయారు.ముగ్గురిని రిమాండ్ చేయనున్న పోలీసులురాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లిహిల్స్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటి వరకూ ఇద్దరు మైనర్లతో పాటు సాదుద్దీన్ మాలిక్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఆ ముగ్గురు నిందితులను ఈరోజు రిమాండ్‌కి తరలించనున్నారు. తప్పని నిరూపిస్తే.. రాజీనామాకు సిద్ధం KTR Comments: మంత్రి కేటీఆర్.. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించారు. పేరూరు వద్ద రూ.55 కోట్లతో ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూత్పూర్ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీబీఐ విచారణ జరిపించాలిBandi Sanjay Letter To Kcr: మైనర్ బాలికపై హైదరాబాద్‌లో జరిగిన అత్యాచారంపై సీబీఐ విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.ప్రభుత్వానికి భయమెందుకు? Bhatti on drugs: హైదరాబాద్ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులు ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసు సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వానికి భయమెందుకని భట్టి ప్రశ్నించారు.'కార్బెవాక్స్' బూస్టర్ డోసుకు ఆమోదంcorbevax vaccine india: కార్బెవాక్స్ కరోనా టీకా బూస్టర్ డోసుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఆమోదం తెలిపింది. గతంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ తీసుకున్నప్పటికీ బూస్టర్ డోసుగా తీసుకునేందుకు అనుమతి పొందింది. దేశంలో ఈ తరహా అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్‌గా కార్బెవాక్స్ నిలిచింది. మూకుమ్మడి రాజీనామా Odisha News: ఒడిశా మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. స్పీకర్ కూడా తన పదవి నుంచి తప్పుకొంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గం ఆదివారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనుంది.ఆ చట్టంపై సుప్రీంలో పిటిషన్NCM Act: మైనారిటీ చట్టం సెక్షన్ 2సీ చట్టబద్ధతను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జిల్లాస్థాయిలో మైనారిటీలను గుర్తించాలని మార్గదర్శకాలు జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఆర్మీలో చేరాలనుకునేవారికి సాయం Major movie success meet: 'మేజర్' చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. ఆర్మీలో చేరాలనుకునే యువతకు తమ వంతు సాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.ఫ్రెంచ్ ఓపెన్ స్వైటెక్ సొంతంఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ స్వైటెక్ సత్తా చాటింది. అమెరికాకు చెందిన కోకోగాఫ్ను ఓడించి మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.