ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుమూడు రోజులు ముందే వచ్చిన రుతుపవనాలు Monsoon in Kerala: నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే కేరళను తాకాయి. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈసారి మూడు రోజుల ముందుగానే వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది.సరిహద్దులో పాక్ డ్రోన్ కూల్చివేత..Pakistan drone shot down: జమ్ముకశ్మీర్, కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను కూల్చివేశాయి భద్రతా దళాలు. డ్రోన్ మోసుకొచ్చిన బాక్సులో గ్రెనేడ్లు, బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.'వారికి ఆధార్ జిరాక్స్ కాపీ ఇవ్వొద్దు' ఆధార్ కార్డు ఫొటోకాపీ ఇవ్వడంపై కేంద్రం కీలక సూచనలు చేసింది. పూర్తి ఆధార్ నంబర్ ఉన్న జిరాక్స్ కాపీని అవసరమైన చోట మాత్రమే సమర్పించాలని సూచించింది. మిగిలిన చోట్ల 12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే మాస్క్డ్ ఆధార్ ఇవ్వాలని సలహా ఇచ్చింది. మూడ్రోజులు మోస్తరు వర్షాలుRain alert in Telangana: మూడ్రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. పురి విప్పిన నెమలి నాట్యం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో భానుడి భగభగలు తగ్గాయి. రోజంతా ఉక్కపోతలో మగ్గుతున్నా.. సాయంత్రం వరకు వాతావరణం చల్లబడుతోంది. వర్షాలతో కొమ్మలు చిగురిస్తున్నాయి. పరిసరాలు పచ్చగా మారడంతో ఆహ్లదకరంగా మారాయిడ్రైవర్ దస్తగిరిపై పోలీసు కేసు.. ఎందుకంటే..!Case filed on Approver Dasthagiri: తనను చంపుతానని దస్తగిరి బెదిరించాడని ఓ వ్యక్తి తొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న డ్రైవర్ దస్తగిరిపై కేసు నమోదు చేశారు.బంగారంపై పెట్టుబడులు భద్రమేనా? Investments in gold: రెండేళ్లుగా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితిని చూస్తున్నాం. కరోనా మహమ్మారి, అంతర్జాతీయంగా కొనసాగుతున్న సంక్షోభం తదితర ఎన్నో అంశాలు పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్ సూచీలూ తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాస్త భరోసా ఉండే పెట్టుబడుల వైపు చూసేవారికి బంగారం మంచి ఎంపికగా మారుతోంది.ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్! plane air taxi: రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పెట్టేలా ఎయిర్ ట్యాక్సీలను రూపొందించింది దిల్లీకి చెందిన ఈ-ప్లేన్ అనే సంస్థ. ఇద్దరు ప్రయాణించేలా.. హెలికాప్టర్ మాదిరిగా దీన్ని తయారు చేశారు రూపకర్తలు. 2023 నాటికి దీని ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. బంగారం, వెండి ధరలు ఇలా.. Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి రూ.52,770కు చేరింది. కిలో వెండి ధర రూ.63,998 వద్ద కొనసాగుతోంది.కుర్రకారు మతిపోగొడుతున్న వర్మ హీరోయిన్లుతన సినిమాల్లో హీరోయిన్లను హాట్‌గా చూపిస్తుంటారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఈ హీరోయిన్లు రియల్ లైఫ్ కూడా అదే జోరు ప్రదర్శిస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంటారు. పూజ భలేకర్, నైనా గంగూలీ, అప్సరా రాణీలు ఈ కోవకు చెందిన వారే.