తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 3PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @ 3PM
టాప్ న్యూస్ @ 3PM

By

Published : May 26, 2022, 2:59 PM IST

  • ఐఎస్‌బీ దేశానికే గర్వకారణం

ఎస్‌బీ హైదరాబాద్‌ మరో మైలురాయి అందుకుందని ప్రధాని మోదీ అన్నారు. ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారని తెలిపారు. ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ కొనియాడారు.

  • ' అడుగుపెట్టగానే ఆ విషయం అర్థమైంది'

Modi in Hyderabad: తెలంగాణ గడ్డపై అడుగుపెట్టగానే ఇక్కడి గాలి కాషాయంవైపే వీస్తోందనే విషయం అర్థమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడి ప్రజల్లో మార్పు మొదలైందని తెలిపారు. తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరడం ఖాయమనిపిస్తోందని చెప్పారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో మోదీ ప్రసంగించారు.

  • మాజీ ప్రధానితో కేసీఆర్‌ చర్చలు

KCR Bangalore Tour: బెంగళూరు చేరుకున్న సీఎం కేసీఆర్​కు.. మాజీ సీఎం కుమారస్వామి, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. జాతీయ రాజకీయాలపై జేడీఎస్‌ నేతలతో చర్చిస్తున్నారు.

  • జైల్లో సిద్ధూకు క్లర్క్‌ ఉద్యోగం

Navjot singh sidhu clerk job: మూడు దశాబ్దాల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్ధూ.. అక్కడ క్లెర్క్​ ఉద్యోగం చేయనున్నారు. మూడు నెలల పాటు ట్రైనీగా పరిగణిస్తామని ఆ తర్వాత రోజుకు రూ.40 నుంచి రూ.90 మధ్య జీతం అందిస్తామని అధికారులు వెల్లడించారు.

  • కాంగ్రెస్​ నేతలపై సీబీఐ.. శివ సైనికులపై ఈడీ

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేపట్టాయి. మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత పరాబ్​ నివాసంపై ఈడీ దాడులు చేపట్టింది. కర్ణాటక కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​పై ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. మరోవైపు ఝార్ఖండ్​ మాజీ మంత్రికి చెందిన నివాసం, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేపట్టింది. చైనీయులకు వీసా కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది.

  • గజరాజుల భీకర ఫైట్..వీడియో వైరల్

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని శ్యామ్​పుర్​ అటవీ రేంజ్​లో రెండు గజరాజులు భీకరంగా ఘర్షణ పడుతున్న వీడియో వైరల్​గా మారింది. గత 2-3 రోజులుగా ఈ ఏనుగులు ఇలా గొడవ పడుతున్నాయని, ఒక గజరాజు దంతం విరిగిపోయిందని స్థానికులు చెప్పారు

  • పాలు ఇస్తున్న మేకపోతు

Male goat gives milk: గేదెలు, ఆవులు ,మేకలు పాలు ఇవ్వటం చూశాం. వాటిని రుచికూడా చేస్తుంటాం. కానీ.. మేకపోతు పాలివ్వటం చూశారా? అది కూడా రోజుకు లీటర్‌ వరకు! ఈ అరుదైన ఘటన విశేషాలు ఈ కథనంలో చూద్దాం.

  • పెళ్లి వ్యాను బోల్తా.. నలుగురు మృతి

కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను బోల్తా పడింది. మోపిదేవి మండలం కాశానగర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. చింతలమడ నుంచి మోపిదేవి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

  • కేఎల్ సరికొత్త రికార్డు

IPL 2022: ఐపీఎల్​లో అరుదైన రికార్డు సాధించాడు లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ కెప్టెన్ కేఎల్​ రాహుల్​. నాలుగు సీజన్లలో 600కుపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

  • 'రామారావు ఆన్‌ డ్యూటీ' ​ వాయిదా..

రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్‌ డ్యూటీ' రిలీజ్​ వాయిదా పడింది. అలాగే గోపిచంద్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న 'పక్కా కమర్షియల్‌' మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం.

ABOUT THE AUTHOR

...view details