ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుబెంగళూరుకు సీఎం కేసీఆర్.. KCR Bangalore Tour: సీఎం కేసీఆర్ బెంగళూరుకు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. కాసేపట్లో మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సీఎం సమావేశంకానున్నారు.'మోదీ జీ.. ఇవన్నీ ఎప్పుడిస్తారు?'..ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో నగరంలో పలు చోట్ల బ్యానర్లు వెలిశాయి. తెలంగాణకు కేంద్రం ఇస్తామన్న హామీలకు సంబంధించి వాటిని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తూ బ్యానర్లు కట్టారు.మోదీ క్షమాపణ చెప్పాలి.. Revanth Letter to PM Modi : తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని మోదీ అవమానించేలా మాట్లాడారని.. నేడు హైదరాబాద్‌కు వస్తోన్న ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపక్షణ చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా 9 అంశాలను ప్రస్తావిస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో భాజపా, తెరాస విఫలమయ్యాయని అన్నారు.హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఇలా..!!Vegetables Price in Hyderabad Today : హైదరాబాద్ మోడల్ రైతు బజార్ ఎర్రగడ్డలో గురువారం (26-05-22) కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి.పసుపు పండుగకు సర్వం సిద్ధం..! తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండగకు సర్వం సిద్ధమవుతోంది. రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంతో పాటు.. పొలిట్‌బ్యూరో సమావేశం సైతం ఏపీలోని ప్రకాశం జిల్లాలోనే నిర్వహించాలని నిర్ణయించడంతో ఒక రోజు ముందుగానే పండగ మొదలుకానుంది. మహానాడు సన్నాహక కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది.'మెక్‌డీ' కూల్‌డ్రింక్‌లో బల్లి..Mcdonalds lizard: కూల్ డ్రింక్‌లో బల్లి పడినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌ను అధికారులు సీజ్ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన.కుమారుడి పబ్జీ ఆటకు తల్లి బలి! PUBG Addiction: పబ్జీ.. దీనికి బానిసై అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. ఎన్నో కుటుంబాల మధ్య చిచ్చు పెడుతోంది. తాజాగా ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. పబ్జీ ఆడుతున్న కొడుకును భర్త కొడుతుండగా.. అడ్డుకోబోయిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.వాహనదారులకు బ్యాడ్ న్యూస్..third party insurance: థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. పెరిగిన ధరలు జూన్ 1న అమల్లోకి వస్తాయని పేర్కొంది.రూ.20 లక్షలకూ అమ్ముడుపోలేదు.. ఇప్పుడేమో.. IPL 2022: ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అద్భుత శతకంతో ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు రజత్ పటీదార్. తన జట్టును క్వాలిఫయర్ 2కు చేర్చాడు. అయితే ఈ యువ ఆటగాడు ఐపీఎల్ వేలం పాటలో రూ.20లక్షలకు కూడా అమ్ముడు పోలేదని మీకు తెలుసా? ఓ ప్లేయర్‌కు గాయం కారణంగా జట్టులోకి వచ్చిన పటీదార్.. అవకాశాలను అందిపుచ్చుకుని సత్తా చాటాడు. ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.వారితో డేటింగ్ భయంకరంగా ఉండేది..టాలీవుడ్ టు బాలీవుడ్లో వరస సినిమాలతో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, సహజీవనం విషయాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆమె తల్లిదండ్రులు కమల్-సారిక విడాకులపైనా స్పందించారు.