ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుప్రధాని పర్యటన షెడ్యూల్ ఇదే.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు PM Modi Hyderabad Tour: గురువారం హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. రేపు మ.1.25కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొన్న అనంతరం.. సాయంత్రం 3.55కు తిరుగు ప్రయాణం కానున్నారు. తిరుగు ప్రయాణ సమయంలో ప్రధానికి తలసాని వీడ్కోలు పలుకుతారు. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ..KTR Davos Tour: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది. దావోస్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టాడ్లర్ రైల్ అనే సంస్థ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మరోవైపు రాష్ట్రంలో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ సిద్ధమైంది.'ఆ మంత్రిపై సీఎం చర్యలు తీసుకోవాలి' MP Komatireddy: మంత్రి చేతకానితనం వల్లే నల్గొండ జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. దళితుల నుంచి 150 ఎకరాల భూమి కొనుగోలు చేసి వందల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్‌ను ఆపి చెరువులను కబ్జా చేసిన మంత్రిపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అటవీశాఖలో అవినీతి చేపలుACB raids at FRO: మరో అవినీతి అధికారులు అనిశా వలకు చిక్కారు. రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా శంషాబాద్ అటవీ శాఖ అధికారి శ్యామ్ కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనికి సంబంధించిన నివాసాల్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.గ్రామాభివృద్ధికి అప్పులు చేసిన సర్పంచ్.. చివరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాభివృద్ధికి కృషి చేశారు ఆ సర్పంచ్. చేతిలో రూపాయి లేకపోయినా అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. బిల్లులు వస్తే తీర్చుదామన్న ఆశతో ఉన్నారు. ఎన్నిరోజులైనా రాకపోయేసరికి పుస్తెల తాడు అమ్మి కొన్ని అప్పులు తీర్చారు. ఇక ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో గత్యంతరం లేక ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఓ సర్పంచ్ పరిస్థితి ఇది.చిదంబరం మెడకు మరో ఉచ్చు.. Chinese visa scam: చైనీస్ వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరం చుట్టూ ఈడీ ఉచ్చు బిగుసుకుంటోంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా జాతీయులకు వీసాలు పొందడంలో సహాయం చేశారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసుకుంది.లక్కీ మహిళ... ఒక్కసారిగా లక్షాధికారి... వజ్రాల మైనింగ్ కోసం ప్రయత్నించి సఫలమయ్యారు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ. ఈ ఏడాది మార్చిలో మైన్ లీజుకు తీసుకోగా.. తాజాగా 2.08 క్యారెట్ల వజ్రం బయటపడింది. దీని విలువ రూ.10 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.యాసిన్ మాలిక్ కోసం పాక్ కుళ్లు రాజకీయంPak Letter To UNO: జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను తక్షణమే నిర్దోషిగా ప్రకటించి.. జైలు నుంచి విడుదల చేయాలని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. ఐరాస మానవహక్కుల హైకమిషనర్‌కు లేఖ రాశారు. కశ్మీరీలను తప్పుడు కేసుల్లో ఇరికించడానికి భారత్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.ఆయన అంటే ఎప్పటినుంచో క్రష్ 'పుష్ప'తో నేషనల్ క్రష్‌గా మారారు నటి రష్మిక. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆమె బాలీవుడ్, దక్షిణాదిలో వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు. దీంతో అమితాబ్ బచ్చన్, విజయ్, రణ్‌బీర్ కపూర్ లాంటి స్టార్ హీరో సినిమాల్లో నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. కాగా, తాజాగా రష్మిక ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రాలపై ముచ్చటించారు.కొత్త సినిమాల కబుర్లుకొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. దుల్కర్ సల్మాన్ 'సీతారామం' విడుదల తేదీ ఖరారైంది. వెంకటేశ్,వరుణ్‌తేజ్ 'ఎఫ్ 3' మూవీ మేకింగ్ వీడియో కూడా రిలీజ్ అయి తెగ నవ్వులు పూయిస్తోంది. ఇక కమల్‌హాసన్ 'విక్రమ్' సినిమా నుంచి ఓ కొత్త పాటను షేర్ చేశారు మేకర్స్. శివకార్తికేయన్ నటించిన 'డాన్' మూవీ కలెక్షన్ల పరంగా రూ.100కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది.