ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుతెరాస రిమోట్ భాజపా చేతిలో ఉంది.. Rahul Gandhi on TRS, BJP: తెరాసతో పొత్తు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. పొత్తుల గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తామని హెచ్చరించారు. తెరాస, భాజపాతో అనుబంధముండే వాళ్లు కాంగ్రెస్‌లో ఉండొద్దని సూచించారు. తెరాసపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.'వరంగల్ డిక్లరేషన్ కచ్చితంగా అమలవుతుంది..Rahul Gandhi Comments: తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్... వరంగల్ డిక్లరేషన్ కచ్చితంగా అమలవుతుందని ప్రకటించారు.అభివృద్ధి ముఖ్యమే కానీ.. ktr latest news: నీరు, పారిశుద్ధ్యం, హైజీన్ వంటి అంశాలు భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబోతున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పురపాలకశాఖ ఆధ్వర్యంలో శానిటేషన్, హైజీన్‌లో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ జరిగిన ఇంక్ ఎట్ వాష్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. చేసే పనులు ఇవే..revanth reddy declaration speech: హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. 'వరంగల్ డిక్లరేషన్' ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. చేసే అభివృద్ది పనుల గురించి ప్రసంగించారు. అవేంటో ఓసారి చూసేయండి.ముగిసిన అంత్యక్రియలు.. Protest: ఏపీలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని రీ-పోస్టుమార్టం అంత్యక్రియలు ముగిశాయి. అయితే.. మృతదేహాన్ని పోలీసులు అడ్డదారిలో తరలించడంపై బంధువులు, స్థానికులు పోలీసులను నిలదీశారు. దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మృతురాలి తరఫు బంధువులు తేజస్విని మృతికి కారకుడిగా భావిస్తున్న సాధిక్ ఇంటి తలుపులు పగులగొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.'రూ.2500 కోట్లు ఇస్తే సీఎం నువ్వే'..Basanagouda Patil Yatnal: కర్ణాటక భాజపా ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండున్నరవేల కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రిని చేస్తామంటూ కొంతమంది తనను సంప్రదించినట్లు బహిర్గతం చేశారు.పిల్లలకు విషమిచ్చి ఉరి వేసుకున్న భార్యాభర్తలు.. ఛత్తీస్గఢ్లో ఓ కుటుంబం లాడ్జికి వెళ్లి బలవన్మరణానికి పాల్పడింది. భార్యాభర్తలు మొదట తమ పిల్లలకు విషమిచ్చారు. అనంతరం వారు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.మార్కెట్లపై వడ్డీ రేట్ల దెబ్బ..Stock Market Today: స్టాక్ మార్కెట్లు శుక్రవారం సెషన్లో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 867 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 271 పాయింట్లు క్షీణించింది. ఐటీ, రియల్ ఎస్టేట్, మెటల్ షేర్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలు చవిచూడడం.. దేశీయ విపణులపైనా ప్రతికూల ప్రభావం చూపింది. ఇటీవల ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచడమూ ఇందుకు కారణమైంది.పాత జట్లకు కొత్త చిక్కులు.. IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్ దాదాపు సగానికి పైగా పూర్తయ్యింది. కానీ ఐపీఎల్లో మెరుగైన రికార్డు కలిగిన జట్లు సైతం ఈసారి నిరాశపరిచాయి. ఈ జట్లలో ప్రధాన సమస్య సరైన బౌలర్లు లేకపోవడమే. మరి జట్లకు దూరమైన బౌలర్లు ఎవరు ఎవరో చూద్దాం!'విరాట పర్వం' రిలీజ్ డేట్ వచ్చేసింది..ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విరాట పర్వం' సినిమా విడుదల తేదీని ఎట్టేకేలకు ప్రకటించింది చిత్ర బృందం. ఆర్ఆర్ఆర్ సినిమాలోని మోస్ట్ అవైటెడ్ సాంగ్.. ‘కొమురం భీముడో’ ఫుల్ వీడియో వచ్చేసింది.