ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు హైకోర్టును ఆశ్రయించిన ఎన్ఎస్యూఐ ఓయూలో రాహుల్‌గాంధీ ముఖాముఖి కోసం ఎన్ఎస్యూఐ హైకోర్టును ఆశ్రయించింది. హౌజ్‌మోషన్ విచారణకు అనుమతివ్వాలని పిటిషనర్ల తరపున న్యాయవాది కోరారు. జంట హత్య కేసు.. అతడే హంతకుడుAbdullapurmet Double Murder Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ నగర శివారులో జంట హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యలకు కారణం వివాహేతర సంబంధమేనని అనుమానించిన పోలీసులు విచారణలో అసలు కారణాన్ని నిర్ధరించారు. రైతు బతుకు కన్నీటిపాలు ఆరుగాలం కష్టమంతా వృధా అయింది. రాత్రింబవళ్లు పడిన శ్రమంతా నీటిపాలైంది. అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. వరణుడి ప్రకోపం.. రైతులకు తీరని శోకాన్ని కలిగించింది.ఆర్బీఐ షాక్.. వడ్డీ రేట్లు పెంపు.. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకపోయినా.. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మండుటెండలో 26 ఏళ్లుగా అదే పని..! Amravati waterman: మండుటెండలో అడవి మార్గంలో ప్రయాణించే చిరు వ్యాపారుల కోసం 26 ఏళ్లుగా జలయజ్ఞం చేస్తున్నాడు ఓ సామాన్యుడు. వేసవిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలోనే ఉండి.. అటువైపు వచ్చేవారికి చల్లటి మంచి నీరు అందిస్తున్నాడు. మూగ జీవాల కోసం నీటి తొట్టెలు నిర్మించి.. వాటి దాహార్తిని తీర్చుతున్నాడు.కడుపులో 109 హెరాయిన్ క్యాప్సూల్స్.!డబ్బు సంపాదన కోసం ఎన్నో అక్రమ మార్గాలు. అందులో ఒకటి డ్రగ్స్ రవాణా. పోలీసులు, అధికారులు ఎంత నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి దేశాలు దాటిస్తూనే ఉన్నారు. బ్యాగులు, ప్యాకెట్లు ఇలా ఒకటేమిటి.. నానా మార్గాల్లో వాటిని సరఫరా చేస్తూనే ఉన్నారు. పీఎస్‌లోనే మైనర్‌పై అత్యాచారం.. lalitpur minor rape: మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు వ్యక్తులు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌లో జరిగింది. నిందితుల్లో పోలీసు ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు.ఆ షేర్లన్నీ కొనేశారుLIC IPO Responce: బుధవారం ప్రారంభమైన ఎల్ఐసీ ఐపీఓకు విశేష స్పందన లభిస్తోంది. పాలసీదారుల విభాగానికి కేటాయించిన షేర్లన్నీ సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. తొలి రెండు గంటల్లోనే దాదాపు మూడింట ఒక వంతు షేర్లకు సభ్యత్వం పొందారు పెట్టుబడిదారులు.ఓటీటీలో 'బీస్ట్'.. సూర్య గోవా ప్లాన్ మరికొన్ని సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో 'బీస్ట్' ఓటీటీ, సూర్య 41, సామ్ 'యశోద్', వెంకీమామ 'ఎఫ్ 3' చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు..33ఏళ్ల తర్వాత రిటర్న్ Sunil Gavaskar Mumbai plot: క్రికెట్ అకాడమీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్లాట్‌ను 33 ఏళ్ల తర్వాత తిరిగి ఇచ్చేశారు బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్. అకాడమీ నెలకొల్పాలన్న ప్రయత్నాలు విఫలం కావడం వల్ల.. ఠాక్రే సర్కారు అభ్యర్థన మేరకు ప్లాట్‌ను రిటర్న్ ఇచ్చారు.