తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @ 9PM
టాప్ న్యూస్ @ 9PM

By

Published : May 3, 2022, 8:59 PM IST

  • లాభాల్లో ఉన్న సంస్థను ఎలా అమ్ముతారు..?'

KTR on Pawan Hans: పవన్ హన్స్ సంస్థ విక్రయంపై కేంద్రానికి కేటీఆర్ ప్రశ్నలు వేశారు. 3వేల కోట్ల సంస్థను.. కేవలం లక్ష మూలధన సంస్థకు అమ్మడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు.

  • అక్షయ తృతీయ వేళ.. పసిడి దుకాణాలు కళకళ

akshaya tritiya gold shops rush: అక్షయ తృతీయ పర్వదినాన బంగారాన్ని కొనుగోలు చేస్తే... సంపద పెరుగుతుందన్నది అనేక మంది విశ్వాసం. కొందరైతే తమకు నచ్చిన నగలను నెల రోజుల ముందుగానే బుక్ చేసుంటారు. కొవిడ్ మహమ్మారి వల్ల వెలవెలబోయిన అక్షయ తృతీయ అమ్మకాలు.. ఈసారి జోరుగా సాగుతున్నాయి. నగరంలోని అనేక నగల దుకాణాలను కొనుగోలుదారులతో సందడిగా మారాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

  • నగర శివారులో జంట దారుణ హత్య..

murders at kothagudem: హైదరాబాద్ శివారులో జంట మృతదేహాలు లభ్యం కావడం కలకలం సృష్టించింది. అబ్దుల్లాపూర్ ​మెట్​ పీఎస్ పరిధిలోని కొత్తగూడెం వద్ద మృతదేహాలను పోలీసులు గుర్తించారు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

  • 'త్వరలో పాదయాత్ర చేపడతా.. దమ్ముంటే ఆపండి'

KA PAUL FIRE ON TRS:తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విరుచుకుపడ్డారు. తనపై దాడి చేయించింది డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్ అని ఆరోపించారు. తాను వస్తున్నానని... ఇకపై తెలంగాణలో కేసీఆర్‌ ఆటలు సాగవని పేర్కొన్నారు.

  • రాష్ట్రంలో రంజాన్ సందడి

Ramadan Celebrations 2022: రాష్ట్రవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తిశ్రద్ధలతో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం.. శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని కేసీఆర్ అన్నారు.

  • ' తక్షణం కాల్పుల విరమణ జరగాలి'

PM Modi News: ఐరోపా పర్యటనలో భాగంగా రెండో రోజు డెన్మార్క్ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్​సెన్​తో ఆమె నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తమ భేటీలో ఉక్రెయిన్ అంశం సైతం ప్రస్తావనకు వచ్చిందన్న మోదీ... వెంటనే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ పాటించాలని విజ్ఞప్తి చేశారు

  • నైట్​క్లబ్​లో రాహుల్ గాంధీ.. వీడియో వైరల్​.. !

Rahul Gandhi at nightclub: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. నేపాల్​లో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించి రాహుల్ ఓ నైట్​క్లబ్​లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై భాజపా నేతలు విమర్శలకు దిగగా.. కాంగ్రెస్ వారికి దీటుగా బదులిచ్చింది.

  • పరాగ్​కు ఉద్వాసన తప్పదా?

Elon Musk twitter: ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలాన్​ మస్క్ సంస్థలోని​ పలువురికి ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. ట్లిట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, ట్విట్టర్​ లీగల్‌ హెడ్‌ విజయ్​ గద్దెను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం యాజమాన్యంపై ఎలాన్​ మస్క్​కు ఏమాత్రం విశ్వాసం లేదని సంస్థ ఓ ఉన్నతాధికారి తెలిపారు.

  • బెస్ట్ ఫిల్మ్​గా 'జై భీమ్'... మాల్​లో విశ్వక్ డ్యాన్సులు..

MOVIE UPDATES: సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. జై భీమ్​కు బెస్ట్ ఫిల్మ్ అవార్డు, విశ్వక్ సేన్ విజయవాడలో చేసిన సందడి వంటి విశేషాలతో పాటు.. మేజర్, డేగల బాబ్జీ, యశోద చిత్రాల అప్డేట్స్ ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

  • ఐపీఎల్ ప్లేఆఫ్ షెడ్యూల్​లో మార్పులు..!

IPL playoffs 2022: ఐపీఎల్ ప్లేఆఫ్స్​ షెడ్యూల్​లో స్వల్ప మార్పులు చేసింది బీసీసీఐ. ఫురుషుల ఎలిమినేటర్‌ మ్యాచ్‌ను 26 నుంచి 25 తేదీకి మారుస్తూ తాజా షెడ్యూల్‌ విడుదల చేసింది. మరోవైపు, వంద శాతం మంది అభిమానులతో ప్లేఆఫ్స్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. మహిళల టీ20 టోర్నీపైనా అప్డేట్ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details