తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news:టాప్ న్యూస్ @ 5PM - టాప్​ న్యూస్ ఇన్ తెలంగాణ

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news
టాప్ న్యూస్ @ 5PM

By

Published : Apr 23, 2022, 4:59 PM IST

  • 'కేంద్రమే నిధులిస్తే.. కర్ణాటకలో ఎందుకు లేవు?'

Minister Harish Rao: కేంద్రం ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా లెక్కచేయడం లేదని మంత్రి హరీశ్​ రావు మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన మొత్తం రూ.7,183 కోట్లు తక్షణం కేంద్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్రలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

  • నాణ్యమైన సేవలందించేందుకే డిజిటలీకరణ

Gangula review On Digitalization: ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకే చౌక ధరల దుకాణాల్లో డిజిటలీకరణ చేపడుతున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ అంశంపై మంత్రి అధికారులతో హైదరాబాద్​లో సమీక్ష నిర్వహించారు. ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

  • హైదరాబాదీ హలీమ్.. తింటే వదలరంతే!

హలీమ్‌.. ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరికీ నోరూరాల్సిందే. నవాబుల డైనింగ్ టైబుల్ మీద ఒకప్పుడు గర్వంగా నిలిచిన హలీమ్‌.. ఇప్పుడు గరీబులకూ ఫేవరెట్ డిష్‌గా మారింది. అంతేకాదు రుచిలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న హలీమ్‌... జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌ని కూడా సొంతం చేసుకుంది.

  • ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలు.!

TSRTC Meeting on Compassionate appointments: టీఎస్​ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. వారం రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎనిమిదేళ్ల తర్వాత సమావేశమైన ఆర్టీసీ పాలకవర్గం 300 అంశాలపై విస్తృత చర్చ చేపట్టింది. కారుణ్య నియామకాల ద్వారా దాదాపు 1200 మందికి లబ్ధి చేకూరనుంది.

  • 'హైకోర్టుల్లో త్వరలోనే స్థానిక భాషల అమలు.. కానీ!'

CJI N V Ramana: దేశంలోని వివిధ హైకోర్డుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టటంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి. రమణ. త్వరలోనే శాస్త్ర సృజనాత్మకత, కృత్రిమ మేధ ద్వారా అది సాధ్యమవుతుందని, కానీ, కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని పేర్కొన్నారు. చెన్నైలో హైకోర్టు పరిపాలన భవన నిర్మాణానికి సీఎం స్టాలిన్​తో కలిసి శంకుస్థాపన చేశారు.

  • సీబీఎస్​ఈ సిలబస్​లో 'ప్రజాస్వామ్యం' చాప్టర్ కట్..

CBSE drops chapters on Democracy: ప్రజాస్వామ్యం, అలీనోద్యమం వంటి ప్రధాన చాప్టర్లను సిలబస్ నుంచి తొలగించింది సీబీఎస్ఈ. పారిశ్రామిక విప్లవం, ఇస్లాం రాజ్యాల ఆవిర్భావం, లౌకికవాదానికి సంబంధించిన పలు అంశాలను పక్కనబెట్టింది. ఎందుకంటే?

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

Road accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రూజర్​- ట్రక్కు పరస్పరం ఢీకొనగా ఏడుగురు మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాతూర్​- అంబాజోగాయీ రహదారిపై ఈ ఘటన జరిగింది.

  • ఆ కార్ల ధరలు మరింత ప్రియం

Tata Motors prices hike: ప్రయాణికుల వాహన ధరలను మరోసారి పెంచింది టాటా మోటార్స్​. నిర్వహణ వ్యయాలు, ముడిపదార్థాల ధరల పెరుగుదల వల్ల ఈ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయక తప్పడంలేదని పేర్కొంది.

  • 'నటి కావాలని అనుకోలేదు.. స్టూడియోలో ఫ్లోర్స్ క్లీన్‌ చేశా'

Raveena Tandon: తాను నటిగా కెరీర్‌ ప్రారంభించడానికంటే ముందు స్టూడియోలో ఫ్లోర్స్ శుభ్రం చేశానని చెప్పారు బాలీవుడ్​ నటి రవీనా టాండన్​. ఇటీవలే విడుదలైన 'కేజీయఫ్​ 2' సినిమాలో రమికా సేన్​గా నటించి మెప్పించిన ఆమె.. తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తెలిపారు. అవి ఆమె మాటల్లోనే..

  • కోల్​కతా బౌలింగ్

కోల్‌కతాతో మ్యాచ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇంతకుముందు మ్యాచ్‌లో గాయం కారణంగా ఆడలేని అతడు మళ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ టాప్‌లోకి వెళ్లాలని చూస్తోంది. మరోవైపు కోల్‌కతా ఏడో స్థానంలో ఉండగా ఈరోజు విజయం సాధించి ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details