ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుప్రముఖ రచయిత కందికొండ కన్నుమూత ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. వెంగళరావునగర్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు.సభలో విరిసిన నవ్వులు.. పడిపడి నవ్విన కేటీఆర్.. telangana Assembly session: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభలో "మన ఊరు- మన బడి" కార్యక్రమంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా.. సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. రాష్ట్రంలో పాఠశాలలకు సంబంధించిన నిధుల గురించి మొదలైన చర్చ కాస్తా.. 2009-14 సమయంలోని సభా పరిస్థితులపైకి మళ్లింది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క వివరించిన తీరు సభ్యులకు నవ్వు తెప్పించింది.అందుకే ఆ మాత్రలను పడేస్తున్నారు: Governor Tamilisai visit Bibinagar AIIMS : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్‌ను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సందర్శించారు. 2021 - 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోర్ట్ సెర్మని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎయిమ్స్ అధికారులు బీబీ నగర్ ఎయిమ్స్ ప్రగతి రిపోర్ట్‌ను వీడియో ద్వారా వివరించారు.'అందుకోసం వక్ఫ్ బోర్డు స్థలాలిచ్చేందుకు సిద్ధం..'నూతన పండ్ల మార్కెట్ నిర్మాణమయ్యే వరకు వ్యాపారుల కోసం తాత్కాలిక మార్కెట్ నిర్మించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. అందుకోసం వక్ఫ్ బోర్డు తరఫున 30 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సభలో స్పష్టం చేశారు.పోడు రైతుపై అటవీ అధికారుల దాడి forest officials attack on podu farmer: తమ పొలంలో కందకాలు తవ్వొద్దని చెప్పినందుకు.. ఓ రైతుపై దాడి చేశారు అటవీశాఖ అధికారులు. కార్యాలయానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి.. మూత్రం తాగించేందుకు యత్నించారని బాధితులు వాపోయారు. మహబూబాబాద్ జిల్లా పుట్టల భూపతి గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.కశ్మీర్లో సర్పంచ్‌పై ఉగ్రదాడి.. attack on sarpanch kashmir: జమ్ము కశ్మీర్లో సర్పంచ్‌లకు పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు అక్కడి ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో సురక్షితమైన వసతి సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, శనివారం మరో సర్పంచ్‌పై దాడి జరిగింది.ల్యాండింగ్‌లో అపశృతి Flight skids off runway: ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ విమానం రన్‌వే పైనుంచి పక్కకు జరిగింది. జబల్పుర్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు.ఆరేళ్ల బాలికపై అత్యాచారంUP MINOR RAPE: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకునేందు వెళ్లగా.. వారిపై కాల్పులు జరిపాడు.'ఆంక్షలు ఎత్తివేయకపోతే.. ఐఎస్ఎస్ కూలిపోవచ్చు!' అమెరికా, కెనడా, యూరప్ దేశాల నుంచి రష్యా కఠిన ఆంక్షలు ఎదుర్కొంటోంది. అవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మీద కూడా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆంక్షలు ఎత్తివేయాలని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ డైరెక్టర్ దిమిత్రి రోజోజిన్ పిలుపునిచ్చారుఝులన్ గోస్వామి రికార్డుJhulan Goswami: టీమ్ఇండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి మరో అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది.