ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. minister Srinivas goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ హత్యకు సుపారీ గ్యాంగ్‌తో కుట్రపన్నినట్లు తెలిపారు. అయితే మంత్రి హత్య కుట్రను భగ్నం చేసి.. నలుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.తెరాస శ్రేణుల ట్వీట్లు ట్రెండింగ్..Twitter Trending: తెరాస శ్రేణుల ట్వీట్లు మరోసారి ట్రెండింగ్‌లో నిలిచాయి. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రికార్డు స్థాయిలో నమోదైన సందర్భంగా తెరాస శ్రేణులు.. థాంక్యూ కేసీఆర్‌తో పాటు ట్రయంప్ తెలంగాణ హాష్ ట్యాగ్‌లతో భారీ సంఖ్యలో ట్వీట్లు చేయగా ట్విటర్లో ట్రెండింగ్‌గా నిలిచాయి.కేసీఆర్ మూలాలు బిహార్‌లో ఉన్నాయ్.. Revanth reddy on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్.. బిహార్ ఐఏఎస్‌లను రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకుని పరిపాలన చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. పరిపాలనలో వారి తప్పుడు పనులతో రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.క్లాస్‌రూంలో క్రికెట్.. ఒకరు మృతి..Student Died in school: తరగతి గదిలో విద్యార్థులు సరదాగా ఆడిన పేపర్ బాల్ క్రికెట్.. ఒకరిని పొట్టనబెట్టుకుంది. నలుగురు విద్యార్థులు ఆడిన ఈ ఆటలో.. చిన్న విషయంలో వివాదం తలెత్తి ఒకరినొకరు కొట్టుకునే వరకు చేరింది. ఈ దాడిలో ఓ విద్యార్థి ఏకంగా ప్రాణాలే కోల్పోయారు.యుద్ధంపై పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.. Pawan kalyan tweet: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. శాంతి, యుద్ధంపై తనదైన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు.భారతీయుల తరలింపునకు ఏ అవకాశాన్నీ వదల్లేదు..Ukraine crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మార్చి 7న యూపీలో చివరి విడత ఎన్నికలు జరగనున్న సోన్‌భద్ర జిల్లాలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.ఇక పూర్వాంచల్ సమరం.. మిత్రపక్షాల సత్తాకు పరీక్ష.. UP assembly Election sixth phase: ఉత్తర్‌ప్రదేశ్‌లో 292 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు ముగిశాయి... యూపీ సమరం పూర్వాంచల్ వైపు మళ్లింది... భాజపా, ఎస్పీ పార్టీలు తమ మిత్రపక్షాలపై ఆశలు పెట్టుకుంటుండగా... 111 సీట్లకు నెలవైన పూర్వాంచల్‌లో ఎవరు పట్టు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో 57 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి..Russia Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతోన్న బాంబు దాడుల్లో కర్ణాటకకు చెందిన విద్యార్థి మృతిచెందిన ఘటన మరవకముందే మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. భారత్‌కు చెందిన మరో విద్యార్థి అనారోగ్యంతో ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఐపీఎల్లో 25% ప్రేక్షకులకు అనుమతి.. IPL 2022: ఐపీఎల్ నిర్వహణపై బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో బీసీసీఐ చర్చించింది. మొదటి దశకు 25 శాతం ప్రేక్షకులను అనుమతిచ్చింది. మరోవైపు ఐపీఎల్ జట్లన్నీ మార్చ 8లోపు ముంబయి చేరుకుంటాయి. 14నుంచి సాధన ప్రారంభిస్తాయి.రాధేశ్యామ్ రిలీజ్ ట్రైలర్ అదుర్స్..Radhe shyam release date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రం నుంచి రెండో ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో పెళ్లి ఎందుకు కాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చారు ప్రభాస్.