తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 9PM - టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @ 9PM
టాప్ న్యూస్ @ 9PM

By

Published : Feb 25, 2022, 8:59 PM IST

  • 1000 మంది సైనికులు మృతి

Russia-Ukraine conflict: ఉక్రెయిన్​కు చెందిన కీలక విమానాశ్రయం తమ అధీనంలోకి వచ్చినట్లు ప్రకటించింది రష్యా. దీంతో కీవ్​ నగర శివార్లలో ఉన్న బలగాల్ని రాజధానికి తరలించడం రష్యాకు మరింత సులువు కానుంది. మరోవైపు.. ఇప్పటి వరకు 1000 మంది రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్​ ప్రకటించింది.

  • భీకర పోరు.. చర్చల దిశగా అడుగులు!

క్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండోరోజు మరింత భీకరంగా సాగుతోంది. పలు నగరాలు, సైనిక స్థావరాలపై 3 వైపుల నుంచి దాడులు చేసేందుకు పదాతిదళాలు, యుద్ధట్యాంకులను పంపింది. రాజధాని కీవ్‌, రెండో పెద్దనగరం ఖర్కివ్‌ తదితర పట్టణాల్లోకి ప్రవేశించిన పుతిన్‌ సేనలు ఉక్రెయిన్ బలగాలు మధ్య పోరు ఉద్ధృతంగా సాగుతోంది.

  • భారతీయుల కోసం ఫ్రీగా ప్రత్యేక విమానాలు

Indian evacuation from Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం. ఇందుకోసం ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరీకి మూడు ప్రత్యేక విమానాలు పంపుతోంది. రోడ్డు మార్గాల ద్వారా సరిహద్దులకు చేరుకున్నవారిని విమానాశ్రయాలకు తరలించి.. అక్కడి నుంచి భారత్​కు తీసుకురానున్నారు.

  • స్వదేశానికి రాలేక విద్యార్థుల అవస్థలు

Khammam district students in Ukraine: ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో యుద్ధభూమిపై భీకర పరిస్థితులు నెలకొన్నాయి. వరుస క్షిపణి దాడులతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. విద్య, ఉద్యోగాల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వెళ్లిన విద్యార్థులు, యువత పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సొంతూళ్లకు వచ్చే దారిలేక.. అక్కడ సురక్షిత వాతావరణం లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

  • హైకోర్టు కీలక తీర్పు

Registrations In Unauthorized Layouts: అనుమతి లేని లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అనధికార లేఅవుట్లలోని ప్లాట్లనూ షరతులతో రిజిస్ట్రేషన్లు చేయాలని సబ్​రిజిస్ట్రార్లను ఆదేశించింది.

  • 'దేశ రక్షణకు అదే కీలకం'

PM Modi on Defence Sector: దేశ రక్షణకు సైబర్​ భద్రతే కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బలీయమైన సమాచార సాంకేతిక (ఐటీ) రంగమే భారత్​ బలమన్న మోదీ.. రక్షణ వ్యవస్థలో ఐటీ పరిజ్ఞాన వినియోగాన్ని మరింత పెంచాలని సూచించారు. రక్షణ మంత్రిత్వ శాఖ పోస్ట్​-బడ్జెట్​ వెబినార్‌లో పాల్గొన్న మోదీ.. రక్షణ దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

  • సిరిసిల్లలో 'టెక్స్‌పోర్ట్'

Texport Factory in Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అపారెల్​ పార్క్​లో బెంగళూరుకు చెందిన 'టెక్స్​పోర్ట్'​ కంపెనీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రెడిమేడ్ దుస్తుల వ్యాపారంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. సిరిసిల్లలో రూ.60 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మాణం చేయనుంది. దీంతో సుమారు రెండు వేల మందికి ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంది.

  • భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold price today: రష్యా- ఉక్రెయిన్​ యుద్ధంతో పసిడి ధరలో భారీ పెరిగాయి. గురువారం.. 10 గ్రాముల బంగారం ధర రూ.52 వేలు మార్కును దాటింది. వెండి ధరలోనూ భారీగా మార్పులు జరిగాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

  • 'భీమ్లా నాయక్' సక్సెస్​పై చిరు ట్వీట్

Bheemla nayak chiranjeevi: 'భీమ్లా నాయక్' థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో పవన్​ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్​లో కంగ్రాచ్యూలేషన్స్ చెప్పారు. పవర్​ తుపాన్ అంటూ రాసుకొచ్చారు.

  • ఐపీఎల్​లో కొత్త ఫార్మాట్..

ఐపీఎల్​ను ఈసారి సరికొత్త ఫార్మాట్​లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గ్రూప్స్​కు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. కొత్త జట్టు లక్నో సూపర్​ జెయింట్స్​కు గ్రూప్​ ఏలో చోటు దక్కగా.. మరో కొత్త టీమ్​ గుజరాత్​ టైటాన్స్​ గ్రూప్​ బీలో స్థానం సంపాదించింది.

ABOUT THE AUTHOR

...view details