ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుమంత్రి కాళ్ల మీద పడిన రైతులు.. Minister Niranajan Reddy: నేలరాలిన మిరప కాయలను చూపిస్తూ.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ..ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు మంత్రి నిరంజన్ రెడ్డిన కాళ్ల మీద పడ్డారు. జిల్లాలో ఇటీవల నష్టపోయిన ప్రాంతాల్లో స్థానికమంత్రి ఎర్రబెల్లితో కలిసి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. పరకాల మం. నాగారంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు.పాలమూరులో 900 పడకల ఆస్పత్రి.. Harish Rao Inaugurated Balanagar CHC: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.డోసుల మధ్య గడువు తగ్గించండి.. Harish Rao Letter to Central Minister: రెండో, బూస్టర్ డోసు మధ్య గడువు తగ్గించాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రికి హరీశ్‌రావు లేఖ రాశారు.గతతంత్ర వేడుకలపై ఉగ్రకుట్ర.. Republic Day 2022: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని గణతంత్ర దినోత్సవం నాడు భారీ ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నాయని నిఘా సంస్థల సమాచారం. ప్రజా సమూహాలు, రద్దీ ప్రదేశాలను, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగొచ్చని తెలుస్తోంది.ఐదుసార్లు టీకా తీసుకున్న వైద్యుడు.. Bihar Doctor Vaccine News: బిహార్‌లోని ఓ సివిల్ సర్జన్ 5 సార్లు వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.ఫోన్‌ను మింగిన ఖైదీ.. ఆ తర్వాత.. Jail inmate swallowed mobile: తిహాడ్ జైలులో ఓ ఖైదీ సెల్‌ఫోన్ మింగేశాడు. అధికారులకు తెలియకుండా ఫోన్‌ను వాడుతున్న ఆ వ్యక్తి.. తనిఖీల్లో దొరికిపోయాడు. దీంతో అమాంతం ఫోన్‌ను మింగేశాడు. పది రోజుల పాటు ప్రయత్నించి ఆపరేషన్ అవసరం లేకుండానే ఫోన్‌ను బయటకు తీశారు వైద్యులు.జోరుగా హిమపాతం.. Winter Storm USA: అమెరికా తూర్పు తీరాన్ని హిమపాతం వణికిస్తోంది. న్యూయార్క్, ఓహియో, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో అడుగుల మేర మంచుదుప్పటి పరుచుకుంది. ఎక్కడ చూసినా మంచు మాత్రమే కనిపిస్తోంది. మసాచుసెట్స్, కనెక్టికట్, రోడ్ ఐలాండ్‌లను మంచు వర్షం భయపెడుతోంది.ఆ కార్ల ధరలు ప్రియం.. Tata Car Price Hike: టాటా కార్లు మరింత ప్రియం కానున్నాయి. జనవరి 19న ధరలు స్వల్పంగా సగటున 0.9 శాతం మేర పెరగనున్నట్లు టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది.తాగి రచ్చ చేసిన క్రికెటర్లు.. AUS vs ENG: యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ ఆనందంలో కొందరు క్రికెటర్లు శ్రుతిమించి మద్యం సేవించి హోటల్ గదిలో అల్లరి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.ఆ కేసులో పూనమ్ పాండేకు ఊరట.. Poonam Pandey Pornography Case: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు ఊరట లభించింది. ఆమెకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది.