ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుపిల్లలను చంపిన జవాన్ ఆత్మహత్య మహబూబాబాద్ జిల్లాలో సీఐఎస్ఎఫ్ జవాన్ ఘటన విషాదాంతంగా ముగిసింది. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలను బావిలో పడేసి చంపిన సీఐఎస్ఎఫ్ జవాన్ తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలి RJD Leaders meet kcr: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో.. బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ భేటీ అయ్యారు. భాజపాపై వ్యతిరేక పోరాటం, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్‌ను తేజస్వీ యాదవ్ కోరారు. ఇందుకు ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్ధతు ఉంటుందన్నారు.అందుకే థర్డ్ ఫ్రంట్ Bandi Sanjay On CM KCR: కేసీఆర్ అతిపెద్ద అవినీతి తిమింగలమని.. ఆయనపై కచ్చితంగా విచారణ జరిపి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. అవినీతి కేసులు బయటపడతాయన్న భయంతోనే థర్డ్ ఫ్రంట్ పేరుతో చర్చలకు తెరలేపారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన నిరసన సభలో ఆయన మాట్లాడారు. 'కాంగ్రెస్‌ను మించింది లేదు' Revanth reddy On KTR: సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, రుణమాఫీ, పెట్టుబడి రాయితీ, పంటలకు మద్దతు ధర, సాగు పనిముట్లు, పౌల్ట్రీ పరిశ్రమకు రాయితీలు, ఏడు గంటల విద్యుత్ సరఫరా సహా ఏ అంశంపైనైనా.. తెరాస ప్రభుత్వంతో చర్చకు సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతులకు రూ.70 వేల కోట్ల రుణాలను ఏకకాలంలో మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని రేవంత్‌రెడ్డి చెప్పారు. కొత్తగా 1920 కరోనా కేసులు రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,153 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1920 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 50 లక్షల మందితో మోదీ '3డీ' సభ! Modi digital rally in UP: ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్చువల్ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభకు అధునాతన సాంకేతికతతో కొత్త హంగులు అద్దుతున్నారు కమలనాథులు. వందలాది చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసి.. మోదీ ప్రసంగాన్ని త్రీడీ ప్రొజెక్షన్లో లైవ్ ప్రసారం చేయనున్నారు.దేశంలో తగ్గిన కరోనా కేసులు India Corona cases: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 1.68లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌తో మరో 277 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతానికి తగ్గింది.ఏపీ, తెలంగాణలో బంగారం ఇలా.. Gold Price Today: భారత్‌లో పది గ్రాముల మేలిమి పుత్తడి రూ.48,660గా ఉంది. కిలో వెండి ధర రూ.64 వేల పైన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.ఆర్జీవీ ట్వీట్ల వర్షం ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఏకంగా గంటలో 24 ట్వీట్లు చేయడం ఆసక్తిగా రేకెత్తిస్తోందికొత్త ఫ్రాంఛైజీలకు లైన్ క్లియర్ IPL 2022: ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశారు. కాగా, కొత్త ఫ్రాంఛైజీలు లఖ్‌నవూ, అహ్మదాబాద్‌కు బీసీసీఐ ఫార్మల్ క్లియరన్స్ ఇచ్చినట్లు తెలిపారు.