ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు కూలిన 70 అడుగుల లుమినార్ కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. చొప్పదండి, రామడుగు, మానకొండూరు, పెగడపల్లి, శంకరపట్నం, సుల్తానాబాద్ మండలాల్లో ఈదురు గాలులతో వానపడుతోంది. ఫలితంగా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.మహిళపై కత్తితో దాడి హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో మహిళపై కత్తితో దాడి జరిగింది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. నడిరోడ్డు మీద మహిళపై కత్తి దాడి చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కేసీఆర్‌తో తేజస్వీ యాదవ్ భేటీ.. RJD Leaders meet kcr: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో.. బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలు, తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం BN Launched E-Paper: ప్రజాస్వామ్యంలో మీడియాకు ఓ విశ్వసనీయత ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో నడిచే చైతన్య రథం ఈ-పేపర్‌ను ఆయన ఆవిష్కరించారు. 50 లక్షల మందితో మోదీ '3డీ' సభ! Modi digital rally in UP: ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్చువల్ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభకు అధునాతన సాంకేతికతతో కొత్త హంగులు అద్దుతున్నారు కమలనాథులు. వందలాది చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసి.. మోదీ ప్రసంగాన్ని త్రీడీ ప్రొజెక్షన్లో లైవ్ ప్రసారం చేయనున్నారు. పోటీకి మాయావతి దూరం Mayawati in UP Election: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని వెల్లడించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర. ఈ ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐటీఆర్ గడువు పెంపు IT returns date extension: 2021-22 మదింపు సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు తేదీని పొడిగించింది సీబీడీటీ. మార్చి 15 వరకు ఇందుకు అవకాశమిస్తున్నట్లు తెలిపింది.హీరోయిన్‌కు కరోనా హీరోయిన్ కీర్తిసురేశ్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రతిఒక్కరూ జాగ్రత్త చర్యలు పాటించాలని, వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరింది.'పుష్ప: ది రూల్' కోసం స్క్రిప్ట్‌లో మార్పులు! Pushpa 2 script: అల్లుఅర్జున్ హీరోగా 'పుప్ప' పార్ట్-1 విడుదలై సూపర్ హిట్‌ను అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో బీటౌన్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని పార్ట్-2కు సంబంధించిన స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారట.టీమ్ఇండియాకు షాక్.. ఆల్‌రౌండర్‌కు కొవిడ్ Washington Sundar Corona: కొద్దిరోజుల్లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే జట్టుకు ఎంపికైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.