ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు సీఎంలతో మోదీ భేటీ- మళ్లీ ఆంక్షలు విధిస్తారా? PM Modi meeting with CMs: కరోనా పరిస్థితిపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం సమావేశం కానున్నారు ప్రధాని మోదీ. దేశంలో కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు పలు సూచనలు చేయనున్నారు.నిజామాబాద్‌కు విజయవాడ పోలీసులు izamabad Family Suicide Case Updates : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్య కేసుపై విచారణ జరిపేందుకు విజయవాడ పోలీసులు నిజామాబాద్ చేరుకున్నారు. ఏ రాష్ట్రం పోటీ పడలేదు Vinod Kumar Comments on BJP Leaders : తెలంగాణకు వచ్చి విమర్శలు చేసిన భాజపా నేతల రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమం తెలంగాణకు కనీసం పోటీ ఇవ్వలేవని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. విమర్శలు చేయడం కాదు.. అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.గాంధీలో ఆ సేవలు బంద్ non essential surgeries cancelled in gandhi hospital: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు సైతం.. పెరగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎస్‌లోనే హత్యాయత్నం ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే చెల్లెలిపై అన్న కత్తితో దాడి చేశాడు. కోవూరుకు చెందిన అబ్బాయి, బుచ్చికి చెందిన అమ్మాయికి ప్రేమించుకున్నారు. 35 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తీర్పు Corruption charges: అవినీతి ఆరోపణల కేసులో ఓ వ్యక్తిని నిర్దోషిగా తేల్చుతూ.. తీర్పు వెలువరించింది బాంబే హైకోర్టులోని నాగ్‌పుర్ బెంచ్. ఈ కేసు నమోదైన 35 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేలటం గమనార్హం. ఈ అలుపెరగని పోరాటంలో విజయం సాధించినా.. నిందితుడి సగం జీవితం కోర్టుల చుట్టూ తిరిగేందుకే గడిచిపోయింది.మనిషికి పంది గుండె Pig heart in human: మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చి వైద్యరంగంలో మరో అద్భుతం చేశారు డాక్టర్లు. అమెరికా మేరీల్యాండ్ మెడికల్ యూనివర్సిటీలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని వారాలపాటు పర్యవేక్షించాలని వైద్యులు చెప్పారు.ఐపీఎల్‌కు కొత్త స్పాన్సర్.. ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ షిప్‌ను టాటా గ్రూపునకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది బీసీసీఐ. వివో ఈ కాంట్రాక్టు నుంచి తప్పుకొనేందుకు అంగీకరించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.రేణు దేశాయ్‌కి కరోనా టాలీవుడ్ నటి రేణు దేశాయ్ కరోనా బారినపడ్డారు. ఆమెతో పాటు తనయుడు అకీరాకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు రేణు. బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ IND vs SA Test: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టు కేప్‌టౌన్ వేదికగా మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.